State of The Economy After Lockdown లాక్డౌన్ తర్వాత ఆర్ధిక కార్యకలాపాల సరళి ఎలా ఉండనుంది?
State of The Economy After Lockdown లాక్డౌన్ తర్వాత ఆర్ధిక కార్యకలాపాల సరళి ఎలా ఉండనుందో తెలుసుకునే ముందు ప్రస్తుతం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై కొవిడ్-19 ప్రభావం ఎలా ఉందనేది ప్రత్యేకించి చెప్పవలసిన అవసరంలేదు.
ఐతే లాక్డౌన్ తర్వాత ఆర్ధిక కార్యకలాపాలు ఎలా ఉండనున్నాయి అనే దానిపై మాత్రం లాక్డౌన్ ఎంత కాలం ఉండబోతోంది, ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ స్థితి గతులు, వీటన్నిటిని మించి వినియోగదారుడి ఆర్ధిక కార్యకలాపాల సరళి ఎలా ఉండబోతోంది అనే దానిపై ఆధారపడి ఉండనుంది.
ఈ గడ్డు కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ప్రభుత్వాలు ఆర్ధిక వ్యవస్థకి ఊతాన్నిచ్చేందుకు కోసపరంగా, విత్తపరంగా అనేక చర్యలు చేపడుతున్నవి.
చదవండి: May 2020 Important Days and Events
అదే దృఢమైన ఆర్ధిక వ్యవస్థ
ఈ చర్యలు ఆర్దిక వ్యవస్థల పునరుద్ధరణకు ఏ మేరకు ఉపకరించ బోతున్నాయి, ఆర్ధిక అసమానతలు పెరగకుండా ఇవి ఎంతవరకు ఉపయోగ పడనున్నవి అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశమే.
కోవిడ్-19 సృష్టించిన అవరోధాలు అనన్నింటిని అధిగమించి నిలదొక్కుకో గల్గిన దేశమే ఈ విపత్కర పరిస్థితుల్లో ధృడమైన ఆర్ధిక వ్యవస్థగా నిలువగల్గుతుంది.
లాక్డౌన్ తరువాత వినియోగదారుడు ఏ రంగాలవైపు మొగ్గు చూపితాడో ఆ రంగాలు మాత్రమే ఈ మహమ్మారి కట్టడి తరువాత ఆర్ధికంగా అభివృద్ధి చెందుతాయి.
వినియోగదారుని థృక్కోణంపై ఈ మహమ్మారి అపరిమితమైన ప్రభావమే చూపిందనవచ్చు.
దాదాపు 40 రోజులుగా దేశాన్ని స్ధంబింప జేసిన ఈ లాక్డౌన్ మన దేశంలో అత్యవసర, నిత్యవసర రంగాలు తప్ప మిగిలిన అన్ని రంగాలపైనా తీవ్ర ప్రభాన్నే చూపింది అనడంలో ఎలాంటి సంకోచం అవసరం లేదు.
చదవండి: International Labour Day 1 May 2020
స్ధంబించిన సరఫరా వ్యవస్థ
దాదాపుగా నిలిచిపోయిన రవాణా వ్యవస్థ కారణంగా సరఫరా వ్యవస్థ పూర్తి అస్థవ్యస్థంగా తయారయింది.
సాధారణంతో పోలిస్తే కనీసం పది శాతం కూడా పనిచేయని రవాణా రంగం ముడిసరుకుల కొరతకు కారణం కావచ్చు.
ఇది State of The Economy Lockdown లక్డౌన్ తర్వాత ఉత్పత్తి సామర్ధ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభానం చూపే అవకాశం లేకపోలేదు.
అదే కునక జరిగితే తయారీ రంగాలు కోలుకోడానికి మరింత సమయం పట్టే ఆస్కారం లేక పోలేదు.
తయారీ రంగం లో పనిచేస్తు్న్న లక్షల మంది సాధారణ మరియు వలస కార్మికులే కాక అనేక మంది తాత్కాలిక సిబ్బంది సైతం ఈ లాక్డౌన్ నిరుద్యోగులుగా మార్చేసింది.
చదవండి: World Intellectual Property Day
ఆంతర్జాతీయంగా పతనమైన డిమాండ్ బ్యాంకింగ్ రంగానికి పొంచి ఉన్న ముప్పు
ఈ నిరుద్యోగితకు తోడు క్షీణించిన అంతర్జాతీయ డిమాండు పరిస్థితి దిగజారడానికి ఆజ్యం పోస్తున్నట్లుంది.
ఈ క్షీణత ప్రపంచ వ్యాప్తంగా గృహ రంగం, కార్పోరేటు రంగాల పైనే కాక ప్రభుత్వాలపై సైతం ప్రభావం చూపనుంది.
ఇది పొదుపులను హరించడమే కాక రుణాలను భారాన్ని సైతం పెంచడంవలన ఒక కొత్త సంక్షోభానికి కారణం కావచ్చు.
అదే కనుక జరిగితే పెరిగిన రుణ భారం రుణాల ఎగవేతలకు, తద్వారా దివాలాలకు దారితీస్తుంది.ఇది బ్యాంకింగ్ రంగానికి పెద్ద సవాలుగా మారి మరో ఆర్ధిక సంక్షోభానికి తెరతీయ వచ్చు.
బాంకింగ్ రంగానికి పొంచి ఉన్న పెను ప్రమాదంగా దీన్ని భావించవచ్చు.
మారనున్న State of The Econmy after Lockdown భారత్ సహా, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పెరిగిపోతున్న ఆర్ధిక అసమానతలు దీని వలన మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదు.
ప్రపంచ దేశాలన్నింటిని కుదిపేస్తున్న ఈ కోవిడ్-19 మహమ్మారి కోరలను శాస్త్రవేత్తలు త్వరలో విరిచేయాలని, మానవాళికి ఈ వపత్కర పరిస్థితుల నుండి త్వరలో ఉపశమనం కలగాలని ఆశిద్దాం.