Saffron bowl of India extends to the North East

Saffron bowl of India extends to the North East

Saffron bowl of India extends to the North East

Saffron bowl of India extends to the North East

ఈశాన్యంలో వికసించిన కుంకుమపువ్వు

ఈశాన్య ప్రాంతంలో కుంకుమ పువ్వు సాగు అవకాశాలను అన్వేషించడానికి పైలట్ ప్రాజెక్టును NECTAR చేపట్టింది

పాంపోర్ (కాశ్మీర్) మరియు యాంగ్యాంగ్ (సిక్కిం) మధ్య వాతావరణ మరియు భౌగోళిక పరిస్థితుల సారూప్యత యాంగ్యాంగ్‌లో కుంకుమపువ్వు యొక్క విజయవంతమైన నమూనా వ్యవసాయానికి దారితీస్తుంది

కుంకుమ పువ్వు పెంపకాన్ని మెరుగుపరచడానికి కుంకుమపువ్వుపై జాతీయ మిషన్ అనేక చర్యలపై దృష్టి పెడుతుంది

ఇప్పటివరకు కాశ్మీర్‌కు పరిమితం అయిన కుంకుమ పువ్వు త్వరలో భారతదేశ ఈశాన్యానికి విస్తరించవచ్చు. కాశ్మీర్ నుండి సిక్కింకు రవాణా చేయబడ్డ విత్తనాల నుండి మొలకెత్తని మొక్కలు అక్కడ వాతావరణానికి అలవాటు పడ్డాయి, ఈశాన్య రాష్ట్రంలోని దక్షిణ భాగంలో యాంగ్యాంగ్లో ఇప్పుడు కుంకుమ పువ్వు వికసిస్తుంది.

కుంకుమ పువ్వు ఉత్పత్తి చాలా కాలంగా కేంద్ర పాలతి ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌లో పరిమిత భౌగోళిక ప్రాంతానికి పరిమితం చేయబడింది. భారతదేశంలో ఇప్పటి వరకూ కాశ్మీరీ కుంకుమపువ్వు దిగుబడి అత్యధికంగా ఇస్తుంది కాశ్మీర్ లోని పాంపోర్ ప్రాంతం, అందుకే ఈ ప్రాంతాన్ని సాఫ్రన్ బౌల్ అని పిలుస్తారు, తరువాత బుద్గాం, శ్రీనగర్ మరియు కిష్టివార్ జిల్లాలు ఉన్నాయి.

Join us Telegram

కుంకుమపువ్వు సాంప్రదాయకంగా ప్రసిద్ధ కాశ్మీరీ వంటకాలతో సంబంధం కలిగి ఉంది. ఇది దాని ఔషధ విలువలు కారణంగా కాశ్మీర్ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వంలో భాగంగా పరిగణించబడ్డాయి.

కుంకుమ పెంపకం కాశ్మీర్‌లో చాలా నిర్దిష్ట ప్రాంతాలకు పరిమితం కావడంతో, దాని ఉత్పత్తి పరిమితమైంది. కుంకుమ పువ్వుపై జాతీయ మిషన్ దీని వ్యవసాయాన్ని మెరుగుపరిచేందుకు అనేక చర్యలపై దృష్టి సారించినప్పటికీ, ఈ చర్యలు ఇప్పటికీ కాశ్మీర్‌లోని పేర్కొన్న ప్రాంతాలకు పరిమితం చేయబడ్డాయి.

Saffron bowl of India extends to the North East

సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ అయిన నార్త్ ఈస్ట్ సెంటర్ ఫర్ టెక్నాలజీ అప్లికేషన్ అండ్ రీచ్ (NECTAR), భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో అంతే నాణ్యతతో అధిక దిగుబడి అందేలా కుంకుమపువ్వు సాగు సాధ్యాసాధ్యాలను ఆధ్యయనం చేయడానికి ఒక పైలట్ ప్రాజెక్టుకు రూపొందించింది.

సిక్కిం సెంట్రల్ యూనివర్శిటీ యొక్క వృక్షశాస్త్రం మరియు ఉద్యానవన విభాగం సిక్కిం యొక్క యాన్యాంగ్ యొక్క నేల మరియు వాస్తవ పిహెచ్ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి పరీక్షలు నిర్వహించింది మరియు ఇది కాశ్మీర్ యొక్క కుంకుమపువ్వు పెరుగుతున్న ప్రదేశాలతో పోల్చదగినదిగా గుర్తించింది. కుంకుమ విత్తనం/మొలకలను కాశ్మీర్ నుండి యాంగ్యాంగ్ లో సాగుకై డిపార్ట్మెంట్ కొనుగోలు చేసింది.

ఒక కుంకుమ పువ్వు పెంపకందారును ఈ సాగు ప్రక్రియ సాగినంత కాలం క్షేత్ర స్ధాయిలో పంట స్వభావాన్ని గమనించేందుకు నియమించడం జరిగింది.

ఈ మొలకలు సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలలో సేద్యం చేయబడ్డాయి తద్వారా సకాలంలో మొలకెత్తడం మరియు మంచి దిగుబడిని అందించ గలుగుతుంది.

పాంపోర్ (కాశ్మీర్) మరియు యాంగ్యాంగ్ (సిక్కిం) మధ్య వాతావరణ మరియు భౌగోళిక పరిస్థితుల సరిపోలిక యాంగ్యాంగ్‌లో కుంకుమపువ్వు యొక్క విజయవంతమైన నమూనా వ్యవసాయానికి దారితీసింది.

నాణ్యమైన కుంకుమపువ్వు ఎండబెట్టడం మరియు సమర్థవంతంగా పంటకోత ప్రాసెసింగ్ కుంకుమ పువ్వు రికవరీని మెరుగుపరుస్తుంది, తద్వారా దాని ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది.

అంతేకాకుండా, మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్‌తో పాటు నార్త్ ఈస్ట్ రీజియన్‌లోని ఇతర ప్రాంతాలకు తక్షణ ఫలితాలు మరియు ఈ సాగును విస్తరించేందుకు నేల పరీక్ష, నాణ్యత, పరిమాణం మరియు సాధ్యతలకు తోడు అదనపు విలువ జోడించ గలగటం సహా అన్ని పారామితుల యొక్క వివరణాత్మక విశ్లేషణ మరియు పరీక్షలు ప్రణాళిక చేయబడ్డాయి.

Also Read : 30 Indian Cities To Face ‘Severe Water Risk’ by 2050 says WWF