Centre writes to States Witnessing Spike in Daily New Cases

Centre writes to States Witnessing Spike in Daily New Cases

కోవిడ్ కేసులు పెరుగుతున్న రాష్ట్రాలకు కేంద్రం లేఖ

కోవిడ్ నిర్థారణ పరీక్షల పెంపు; రాపిడ్ యాంటిజెన్ లో నెగటివ్ వస్తే ఆర్ టి –పిసిఆర్ తప్పనిసరి

సమగ్ర నిఘా కఠినతరం చేసి కోవిడ్ వ్యాప్తి నియంత్రించాలని నిర్ణయం

భారతదేశంలో గత కొద్ది రోజులుగా కోవిడ్  కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం చికిత్సలో ఉన్న కొవిడ్ బాధితుల సంఖ్య 1,45,634 కు చేరింది. ఇది మొత్తం కోవిడ్ బాధితులలో 1.32%. ప్రస్తుతం కోవిడ్ బాధితులలో 74% కేవలం కేరళ, మహారాష్ట్రలొనే ఉన్నారు. ఈ మధ్య చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లోకూడా కేసులు పెరుగుతూ ఉండగా పంజాబ్, జమ్మూ-కశ్మీర్ లో సైతం ఈ ధోరణి కనబడుతోంది.  

గడిచిన నాలుగు వారాలలో కేరళలో సగటున వారానికి అత్యధికంగా 42,000 కేసులనుంచి అత్యల్పంగా 34,800 మధ్య కొత్త కోవిడ్ కేసులు నమోదవుతూ వచ్చాయి.  అదే విధంగా గత నాలుగు వారాలలో కేరళలో పాజిటివ్ శాతం  13.9% నుంచి 8.9% దాకా నమోదైంది. కేరళలోని అలప్పుళా జిల్లాలో అత్యధిక కేసులు వస్తున్నాయి. అక్కడ వారపు పాజిటివ్ శాతం 10.7% కు పెరిగి 2,833 కేసులకు చేరింది.

మహారాష్ట్రలో గత నాలుగు వారాలలో 18,200 నుంచి 21,300 కు పెరుగుదల నమోదైంది. వారాపు పెరుగుదల శాతం 4.7% నుంచి 8% అయింది. ప్రధానంగా ముంబాయి నగర శివార్లలో కేసులు బాగా పెరుగుతున్నాయి.  అక్కడ వారపు సగటు 19% పెరిగింది. నాగపూర్, అమరావతి, నాసిక్, అకోలా, యావత్మల్ లో ఈ పెరుగుదల వరుసగా 33%, 47%, 23%,55%, 48%  దాకా నమోదైంది.  .

పంజాబ్ లోనూ పరిస్థితి క్లిష్టంగా తయారవుతోంది. రాష్ట్రంలో గత నాలుగు వారాలుగా పాజిటివ్ శాతం  1.4% నుంచి 1.6% కు పెరగగా, సంఖ్యాపరంగా వారపు పెరుగుదల  1300 నుంచి  1682 అయింది. ఎస్ బి ఎస్ నగర్ జిల్లా ఒక్క దానిలోనే పాజిటివ్ శాతం బాగా పెరిగింది.  వారపు కేసుల సంఖ్య  165 నుంచి 364.

5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పాజిటివ్ శాతం జాతీయ సగటు కంటే ఎక్కువ నమోదైంది. జాతీయ సగటు  1.79% కాగా మహారాష్ట్రలో అత్యధికంగా  8.10% నమోదైంది. 

అన్ని రాష్ట్రాలూ ఈ ఐదు అంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. 

1.     కోవిడ్ నిర్థారణ పరీక్షల సంఖ్య పెంచాలి. ఎక్కువగా ఆర్ టి –పిసిఆర్ పరీక్షలు జరపాలి. 

  1. రాపిడ్ యాంటిజెన్ పరీక్షలలో నెగటివ్ వచ్చినప్పటికీ ఆర్ టి –పి సి ఆర్ పరీక్షలు జరిపి తేల్చాలి.
  2. సమగ్ర నిఘా మీద మళ్ళీ దృష్టి సారించాలి. ఎంపిక చేసిన కంటెయిన్మెంట్ జిల్లాలమీద నిఘాపెట్టాలి..
  3. క్రమం తప్పకుందా పరీక్షలు చేయటంతోబాటు జీనోమ్ సీక్వెన్సింగ్ కూడా చేపట్టాలి. కొత్త రూపంలో వ్యాప్తి చెందే అవకాశాన్ని పరిశీలించాలి. 
  4. ఎక్కువ మరణాలు నమోదవుతున్న జిల్లాల్లో చికిత్స మీద ఎక్కువ దృష్టిపెట్టాలి.

