Is lockdown going to bring back the poverty?
లాక్డౌన్ ముగిసే వేళకి పేదరికం కోరలు విప్పనుందా?
Is lockdown going to bring back the poverty? లాక్డౌన్ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై చూపిస్తున్న ప్రభావాన్ని అర్ధం చేసుకునేందుకు కల్పిత పాత్రలతో కొన్ని కల్పిత సన్నివేశాలను చేరుస్తూ వాస్తవికతను బేరీజు వేసేందుకు చేసిన ప్రయత్నం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.
లాక్డౌన్ ముగిసే వేళకి పేదరికం కోరలు విప్పుతుందా అంటే అవునేమో అనిపిస్తుంది. కరోనా తలవ్రాతలు తలక్రిందలు చేసింది.
కరోనా ప్రపంచంలో ఎందరి కలలనో కర్కసంగా చిదిమేసింది, కష్టాల ఊబిలోకి నెట్టేసింది, దశాబ్దాల తరబడి శ్రమించి సాధించిన ప్రగతిని తిరిగి పేదరికపు విషవలయంలోకి నెట్టేసింది.
చదవండి: World Malaria Day 25 April
పసి ప్రాయంలో…
1990లో ఆరేళ్ళ వయసులో తోటి పిల్లలందరూ చక్కగా ముస్తాబయి కాన్వెంట్లలో ఇంగ్లీషు మీడియం చదువుల కోసం రంగురంగుల సంచీలు వీపున తగిలించుకుని వెళ్తుండటం చూసేవాణ్ణి.
తోటి వారందరూ అలా రంగురంగుల బట్టలు వేస్కుని కాన్వెంటు బళ్ళకి పోతుంటే గుండీలు లేని చొక్కా వేస్కుని కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా చేతిలో పలక పట్టుకుని మా ఇంటికి కొంచెం దూరంగా ఉన్న ప్రభుత్వ బడికి తీసుకెళ్ళేది అమ్మ
నేనూ కాన్వెంట్లో చదువుకుంటానని పట్టుబట్టే నాకు అమ్మ చెప్పే ఆర్ధిక ఇబ్బందులు అర్ధమయ్యేవి కావు. పసి వయసు మరి.
అమ్మ ఎన్ని చెప్పినా నాకు మాత్రం ఒకటి బాగా అర్ధమైంది నేను అలా కాన్వెంటు చదువులు చదవలేక పోడానికి కారణం మా పేదరికం అని.
అప్పుడే నాకు జీవితంలో రాజీబడటం పరిచయమైంది. ప్రపంచంలో ఉన్నవారిలే దాదాపు 36% మాలాంటి వాళ్ళేనని(పేదలేనని) తరవాత తెలిసింది.
నాతో పాటే నాలో రాజీపడే అలవాటు కూడా పెరిగింది. 13 ఏళ్ళ వయసు వచ్చే సరికి మా ఇల్లు పూరి గుడిసెనుండి రేకుల గదిలోకి మారింది.
పరిస్థితులు మెరుగ పడతున్నవి అనుకుంటుండగానే ఒక్కరోజులో జీవితం మళ్లీ అంధకారమైపోయింది.
ఎప్పటిలాగే పనికి వెళ్ళిన నాన్న ఆ రోజు ఇంటికి తిరిగి రాలేదు, రాత్రి ఎంత ఎదురు చూసినా నాన్న కోసం వెళ్ళిన అమ్మ కూడా తిరిగి రాలేదు.
చదవండి: May 2020 Important Days and Events
అంతా చీకటే…
ఆ రాత్రి ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు. అమ్మ లేపకుండానే పొద్దున్నే మెలుకువ వచ్చింది ఆ రోజు. లేచి చుట్టూ చూస్కున్నాను అమ్మ నాన్న వచ్చారేమోనని, కాని ఇద్దరూ లేరు.
కొంత సేపటికి మామయ్య వచ్చాడు, ఇంటికి తాళం వేసి నన్ను కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళాడు. అప్పుడు మామయ్య చెప్పిన మాటకి నాకు ఒక్కసారిగా ఊపిరాగినంత పనైంది.
