Lockdown 3.0 – What to do What not to do?
Lockdown 3.0 – What to do What not to do? మార్చి 24 తేది, ప్రధాని మోదీ మొదటి సారి లాక్డౌన్ ప్రటకనతో ప్రజలముందుకు వచ్చిన రోజది.
కరోనాను కట్టడి చేయడానికి అదే సరైన వ్యూహమని దేశ ప్రజలందరూ మోదీకి బాసటగా నిలిచారు.
మొదట ఏప్రల్ 13 వరకు లాక్డౌన్ పాటిస్తే ఈ మహమ్మారి నుండి విముక్తి లభిస్తుందని భావించారు.
ఈ కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు సత్ఫలితాలు చూపించాయి. ఐతే సమస్య పూర్తిగా సమసిపోలేదు.
కోత్త కేసులు నమోదులో ప్రపంచ దేశాలతో పొల్చి చూస్తే భారతదేశంలో లాక్డౌన్ మరియు ప్రభుత్వంతో పాటు ప్రజలు చూపిన స్వీయనిర్బంధం కారణంగా చాలా వరకు కట్టడి చేయగలిగాము.
కానీ ముందుగా అనుకున్నట్లు ఏప్రిల్ 13తో లాక్డౌన్ ఎత్తివేస్తే సమస్య జఠిలమౌతుందని భావించిన కేంద్రం ఆ లాక్డౌను మరల మే 3 వరకు పొడిగించారు.
ఐతే 1 మే న ప్రధాని మోదీ మరోసారి ప్రజల ముందుకొచ్చారు. ఇంతవరకు ప్రజలు అందించిన సహకారానికి పాటించిన స్వీయ క్రమశిక్షణకి మన్ననలందించారు.
ఈ కరోనా మహమ్మారి నుండి పూర్తిగా బయటపడాలంటే దానికి మందు కనిపెట్టేవరకు అన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సిందే.
అందుకే ప్రస్తుతం 3 మే తేదీతో ముగియాల్సిన లాక్‌డౌన్‌ను మరో 2వారాలు పొడగిస్తూ మే 17 వరకు లాక్‌డౌన్‌ను పొడగిస్తూ మరో ప్రకటన చేసారు ప్రధాని.
ఈ సారి లాక్డౌన్ 3.0 సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు పాటించాల్సిన నియమాలు, చేయ దగ్గ చేయ కూడని పనుల గురించి కొన్ని మార్గదర్శకాలు కేంద్రం విడుదల చేసింది.
అవేంటో ఈ Lockdown 3.0 What to do what not to do ఆర్టికల్‌లో తెలుసుకుందా.
చదవండి: May 2020 Important Days and Events
దేశవ్యాప్తంగా నిషేధించబడ్డవి
- గృహమంత్రిత్వ శాఖ అనుమతించిన రంగాలు తప్ప రైలు, రోడ్డు, వాయు, మెట్రో సహా అన్ని రకాల రవాణాల నిషేధించబడ్డాయి.
- అధిక జన సముదాయాలకు ఆస్కారమిచ్చే వ్యాయమశాలలు, ధియేటర్లు, షాపింగ్ మాల్సు, బార్లు, మొదలైనని మూసి ఉంచాలి.
- పాఠశాలలు, కళాశాలలు, శిక్షణా కేంద్రాలు ఇలా అన్ని రకాల విద్యా సంస్థలు మూసే ఉంచాలి. (ఐతే ఆన్లైన్ లేదా దూర విద్యకు అనుమతివ్వబడింది).
- హాస్పిటాలిటీ సేవలు నిలిపి ఉంచాలి(హోటళ్లు, రెస్టారెంట్లు, రెసార్ట్లు, మొదలైనవి).
- మతపర, సామాజిక, రాజకీయ పరంగా జన సమూహలుగా ఏర్పడరాదు.
- సాయంత్రమ 7గం. నుండి ఉదయం 7గం.వరుకు అత్యవసర కార్య కలాపాలకు తప్ప ఎట్టి పరిస్థితులలో బయట తిరుగరాదు.
టెలిగ్రాం యాప్ ద్వారా మా అప్డేట్స్ పొందేందుకు: https://t.me/onlineappsc
జోన్ల వారీగా అమలు ఉండే నిషేధాలు సడలింపులు.
రెడ్ జోన్లో నిషేధించ బడ్డ అంశాలు: Lockdown 3.0 What to do what not to do in Red Zones(రెడ్ జోన్)
RED జోన్లలోని వ్యాధి ప్రబలిన ప్రాంతాలలో:
-నిత్యావసర వస్తువులు సేవల సరఫరా మరియు అత్యవసర ఆరోగ్య సేవలు తప్ప మరే రకమైన కదలికలైనా నిషేధించబడ్డాయి.
-ఒ.పి.డి.లు మరియు క్లినక్లు నిషేధించబడ్డాయి.
