International Firefighters Day May 4

International Firefighters Day

International Firefighters Day అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది దినోత్సవం:

International Firefighters Day ప్రజల ప్రాణాలు మరియు ఆస్తి రక్షణ కోసం తమ జీవితాలను అంకితం చేస్తారు అగ్నిమాపక సిబ్బంది సేవలను గుర్తిస్తూ నిర్వహించే వేడుక.

అలుపెరుగని అవిశ్రాంత పోరుకావచ్చు, ఏళ్ళ తరబడి అందించే సేవ కావచ్చు, అగ్నిమాపక సిబ్బంది అంకిత భావం ప్రమాద సమయాలలో ప్రణాలు సైతం లెక్కచేయక పోరాడటం వారి త్యాగనిరతిని చాటుతుంది.

సమాజాన్ని, పర్యావరణాన్ని సాధ్యమైనంత వరకు సురక్షితంగా ఉంచడానికి అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న కృషిని గుర్తించి వారి త్యాగాలను గౌరవించేందుకు అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది దినోత్సవం ఒక గొప్ప సందర్భం.

చదవండి: International Mother Earth Day

International Firefighters Day నేపధ్యం:

2 డిసెంబరు 1998 ఆస్ట్రేలియా లింటన్ నగరంలోని అటవీ ప్రాంతంలో కార్చిచ్చు రగులుకుంది. దావాలంలా వ్యాపిస్తు్న్న ఈ మంటలను ఆర్పటానికి గీలాంగ్ ఫైర్ బ్రిగేడ్ను సహాయం కోరారు లింటన్ అగ్నిమాపక సిబ్బంది.

పొంచిఉన్న ప్రమాదం గురించి తెలియని గారీ వ్రెడ్వెల్ట్, క్రిస్ ఇవాన్స్, స్టువర్ట్ డేవిడ్సన్, జేసన్ ధామస్, మరియు మాథివ్ ఆంస్ట్రాంగ్ అనే ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది సహాయానికి బయలుదేరారు.

మంటలను అదుపు చేసేందుకు ఈ ఐదుగురు హాట్ జోన్లోకి ప్రవెశించి మంటలను అదుపు చేసే ప్రయత్నం మొదలు పెట్టారు.

అప్పుడే అనుకోని విధంగా గాలి హటాత్తుగా తన గమనాన్ని మార్చుకుంది.

 అంతే దిశలు మారిన పవన వీడ్పుల అగ్ని దిశలను మార్చేశాయి. ఈ హటాత్ పరిణామంతో రెప్పపాటులో ఆ ఐదుగురు తమ వాహనంతోసహా అదే మంట్లో చిక్కుకుపోయారు.

THE FIVE FIREFIGHTERS LINTON BUSHFIRE

పర్యావరణాన్ని రక్షించేందుకు వచ్చిన వారిని రక్షించడం ఎవరి తరమూ కాలేదు, ఆ ఐదుగురు అదే అగ్నికి ఆహుతైపోయారు.

ఈ దుర్ఘటన విక్టోరియా ఫైర్ బ్రిగేడ్ (ప్రమాదం జరిగిన లింటన్ ప్రాంతం దీని పరిధిలోకి వస్తుంది) వాలంటీర్ లెఫ్టనెంట్ ఐన జే.జే. ఎడ్మండ్సన్ ను చలింపజేసింది.

ఈ ఉదంతానికి ప్రేరితుడైన అతడు అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది దినోత్సవానికై కృషి చేశాడు.

ఆమె కృషి ఫలితమే ప్రతీఏట మే 4 వ తేదీన International Firefighters Day ను జరుపుకుంటున్నాము.

J J EDMONDSON International Firefighters Day

చదవండి: World Intellectual Property

ఎరుపు నీలి రంగుల రిబ్బన్ (The Red and Blue Ribbon):

International Firefighters Day Ribbon

అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది దినోత్సవాంలో ఎరుపు నీలి రంగుల రబ్బన్ (The Red and Blue Ribbon) అత్యంత ముఖ్యమైనది.

జే.జే. ఎడ్మండ్సన్ ఈ రంగులను ఎంచుకోవడానికి కారణం ఇందులో ఎరుపు అగ్నిని సూచిస్తే, నీలం నిటిని సూచిస్తుంది.

అంతేకాదు యాధృచితమే అయినప్పుటికి మనం చెప్పకోక తప్పని మరో అంశం ప్రప్ంచ వ్యాప్తంగా అన్ని దేశాలలోను ఈ రంగులు అత్యవసర సేవలను సూచించడం.

అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది దినోత్సవాన్ని పురస్కరించుకుని అందరూ ఈ రిబ్బన్ ను అనేక విధాలుగా ప్రదర్శిస్తారు.

చదవండి: National Panchayati Raj Day: e-Gram Swaraj, Swamitva Yojana

మే 4 నే ఎందుకు?

రోమ్ కు చెందిన సేయింట్ ఫ్లోరియన్ ఆ దేశంలోని నోరికాం గ్రామ అగ్నిమాపక సిబ్బందికి సారథ్యం వహిస్తున్న రోజులవి.

ఆ గ్రామం మొత్తం మంటల్లో చిక్కుకుపోగా కేవలం తన వద్దనున్న అత్యల్ప సాధనాలతో ఆ మంటల నుండి తన గ్రామాన్ని రక్షించినట్లు తెలుపుతుంది రోమ్ గాధ.

ఆ గాధ ఆధారంగా మే 4 ను సేయింట్ ఫ్లోరేయిన్ దినోత్సవంగా జరుపుకుంటారు.

ప్రపంచంలో మొట్టమొదటి అగ్నిమాపక కమాండర్ గా గుర్తించ బడ్డ సేయింట్ ఫ్లోరేయిన్ డే అయిన మే 4 నే అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది దినోత్సవాన్ని ( International Firefighters Day) జరుపుకుంటాం.

ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది మృతితో అవతరించిన అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం అంతటితో ఆగలేదు.

ఈ రోజున ప్రమాదకర పదార్ధాల నిపుణులు, అగ్ని నివారణా సిబ్బంది, స్వచ్ఛంది అగ్నిమాపక కార్యకర్తలు, భారీ యంత్రాల ఆపరేటర్లు మెకానిక్లు ఇలా ప్రాచుర్యంలో ఉన్న లేని అత్యవసర సేవలందిచే అన్ని రంగాల వారి సేవలను గుర్తిస్తారు.