Business Reform Action Plan 2019

Business Reform Action Plan 2019

Business Reform Action Plan 2019

Business Reform Action Plan 2019: 2019 సంవత్సరానికి వ్యాపార సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక అమలు ఆధారంగా రాష్ట్రాల ర్యాంకింగ్ ;

రాష్ట్ర సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక 2019 కింద అగ్ర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ మరియు తెలంగాణ;

రాష్ట్ర ర్యాంకింగ్స్ పెట్టుబడులను ఆకర్షించడానికి, ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించడానికి మరియు ప్రతి రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచడానికి సహాయపడుతుంది

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలాసీతారామన్ 4 వ ఎడిషన్ బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ (Business Reforms Action Plan – BRAP) రాష్ట్రాల ర్యాంకింగ్ ప్రకటించారు.

వ్యాపార సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక అమలు ఆధారంగా రాష్ట్రాల ర్యాంకింగ్ 2015 సంవత్సరంలో ప్రారంభమైంది.

Join us on Telegram

ఇప్పటి వరకు, 2015, 2016 మరియు 2017-18 సంవత్సరాలకు రాష్ట్ర ర్యాంకింగ్‌లు విడుదల చేయబడ్డాయి.

బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ 2018-19లో సమాచార సంస్కరణ, సింగిల్ విండో సిస్టమ్, లేబర్, ఎన్విరాన్మెంట్ వంటి 12 వ్యాపార నియంత్రణ అంశాలు కలిగి ఉన్న 180 సంస్కరణ పాయింట్లు ఉన్నాయి.

పెట్టుబడులను ఆకర్షించడం మరియు ప్రతి రాష్ట్రంలో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచడం ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం.

Also Read: Jal Jeevan Mission promotes research and development

Business Reform Action Plan 2019

రాష్ట్రాలు మధ్య వ్యవస్థీకృతమైన వ్యాపార సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక అమలుకు ఆరోగ్యకరమైన పోటీ ప్రవేశపెట్టి వారి పనితీరు ఆధారంగా ర్యాంకింగ్ ఇవ్వడం ద్వారా సాధించవచ్చు.

ఈసారి ర్యాంకింగ్ ఇచ్చేందుకు సంస్కరణల ప్రభావం గురించి క్షేత్రస్ధాయిలో తమ అభిప్రాయాన్ని తెలియజేసిన ముప్పై వేలకు పైగా ప్రతినిధుల నుండి వచ్చిన అభిప్రాయానికి పూర్తి వెయిటేజీని ఇవ్వడం జరిగింది.

రాష్ట్ర ర్యాంకింగ్స్ పెట్టుబడులను ఆకర్షించడానికి, ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించడానికి మరియు ప్రతి రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచడానికి సహాయపడుతుంది.

సంస్కరణ ప్రక్రియను భారతదేశం తీవ్రంగా పరిగణిస్తుంది, ఇది కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ప్రపంచంలోని కఠినమైన లాక్డౌన్ అమలులో ఉన్న సమయంలో కూడా దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగడం ఇందుకు తార్కాణం.

Join us on YouTube

Business Reform Action Plan 2019

కొన్ని రాష్ట్రాలు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడంలో మరియు సంస్కరణల అమలు జరిగేలా చూడడంలో అసాధారణ శక్తిని చూపించాయి.

రాష్ట్ర వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక వెనుక ఉన్న నిజమైన స్ఫూర్తిని రాష్ట్రాలు స్వీకరించాయి అని ర్యాంకింగ్స్ విడుదల చేసిన తరువాత శ్రీమతి సీతారామన్ అన్నారు.

ఈ ఈజీ ఆఫ్ బిజినెస్ ర్యాంకింగ్స్ రాష్ట్రాలు చేసిన ప్రయత్నాల ప్రతిబింబం, ర్యాంకింగ్స్ పోటాపోటీగా ఉన్నాయని; రాష్ట్ర ర్యాంకింగ్స్ ఉన్న అతి కొద్ది దేశాలలో భారతదేశం ఒకటని, ఇది దేశం తన ర్యాంకింగ్ను మెరుగుపరచడంలో సహాయపడుతుందని, శ్రీపియుష్‌గోయల్ అన్నారు.

లైసెన్సుల పునరుద్ధరణను తొలగించడం లేదా వాటి ఆవర్తనాలను విస్తరించడం, దరఖాస్తు ఫారమ్లను సరళీకృతం చేయడం, రిస్క్-ఆధారిత తనిఖీలను ప్రవేశపెట్టడం లేదా ధర్డ్ పార్టీ తనిఖీలను ప్రవేశపెట్టడం, ఆమోదాలను డిజిటలైజ్ చేయడం మరియు నియంత్రణ పాలనను హేతుబద్ధీకరించడానికి చర్యలు చేపట్టడం ద్వారా నియంత్రణ భారాన్ని తగ్గించే చర్యలను చేపట్టాలని హర్దీప్ సింగ్ పూరి రాష్ట్రాలను కోరారు.

రాష్ట్ర సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక 2019 కింద మొదటి పది రాష్ట్రాలు:
1. ఆంధ్రప్రదేశ్
2. ఉత్తర ప్రదేశ్
3. తెలంగాణ
4. మధ్యప్రదేశ్
5. జార్ఖండ్
6. ఛత్తీస్‌గడ్
7. హిమాచల్ ప్రదేశ్
8. రాజస్థాన్
9. పశ్చిమ బెంగాల్
10. గుజరాత్

పూర్తి జాబితా

Business Reform Action Plan 2019