ఇక టీకాల విషయానికొస్తే, భారతదేశంలో మొత్తం కోవిడ్ టీకాలు తీసుకున్న వారి సంఖ్య కోటీ పది లక్షలు దాటింది. ఉదయం 8 గంటలకు మొత్తం 1,10,85,173 టీకా డోసులకోసం  2,30,888 శిబిరాలు నిర్వహించారు. వీరిలో  63,91,544 ఆరోగ్య సిబ్బంది మొదటి డోస్ అందుకోగా 9,60,642రోగ్య సిబ్బంది రెండో డోస్, 37,32,987 మంది కొవిడ్ యోధులు మొదటొ డోస్ తీసుకున్నారు

క్రమ సంఖ్య  రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం        టీకా లబ్ధిదారులు
మొదటి డోస్రెందవ డోస్మొత్తం డోసులు
1అండమాన్, నికోబార్ దీవులు4,8461,3066,152
2ఆంధ్రప్రదేశ్4,07,93585,5364,93,471
3అరునాచల్ ప్రదేశ్19,7024,04123,743
4అస్సాం1,53,25911,0501,64,309
5బీహార్5,22,37938,9645,61,343
6చండీగఢ్12,95379513,748
7చత్తీస్ గఢ్3,40,55720,6683,61,225
8దాద్రా, నాగర్ హవేలి4,9392445,183
9డామన్, డయ్యూ1,7352131,948
10ఢిల్లీ2,94,08117,3293,11,410
11గోవా15,0701,11316,183
12గుజరాత్8,21,94060,1308,82,070
13హర్యానా2,08,30823,9872,32,295
14హిమాచల్ ప్రదేశ్94,89712,0761,06,973
15జమ్మూ కశ్మీర్2,00,6956,7312,07,426
16జార్ఖండ్2,52,63411,3252,63,959
17కర్నాటక5,40,8681,13,4306,54,298
18కేరళ3,99,06438,8294,37,893
19లద్దాఖ్5,6316006,231
20లక్షదీవులు1,8091151,924
21మధ్యప్రదేశ్6,40,8053,7786,44,583
22మహారాష్ట్ర8,75,75246,9769,22,728
23మణిపూర్40,2151,71141,926
24మేఘాలయ23,87762924,506
25మిజోరం14,6272,24116,868
26నాగాలాండ్21,5263,90925,435
27ఒడిశా4,38,12794,9665,33,093
28పుదుచ్చేరి9,25185310,104
29పంజాబ్1,22,42913,8591,36,288
30రాజస్థాన్7,82,70138,3588,21,059
31సిక్కిం11,86570012,565
32తమిళనాడు3,39,68631,1603,70,846
33తెలంగాణ2,80,97387,1593,68,132
34త్రిపుర82,36911,58793,956
35ఉత్తరప్రదేశ్10,66,29085,75211,52,042
36ఉత్తరాఖండ్1,30,9087,1461,38,054
37పశ్చిమ బెంగాల్6,33,27149,7866,83,057
38ఇతరములు3,06,55731,5903,38,147
                 మొత్తం1,01,24,5319,60,6421,10,85,173

టీకాలు మొదలైన 36వ రోజైన ఫిబ్రవరి 20 నాడు మొత్తం 4,32,931 టీక డోసులు ఇవ్వగా వాటిలో  2,56,488 మందికి   8,575 శిబిరాలలో మొదటి డోస్ ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు. 1,76,443 మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ అందుకున్నవారున్నారు.  రెండో డోస్ అందుకున్నవారిలో  60.04% మంది  7 రాష్ట్రాల్లో కేంద్రీకృతమై ఉన్నారు. ఒక్క కర్నాటకలోనే 11.81%  అంటే, 1,13,430 డోసులు అందుకున్నారు.   

ఇప్పటిదాకా కోవిడ్ నుంచి 1,06,89,715 మంది కోలుకోగా, గత 24 గంతలలో కోలుకున్నవారు  11,667 మంది. దేసవ్యాప్తంగా ఇప్పటిదాకా కోలుకున్నవారి శాతం   97.25%. ఇది ప్రపంచంలోనే అత్యధికం. కొత్తగా కోలుకున్నవారిలో 81.65% మంది ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నారు. కేరళలో అత్యధికంగా ఒక్క రోజులో 5,841 మంది కోలుకున్నారు.  మహారాష్ట్రలో 2,567 మంది, తమిళనాడులో 459 మంది కోలుకున్నారు.

Join un on Telegram

తాజాగా నమోదైన కేసులలో  85.61% ఐదు రాష్టాల్లోనే నమోదయ్యాయి.  మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు నమోదు కొనసాగుతోంది. ఒక రోజులో 6,281 కేసులు రాగా, కేరళలో  4,650 కేసులు, కర్నాటకలో 490 కొత్త కెసులు వచ్చాయి.  మహారాష్ట్ర, కేరళలోనే 77% కొత్త కేసులు నమోదు కావటం గమనార్హం.  

గత 24 గంటల్లో 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. గుజరాత్, ఒడిశా, జమ్మూకశ్మీర్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, జార్ఖండ్, పుదుచ్చేరి, అస్సాం, మేఘాలయ, లక్షదీవులు, మణిపూర్, మిజోరం, సిక్కిం, లద్దాఖ్, నాగాలాండ్, అండమాన్, నికోబార్ దీవులు, త్రిపుర, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి. 

గత 24 గంటలలో 101 మరణాలు నమోదయ్యాయి.  ఐదు రాష్ట్రాల్లోనే 80% తాజా మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలొ అత్యధికంగా 40 మరణాలు సంభవించగా, కేరళలో 13 మంది, పంజాబ్ లో 8 మంది చనిపోయారు.

గత 24 గంటల్లో ఒక రాష్టంలో మాత్రమే 20 మందికి పైగా మరణించారు. 10 నుంచి 20 మరణాలు ఒక రాష్టంలో నమోదు కాగా 6 నుంచి 10 మరణాలు రెండు రాష్ట్రాల్లో నమొదయ్యాయి. 1-5 మధ్య 10 రాష్ట్రాల్లో నమోదయ్యాయి.   

Jal Jeevan Mission: Special Campaign to provide potable piped water supply in Schools & Anganwadi Centers extended till 31st March, 2021