India’s First Solar-Powered Miniature Train Launched In Kerala
భారతదేశపు మొదటి పూర్తి సౌరశక్తితో నడిచే సూక్ష్మ రైలు కేరళలో ప్రారంభించబడింది.
దేశంలో మొట్టమొదటిదిగా రూపొందిచబడిన సౌర శక్తితో నడిచే సూక్ష్మ రైలును తిరువనంతపురంలోని వేలి టూరిస్ట్ విలేజ్ వద్ద కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం ప్రారంభించారు.
ముఖ్యంగా పిల్లలను ఆకర్షించే ఈ రైలు, అక్కడ ఉన్న సౌకర్యాలను అంతర్జాతీయ ప్రమాణాలకు పెంచడానికి పూర్తిగా ₹ 60 కోట్ల విలువైన అనేక ప్రాజెక్టులలో భాగం.
వెలి సరస్సు అరేబియా సముద్రంలో కలుసే ఆ సుందర గ్రామంలో “అర్బన్ పార్క్” మరియు ఇకో-ఫ్రెండ్లీ ఈత కొలనును విజయన్ ప్రారంభించారు, ఆ గ్రామం రాష్ట్ర రాజధాని శివార్లలో ఉంది.
సూక్ష్మ రైలు వ్యవస్థలో, సొరంగం, స్టేషన్ మరియు టికెట్ కార్యాలయంతో సహా పూర్తిస్థాయి రైలు వ్యవస్థ యొక్క అన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ రైలులో మూడు బోగీలు ఉన్నాయి, వాటిలో ఒకేసారి 45 మందితో ప్రయాణించవచ్చు.
Join us on YouTube
“పర్యావరణ అనుకూల సౌరశక్తితో పనిచేసే ఈ సూక్ష్మ రైలు 2.5 కిలోమీటర్లు సందర్శకులను ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించే అవకాశం అందిస్తుంది. పది కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు దేశంలోనే మొదటిది” అని ముఖ్యమంత్రి తన ఆన్లైన్ ప్రసంగంలో చెప్పారు.
రైలు యొక్క ఇంజిన్ ద్వారా కృత్రిమ ఆవిరి, పాతకాలపు ఆవిరి లోకోమోటివ్ ను గుర్తుకుతేక మానదు.
స్టేషన్ హౌస్ కూడా సాంప్రదాయ శైలిలో రూపొందించబడింది. ఈ వ్యవస్థ ద్వారా ఉత్పన్నమయ్యే మిగులు శక్తిని కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డు గ్రిడ్‌కు అనుసంధానం చేస్తామని విజయన్ తెలిపారు.
పర్యాటక సదుపాయాల కేంద్రం, కన్వెన్షన్ సెంటర్ మరియు ఆర్ట్ కేఫ్ కూడా త్వరలో వెలిలో ప్రారంభించబడతాయి.
కన్వెన్షన్ సెంటర్లో ఆర్ట్ గ్యాలరీ, రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక మరియు సాంస్కృతిక కేంద్రాలను ప్రదర్శించడానికి డిజిటల్ ప్రదర్శన సౌకర్యం మరియు ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంటుంది.
ఈ ప్రపంచ స్థాయి సౌకర్యాలు వెలికి కొత్త రూపాన్ని ఇస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు.
పర్యాటక శాఖకు ప్రభుత్వం సుమారు ₹ 120 కోట్లు కేటాయించినట్లు అధ్యక్షత వహించిన పర్యాటక శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ వివరించారు.
వీటిలో వెలిలోనే ₹ 60 కోట్ల విలువైన ప్రాజెక్టులకు పరిపాలనా అనుమతి ఇవ్వబడింది.
వెలీని పర్యాటకులకు అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చాలన్న ప్రభుత్వాల సంకల్పానికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు.
వెలిలోని ప్రాజెక్టులలో, 20 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి, ఇతర పథకాలు పురోగమిస్తున్నాయని, పర్యాటక సౌకర్యాల కేంద్రాన్ని జనవరిలో ప్రారంభిస్తామని చెప్పారు.
అర్బన్ పార్కుకు 5 కోట్ల బడ్జెట్ మరియు స్విమ్మింగ్ పూల్ ₹ 2.5 కోట్లు కేటాయించబడ్డాయి.
Also Read: BrahMos supersonic cruise missile test fired from a Sukhoi-30 fighter aircraft