నాన్న పని చేస్తున్న ఫాక్టరీలో మంటలు చెలరేగాయని, ఆ మంటల్లో నాన్నతో పాటు ఇంకా చాలా మంది చనిపోయారని చెప్పాడు.
విషయం తెలుసుకున్న అమ్మ షాక్ కులోనై కోమాలోకి వెళ్ళిందని చెప్పాడు. కొన్ని రోజులకు అమ్మకూడా నాన్న దగ్గరకు వెళ్ళిపోయింది.
నేను మామయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను. అత్తయ్యకు నేను అక్కడ ఉండటం ఇష్టం లేదు. ఏం చేస్తుంది పాపం మామయ్య వాళ్ళవి కూడా ఏ రోజు తిండి ఆరోజే సంపాదించుకునే బ్రతుకులు.
పంచంలో కరువు తాండవం చేయడం తగ్గిందన్నారు అందరూ, కాని నేను అది ఇంకా చూస్తూనే ఉన్నాను.
మామయ్య నన్ను తనకు తెలిసిన వాళ్ళ దగ్గర పనిలో చేర్చాడు. అది బాగా రద్దీగా ఉండే ఒక పెద్ద కిరాణా దుకాణం.
బసా, తిండి అంతా వాళ్ళ దెగ్గరే. యజమాని కూడా నన్ను బాగానే చూసుకునే వాడు. చాలా కాలం ఆ దుకాణంలోనే పని చేసాను.
టెలిగ్రాంలో మా అపడేట్స్ కేసం https://t.me/onlineappsc
కాలం నేర్పిన పాఠాలు…
అది 2016 కాల క్రమంలో పెళ్ళీ, పిల్లలూ అన్నీ జరిగిపోయాయి. ఏళ్ళు గడిచేకొద్దీ జీవితం నేర్పిన పాఠాలతో ఒడిదుడుకులు తట్టుకుంటూ ముందుకు సాగాను.
గడిచిన 10 ఏళ్ళలో మన దేశంలో నాలాంటి వాళ్లు చాలామంది(దాదాపు 21 కోట్ల మంది) పేదరికపు జ్ఞాపకాలనుండి బయటకి వస్తున్న రోజులవి.
రెండేళ్ళైంది ఒక పెద్ద బట్టల దుకాణంలో సేల్స్ మాన్ గా చేరి. మంచి జీతమూ అందేది. ప్రతీ నెలా జీతమని, ఎలవెన్సులని అన్నీ కలిపి ఓ నలభై వేలవరకూ అందేవి.
ఇరుకు గుడిసెలో మొదలైన నా జీవితం ప్రస్తుతం అద్దెదైనప్పటికీ రెండు పడక గదుల ఇంటికి చేరింది. చెప్పులు లేకుండా, గుండీలు కూడా లేని చొక్కాలు వేస్కును ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళిన నేను, నా కొడుకుని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించాను.
ఇది తలుచుకుని అప్పుడప్పుడు కొద్దిగా గర్వపడేవాడ్ని.
మళ్లీ మొదటికేనా? Is lockdown going to bring back the poverty?
అంతా సాఫీగా సాగుతుంది అనుకునేలోపే కాలం నామీద మరోసారి తన అక్కసు వెళ్ళబుచ్చింది, కరోనా మహమ్మారి రూపంలో మరోసారి నా జీవితాన్ని కాటేసింది.
నెలనలా వచ్చే జీతం ఒక్కసారిగా ఆగిపోయింది. కట్టాల్సిన ఇంటి అద్దే, ఇల్లు గడవటానికి కావల్సిన నిత్యావసరాలు, ఇలా దాచుకున్న కొద్దిపాటి సొమ్ము ఇంకా ఎన్నో రోజులు మిగలదు.
జీవితం ఒక్క సారిగా 20 ఏళ్ళు వెనక్కి నెట్టేసినట్లైంది. ఈ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా రెండు దశాబ్దాలుగా సాధించిన ప్రగతిని చిదిమేసింది.
నాలాగే దాదపు 200కోట్ల మందిని ఇది పేదరికు అంచుల్లోకి నెట్టేసింది.
