56,368 New Houses approved under PMAY(U)

56,368 New Houses approved under PMAY(U)

పీఎంఏవై(యు) కింద 56,368 కొత్త ఇళ్లకు అనుమతి
కేంద్ర మంజూరు, పర్యవేక్షణ కమిటీ 53వ సమావేశం జరిగింది

 

“ఇక అమలు చేయడం, నిర్వర్తించడం అనే పధ్ధతిని ఆచరించాలి”: దుర్గా శంకర్ మిశ్రా

పీఎంఏవై-యు కింద 56,368 ఇళ్ల నిర్మాణానికి నిన్న సాయంత్రం జరిగిన 53 వ కేంద్ర మంజూరు మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం అనుమతి ఇచ్చింది. ఈ గృహాలను పీఎంఏవై-యు మిషన్ కింద వివిధ విభాగాల ద్వారా నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ సమావేశానికి మొత్తం 11 రాష్ట్రాలు / యుటిలు హాజరయ్యాయి. 

గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (మోహువా) కార్యదర్శి శ్రీ దుర్గా శంకర్ మి                                                                                                                                                                                                              శ్రా మాట్లాడుతూ, “అమలు చేయడం, పని పూర్తి చేయడానికి దానిని నిర్వర్తించడం పద్ధతికి సన్నద్ధం అవుదాం” అని అన్నారు. మిషన్ వ్యవధిలో అర్హతగల లబ్ధిదారులందరికీ 100% పూర్తి చేసి,  పీఎంఏవై-యు గృహాలను పంపిణీ చేయాలని రాష్ట్రాలు / యుటిలను ఆయన కోరారు. పాల్గొనే రాష్ట్రాలు/యుటిలు మిషన్ కి సంబందించిన సరైన అమలు మరియు పర్యవేక్షణ కోసం ఆన్‌లైన్ విధానాన్ని (ఎంఐఎస్) ఉపయోగించాలని ఆదేశించారు.

Join us on Facebook

లైట్ హౌస్ ప్రాజెక్ట్స్ (ఎల్‌హెచ్‌పి) మరియు డెమన్‌స్ట్రేషన్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ (డిహెచ్‌పి) పురోగతిని కూడా కార్యదర్శి మోహువా సమీక్షించారు. ఎల్‌హెచ్‌పిలకు 2021 జనవరి 1 న గౌరవ ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారన్నారు. ఎల్‌హెచ్‌పిల కింద ఇళ్లను లక్నో, రాంచి, రాజ్ కోట్, అగర్తలా, చెన్నై, ఇండోర్ లో నిర్మిస్తారు. ఈ ఎల్‌హెచ్‌పి సైట్‌లను సాంకేతిక రంగానికి బదిలీ చేయడానికి లైవ్ లాబొరేటరీలుగా ప్రోత్సహించడానికి, పెద్ద ఎత్తున పౌరుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి మరియు సాంకేతిక అవగాహన, ఆన్-సైట్ లెర్నింగ్, పరిష్కారాల కోసం ఆలోచనలను కనుగొనడం, ప్రయోగాలు ఆవిష్కరణ ప్రోత్సహించడానికి టెక్నోగ్రాహిస్ కోసం ఆన్‌లైన్ నమోదు డ్రైవ్‌ను మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. 

మహిళా లబ్ధిదారుల పేరిట లేదా ఉమ్మడి యాజమాన్యం పేరిట ఇళ్లను కేటాయించడం ద్వారా మిషన్ మహిళా సాధికారతను ఎలా ప్రోత్సహిస్తోందనే దాని గురించి కార్యదర్శి మోహువా మాట్లాడారు. ప్రతి స్థాయిలో మంత్రిత్వ శాఖ జారీ చేసిన సలహాను పాటించాలని ఆయన రాష్ట్రాలు / యుటిలను నిశ్చయంగా కోరారు, ప్రధానంగా మహిళా లబ్ధిదారురాలి పేరు వారి పీఎంఏవై-యు ఇంటి నేమ్‌ప్లేట్‌లో ప్రస్తావించాలి. 
‘అందరికీ హౌసింగ్’ అనే దృష్టితో దేశవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం, పూర్తి చేయడం, పంపిణీ చేయడం వేగవంతం చేయడం జరుగుతుంది. దేశం 75 సంవత్సరాల స్వాతంత్ర్యాన్ని జరుపుకునేటప్పుడు 2022 నాటికి పట్టణ భారత్ లో  అర్హత కలిగిన లబ్ధిదారులందరికీ పక్కా గృహాలను అందించడానికి మోహువా కట్టుబడి ఉంది.

పీఎంఏవై-యు గృహాల నిర్మాణం వివిధ దశలలో ఉంది. ప్రస్తుతానికి, 73 లక్షలకు పైగా ఇళ్ళు నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి, దాదాపు 43 లక్షలు పూర్తయ్యాయి.

REAR ADMIRAL ATUL ANAND, VSM TAKES OVER AS FLAG OFFICER COMMANDING MAHARASHTRA NAVAL AREA (FOMA)