రెడ్ జోన్లలోని వ్యాధి ప్రబలిన ప్రాంతాల వెలుపలి ప్రాంతాలలో నిషేధించబడ్డవి:
-రిక్షా, టాక్సీ, బస్సు, క్షురశాలలు, స్పాలు మొదలైనవన్ని నిషేధించ బడ్డాయి.
-వీటితో పాటు పైన పేర్కొన్న దేశవ్యాప్తంగా అమలులో ఉండే అన్ని రకాల నిషేధాలు వర్తిస్తాయి.
రెడ్ జోన్లలో వ్యాధి ప్రబలిన ప్రాంతాల వెలుపలి ప్రాంతాలలో షరతులతో అనుమతించబడ్డవి:
చదవండి: State of The Economy After Lockdown
పట్టణ ప్రాంతాలలో:
— అనుమతించబడ్డ కార్యకలాపాలకై వ్యక్తుల వాహనాల కదిలకలు అనుమతించారు.
— పట్టణాలలోని సెజ్‌లు మొదలైన ప్రాంతాలలో స్థాపించబడ్డ పరిశ్రమలు.
— మందులు, వైద్య ఉపకరాలు, మొదలైన అత్యవసర నిత్యవసర వస్తువుల తయారీ మరియు సరఫరా.
–జనపనార పరిశ్రమ, మరియు IT హార్డ్‌వేర్ తయారీ.
–పని జరిగే ప్రాంతంలోని నివాసమున్న సందర్భంలో భవన నిర్మాణాలు అనుమతించబడ్డాయి.
–ఇంటి పరిసరాలలో, గుృహ సముదాయాలలో గల దుకాణాలకు (మాల్స్ కాదు) నిత్యావసరమైనా కాకున్నా తెరవవచ్చు.
–నిత్యావసర వస్తువుల క్రయ విక్రయాలు ఆన్లైన్ మాధ్యమం ద్వారా అనుమతించబడ్డాయి.
–ప్రైవేటు కార్యాలయాలను 33శాతం సిబ్బందితో పనిచేయడానికి అనుమతించారు.
–వృద్ధాశ్రమాలు, బాలలగృహాలు, అనాధాశ్రమాలు నడిపేందుకు అనుమతించారు.
–ప్రభుత్వ కార్యాలయాలు, అత్యవసర, ఆరోగ్య, పారిశుధ్య, మరియు భద్రతా సేవలు అందించవచ్చు.
గ్రామీణ ప్రాంతాలలో అనుమతించబడ్డవి:
–అన్ని పరిశ్రమలు మరియు భవన నిర్మాణ కార్యక్రమాలు.
–షాపింగ్ మాల్స్ తప్ప మిగిలిన అన్ని దుకాణాలు.
–అన్ని వ్యవసాయ మరియు అనుబంధ కార్యకలాపాలు.
–అన్ని ఆరోగ్య సేవలు.
–బాంకింగ్, బాంకింగేతర సహా అన్ని రకాల ఆర్ధిక సేవలు.
–ప్రజా వినియోగ కొరియర్, మరియు తపాలా సేవలు.
–ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా.
–IT, మరియు IT అనుబంధ సేవలు
–గిడ్డంగులు, క్షురకులు తప్ప ఇతర స్వయంఉపాధిదారుల సేవలు అనుమతించబడ్డాయి.
Lockdown 3.0 What to do what not to do in Orange zones (ఆరెంజు జోన్లలో):
నిషేధించినవి:
–గృహమంత్రిత్వ శాఖ అనుమతించిన వాటికి తప్ప మరే ఇతర రకమైన సందర్భాలలో బస్సులు నడుప రాదు.
అనుమతించినవి:
–రెడ్ జోన్నలలోని వ్యాధి ప్రభలిన ప్రాంతాల వెలుపల గల ప్రాంతాలలో అనుమతించిన అన్ని కార్యకలాపాలు
–కేవలం ఇద్దరు ప్రయాణికులతో టాక్సీ సేవలు
–అనుమతించబడ్డ కార్యకలాపాలకు జిల్లాల వెలుపలకు వ్యక్తుల వాహనాల కదలిక
–డ్రైవర్ మరియు ఇద్దరు ప్రయాణికలతో కారులో ప్రయాణించడం.
–ద్వచక్ర వాహనంపై ఇద్దరు (చోదకునితో సహా)
Lockdown 3.0 What to do what not to do in green zones (గ్రీన్ జోన్లలో):
–దేశ వ్యాప్తంగా నిషేధించిన కార్యకలాపాలు తప్ప మిగిలిన అన్ని కార్యకలాపాలు అనుమతించబడ్డాయి.
–50శాతం సామర్ధ్యంతో బస్సు సేవలు అందించవచ్చు.
ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్ట చర్యలో కట్టడి చేసిన వాటిని ప్రజలుగా మనమందరం ఆ నిబంధనలను పాటిస్తూ స్వీయ నిర్బంధంలో ఉంటేనే ఈ మహమ్మారిని జయించడంలో మన వంతు కర్తవ్యం మనం అందించినట్లు.