చదవండి: International Labour Day 1 May 2020
వివక్ష లేదు, కానీ…
ఈ వ్యాధి వ్యాప్తించడంలో ఎంత వివక్షరహితంగా ఉన్నా, వ్యాధి సోకాక మాత్రం ఆర్ధిక అంతరాల వ్యత్యాసం బాగా తెలుస్తుంది.
మనదేశంలో లక్షలాదిగా ఉన్న వలస కూలీల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది, లాక్డౌన్ ప్రకటన వారిని రాత్రికి రాత్రి నిరుద్యోగులుగా మార్చింది.
ఎక్కడో కుటుంబానికి దూరంగా ఉంటూ తాము సంపాదించే కొద్దిపాటి దాంట్లోనే ఇంటికి ఖర్చులకు పంపే వారు సంపాదన లేక ఆ డబ్బులు పంపలేని పరిస్థితులు.
ఇళ్ళల్లో అరకొరగ ఉండే ఆహార నిల్వలు అడుగంటిపోతే, ప్రభుత్వం అందించే సాయం ప్రశంశనీయమే, ఐతే మారుతున్న ఆర్ధిక పరిస్థితుల దృష్టా ప్రభుత్వాలు ఇలా ఎంత కాలం పేదలని ఆదుకోగలవు? వీటన్నిటినూ చూస్తే అనిపిస్తుంది, Is lockdown going to bring back the poverty
ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం 1998 తరువాత మళ్ళీ మొదటి సారిగా పేదరికం కోరలు విప్పనుంది.
ఎన్నో కష్టలనోర్చి జీవితంలో పేదరికపు ఛాయలనుండి బయటపడ్డ నాలాంటి వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50కోట్లమంది ఉన్నారని అదే ఐక్యరాజ్య సమితి తెలిపింది మరి. ఈ కరోనా దెబ్బకి వారంతా మళ్ళీ పేదరికంలోకి జారుకునే పరిస్థితి.
ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం దక్షిణ ఆఫ్రికాలో నాలాగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న లక్షల మంది ఇప్పటికే తమ ఉద్యోగలను కోల్పోయారు దాని ఫలితం 25 ఏళ్ళ తరువాత మొదటి సారి ఆ ఖండం ఆర్ధిక మాంద్యాన్ని మళ్లీ చూడనుంది.
చదవండి: State of The Economy After Lockdown
రేపేంటి?
Is lockdown going to bring back the poverty అంటే లాక్డౌన్ తర్వాత కూడా మా పెద్ద బట్టల దుకాణంలో ఉద్యోగం ఉంటుందన్న నమ్మకం లేదు.
ఒకవేళ ఉన్నా, కరోనా పుణ్యమా అని అమ్మకాలు మునుపటిలాగా ఉండవు కాబట్టి, జీతాలు కూడా మునుపటిలాగా ఉండకపోవచ్చు.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అందునా దక్షిణాసియాలో దాదపు ఇలాంటి పరిస్థితే, గడిచిన 4 దశబ్దాల కాలంలో ఎన్నడూ చూడని చేదు అనుభవాలను రుచి చూడవలసి రావచ్చు మరి.
మరికొంత కాలం ఈ మహమ్మారి ఇలాగే వీరంగం చేస్తే దశాబ్దాల కష్టంతో సాధించిన మధ్యతరగతి హోదా మింగేసి మళ్ళీ పేదరికానికే మమ్మలన్ని నెట్టక మానదు.
జీవితాలు మళ్ళీ రేకుల గదిలోకు మారతాయో, పూరిగుడిసెలకు చేరతాయో అర్ధంకాని పరిస్థితిలో పడిపోయినట్లైంది.
పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2030కి ప్రపంచంలో పేదరికాన్ని, ఆకలిని పారద్రోలాలి అందరికీ విద్యనందించాలన్న ఐక్యరాజ్యసమితి తీర్మానం ఒక కలగానే మిగిలిపేతుందేమో.
గుండెల్లోని దిగులునంతా పంటి బిగువున దాచిపెట్టి, రేపటి రోజు బాగుంటుందనే ఆశతో జీవితంలో ముందుకెళ్ళడమే కాలం నాకు నేర్పిన అతిపెద్ద పాఠం.