DPIIT releases consolidated FDI policy:

DPIIT releases consolidated FDI policy: ఎఫ్‌డిఐ విధాన సంకలనం విడుదల చేసిన డిపిఐఐటి

గత ఏడాదిలో చేసిన మార్పులన్నింటినీ కలుపుకొని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తన ఏకీకృత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) విధాన ప్రతిని విడుదల చేసింది.

డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డిపిఐఐటి) ప్రకారం, అక్టోబర్ 15 నుండి ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చింది.

వివిధ రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాల సంకలనం ఈ విధానం.

ఎఫ్‌డిఐ సంబంధిత విషయాలు చూసుకునే డిపిఐఐటి, విదేశీ పెట్టుబడుల నియంత్రణకు సంబంధించిన అన్ని విధానాలను ఏకీకృత పత్రంగా సంకలనం చేసి, పెట్టుబడిదారులకు అర్థమయ్యేలా ఈ పత్రాన్ని రూపొందిస్తుంది.

పెట్టుబడిదారులు వివిధ శాఖలు జారీ చేసిన అనేక ప్రెస్ నోట్లు మరియు దానికి సంబంధించి ఆర్బిఐ నిబంధనలు వీటి అధ్యయనం ద్వారా పాలసీని అర్థం చేసుకోవాలసి ఉంటుంది, ఐతే ఈ ఏకీకృత విధానం ఆ అవసరాన్ని దూరం చేస్తుంది.

Also Read: PM reaffirms importance of storytelling

ఈ ప్రక్రియ ద్వారా విదేశీ పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని అందించడం మరియు ఆర్థిక వృద్ధిని పెంచడానికి మరియు ఉద్యోగాలను సృష్టించడానికి ఎక్కువ ఎఫ్‌డిఐలను ఆకర్షించడం సులభమౌతుంది.

బొగ్గు మైనింగ్, డిజిటల్ వార్తలు, కాంట్రాక్ట్ తయారీ మరియు సింగిల్ బ్రాండ్ రిటైల్ ట్రేడింగ్‌తో సహా పలు రంగాల్లో ఎఫ్‌డిఐ విధానాన్ని ప్రభుత్వం సరళీకృతం చేసింది.

ఈ ఏడాది ఏప్రిల్-ఆగస్టులో భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) గత సంవత్సరంతో పోలిస్తే 16 శాతం పెరిగి 27.1 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.

Join us on Telegram