International Thalassaemia Day May 8
ప్రపంచ వ్యాప్తంగా మే 8న ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని (International Thalassaemia Day) జరుపుకుంటారు.
తలసెమియా అనేది పారపర్యంగా సంక్రమించే ఒక సమస్య. ఈ వ్యాధి ఉన్న వారికి రక్తంలో హిమోగ్లోబిన్ ఉండవలసిన దానికంటే తక్కువగా ఉంటాయి.
ఈ తలసేమియా వ్యాధితో బాధ పడుతున్న వారకి ధైర్యాన్ని నింపడమే కాక ఈ వ్యాధితో మరణించిన వారి జ్ఞాపకార్ధం ఈ ప్రపంచ తలసేమియా దినోత్సవం నిర్వహిస్తారు.
2020 సంవత్సరానికి గానూ ప్రపంచ తలసేమియా దినోత్సవం ఇతివృత్తం
“తలసేమియా కై నవ శకం: కొత్త చికిత్సలను రోగులకు చేరువగా మరియు తక్కువ ధరలకు అందేలా చేయడానికి ప్రపంచ వ్యాప్త కృషి చేయవలసిన సమయం”
(Theme of International Thalassaemia Day 2020): “The dawning of a new era for thalassaemia: Time for a global effort to make novel therapies accessible and affordable to patients”.
చదవండి: World Asthma Day
తలసేమియా అనేది రక్తానికి సంబంధించిన జన్యుపరమైన రుగ్మత, ఇది ఎర్ర రక్త కణాలలో ఉండే హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉత్పత్తికి అవసరమైన జన్యువులు లోపం వల్ల కలుగుతుంది.
ప్రతి ఎర్ర రక్త కణం 240 నుండి 300 మిలియన్ హిమోగ్లోబిన్ అణువులను కలిగి ఉంటుంది. వ్యాధి యొక్క తీవ్రత జన్యువులలో పాల్గొన్న ఉత్పరివర్తనలు మరియు వాటి పరస్పర చర్యపై ఆధారపడి ఉంటుంది.
హిమోగ్లోబిన్ అనేక రకాల ఉపకణాలను కలిగి ఉంటుంది, ఉదాహరణకి ఆల్ఫా, మరియు బీటా కణాలు. ఊపరితిత్తులలో ప్రాణవాయువు సక్రమంగా ఉండాలంటై ఈ రెండు కణాలు ఎంతే ముఖ్యమైనవి.
క్రోమోజోమ్ 16 లోని జన్యువులు ఆల్ఫా ఉపకణాల ఉత్పత్తికి కారణమవుతాయి, అలాగే క్రోమోజోమ్ 11 లోని జన్యువులు బీటా ఉపకణాల ఉత్పత్తిని నియంత్రిస్తాయి.
ఆల్ఫా కణాలను ఉత్పత్తి చేసే జన్యువులలో సమస్య ఉంటే ఆల్ఫా తలసేమియా అంటారు. బీటా కణాలను ఉత్పత్తి చేసే జన్యువులలో సమస్య ఉంటే బీటా తలసేమియాగా.
జన్యువు మరియు ఉత్పరివర్తనాల రకాన్ని బట్టి వ్యాధి తీవ్రత వివిధ స్థాయిలలో ఉండవచ్చు.
ఇలా అనేక రకాల తలసేమియా లక్షణాలు ఉన్నప్పటికి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తలసేమియా కేసుల్లో ఈ రెండు రకాలే అధికం.
అమ్నియోసెంటెసిస్ (amniocentesis) మరియు కొరియోనిక్ విల్లి శాంప్లింగ్ (chorionic villi sampling) వంటి విధానాలను ఉపయోగించి 10-11 వారాల గర్భధారణలో సమయంలోనే తలసేమియా నిర్ధారణ చేయవచ్చు.
తలసేమియా వ్యాధి ఉన్న వారు సంతాన లేమితో బాధ పడే అవకాశంతో పాటు సంతాన హీనులుగా మారే అవకాశమూ ఉంది.
ప్రారంభ దశలోనే చికిత్స పొందిన వ్యాధిగ్రస్థుల జీవన ప్రమాణాలు ఎంతగానో మెరుగుపడినట్లు పరిశోధనలు తెలుపతున్నవి.