International Mother Earth Day

international mother earth day

అంతర్జాతీయ ధరిత్రీ దినోత్సవం

ఈ విశ్వంలో మానవునితో సహా ఇతర జీవరాశులు జీవించడానికి అనువైన వాతావరణం గల ఏకైక గ్రహం భూమి ఒకటే. ఇతర గ్రహాలపై ఏ ప్రాణికైనా జీవంచడం ఎంతవరకు సాధ్యము మరియు ఇతర అనేక అంశాలపై అనేక పరిశోధనలు జరుగుతున్నప్పుటికి వాటి ఫలితాలు తేలడానికి మరికొన్ని దశాబ్దాలు పట్టవచ్చునని పరిశోధకుల అభిప్రాయం.

నానాటికి పెరుగుతున్న కాలుష్య ఉద్గారల్ల ఉష్ణోగ్రతలు పెరిగి భూగోళం వేడెక్కుతోంది. దీని వల్ల ధృవప్రాంతాలలో మంచు కరగడం తద్వారా సముద్ర నీటి మట్టం పెరుగుతూ ప్రపంచ భూభాగాన్ని ఆక్రమిస్తోంది. ప్రజలు తమ నిత్యజీవితంలో ప్లాస్టిక్ వస్తువులు వాడడం వలన వందలకొద్ది టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలు భూమిపై పొగుపడి గాలి నీరు భూమి అనే తేడాలేకుండా అన్నింటిని కలుషితం చేస్తున్నాయు. దాని వలన భూమి సకల ప్రాణులు నివసించడానికి వీలు లేకుండా పోతోంది. ఈ పరిస్థితి మార్చాలని ప్రజలలో అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ధరిత్రీ దనోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోంది.

తన చుట్టూ ఉన్న పర్యావరణం కలుషితం కావడాన్ని గమనించిన అమెరికాకు చెందిన రాకీయవేత్త గెలార్డ్ నెల్సన్ ఈ కాలుష్యం నుండి ధరిత్రిని ఎలాగైనా రక్షించాలని భావించి మన చుట్టూ జరుగూతున్న వాతావరణంలోని మార్పులను ప్రజలకు తెలియజేస్తూ వాటి నుండి ఎలా బయటపడాలో దానికి ప్రజలు ఏమి చెయ్యాలో తెలిపేందుకు ఒక రోజు ఉండాలని ఒక వార్తా పత్రికలో ధరిత్రీ దినోత్సవం గురించి తెలియజేసారు.

మొట్టమొదటి సారిగా 1970 ఎప్రిల్ 22న ధరిత్రీ దినోత్సవాన్ని అమెరికాలో దేశవ్యాప్తంగా నిర్వహించారు. ఇలా ప్రారంభమైన ధరిత్రీ దినోత్సవం నేడు దాదాపు 192 దేశాలలో నిర్వహిస్తున్నారు.

2009 లో UNO Earth Dayను International Mother Earth Dayగా మార్చింది. నాటినుండి ఐక్యరాజ్య సమితి ప్రతీ సంవత్సరం ధరిత్రీ దినోత్సవాన్ని ఒక ఇతివృత్తం(Theme)తో నిర్వహిస్తూ వస్తూంది 2020కి గాను ధరిత్రీ దనోత్సవ ఇతివృత్తం (2020 International Mother Earth Day Theme) Climate Action.

1970లో ప్రారంభమైన ధరిత్రీ దనోత్సవం 2020 సంవత్సరానికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ దేశాలు తమ దేశ ప్రజలలో పర్యావరణ పరిరక్షణ గురించి అనేక అవగాహన సదస్సులను నిర్వహించడం పర్యావరణ అనుకూల నిర్ణయాలు ప్రకటించడం చేస్తాయి.

రాజేశ్ బుర్ర

One thought on “International Mother Earth Day”

Comments are closed.