A book titled “Pandemonium: The Great Indian Banking Tragedy” by Tamal Bandyopadhyay
A book titled “Pandemonium: The Great Indian Banking Tragedy” by Tamal Bandyopadhyay
తమల్ బంద్యోపాధ్యాయ రాసిన “పాండెమోనియం: ది గ్రేట్ ఇండియన్ బ్యాంకింగ్ ట్రాజెడీ” అనే పుస్తకం విడదలకు సిద్ధమైంది.
తమల్ బండియోపాధ్యాయ్ “పాండెమోనియం: ది గ్రేట్ ఇండియన్ బ్యాంకింగ్ ట్రాజెడీ” అనే పుస్తకాన్ని రచించారు ఇది నవంబర్ 09, 2020 న విడుదల కానుంది.
రోలీ బుక్స్ ప్రచురించిన ఈ పుస్తకం మనదేశ ఆర్ధిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడంలో దోహదపడుతుంది.
పుస్తకం గురించి:
“పాండెమోనియం” పుస్తకం ఎంత మంది ప్రమోటర్లు రుణాల ద్వారా ఈక్విటీని నగదుగా ఎలా మార్చుకున్నాయో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) జోక్యం చేసుకునే వరకు బ్యాంకుల యాజమాన్యాలు తమ కాయిలాపడ్డ రుణాల నుండి వారి బ్యాలెన్స్ షీట్లను ఎలా రక్షించుకోవడానికి ప్రయత్నించాయో వపులంగా వివరించ బడింది. అదే సమస్య భారతదేశంలోని అభివృద్ధి చెందుతున్న నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలను కూడా ప్రభావితం చేసింది.
ముఖ్యంగా ఈ పుస్తకం Kingfisher Airlines ఉదంతాన్ని సవివరంగా పాఠకులకు పరిచయం చేయనుంది. బ్యాంకుల యాజమాన్యాలు ఎలా నిబంధనలకు తూట్లు పొడిచారు, ఎలా నిబంధనలకు వ్యతిరేకంగా కార్పొరేట్ రుణాలు జారీ చేసారు, ఇలాంటి అనేక ఆసక్తికరమైన అంశాలతో ఈ పుస్తకం భారత బ్యాకింగ్ వ్యవస్థ, వ్యవస్థను నడుపుతున్న కొందరు పెద్ద మనుషుల గురించి నిర్మొహమాటంగా ప్రస్థావించింది.
Also Read: Abhay Choudhary takes over as Director (Projects) of Power Grid Corporation