Krishna-Godavari (KG) basin, an excellent source of fuel methane: కృష్ణా-గోదావరి(కేజీ)బేసిన్, ద్రవ మీథేన్ కు అద్భుత వనరు
Krishna-Godavari (KG) basin, an excellent source of fuel methane: కృష్ణా-గోదావరి(కేజీ)బేసిన్, ద్రవ మీథేన్ కు అద్భుత వనరు
ఈ బేసిన్ లో లభించే మీథేన్ హైడ్రేట్ నిక్షేపాలు సమృద్ధిగా మీథేన్ సహజవాయువుని సరఫరా చేసే సుసంపన్నమైన వనరు
మాలిక్యూలర్, కల్చరింగ్ పద్ధతులను ఉపయోగించి ఈ అధ్యయనం కేజీ బేసిన్లో గరిష్టస్థాయిలో మెథనోజెనిక్ వైవిధ్యాన్ని వెల్లడించింది, ఇది అండమాన్ మరియు మహానది బేసిన్లతో పోల్చితే బయోజెనిక్ మీథేన్ విస్తారమైన వనరు అని నిర్ధారించడానికి ఒక ప్రధాన కారణం
ప్రపంచం శిలాజ ఇంధనాల నుండి బయటపడి, స్వచ్ఛమైన ఇంధనానికి ప్రత్యామ్నాయ వనరులను శోధిస్తుండగా, కృష్ణ-గోదావరి (కెజి) బేసిన్ నుండి ఒక శుభవార్త వచ్చింది.
ఈ బేసిన్లో మీథేన్ హైడ్రేట్ డిపాజిట్ ఒక సహజ వనరు, ఇది తగినంత సహజ వాయువు మీథేన్ సరఫరాను నిర్ధారిస్తుంది.
మీథేన్ శుభ్రమైన, చవకైన ఇంధనం. ఒక క్యూబిక్ మీటర్ మీథేన్ హైడ్రేట్ 160-180 క్యూబిక్ మీటర్ల మీథేన్ కలిగి ఉంటుందని అంచనా.
కేజీ బేసిన్లోని మీథేన్ హైడ్రేట్లలో ఉన్న మీథేన్ అతి తక్కువ అంచనా వేసినా కూడా ప్రపంచవ్యాప్తంగా లభించే అన్ని శిలాజ ఇంధన నిల్వలతో పోలిస్తే రెండింతలు.
ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం యొక్క స్వయంప్రతిపత్తి సంస్థ అగర్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఏఆర్ఐ) పరిశోధకులు ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో.
Join us on Telegram
వెల్లడైన మీథేన్ హైడ్రేట్ నిక్షేపాలు కృష్ణ-గోదావరి (కెజి) బేసిన్లో ఉన్నాయని బయోజెనిక్ మూలం గలవి అని తేలింది.
‘మీథేన్ హైడ్రేట్‌లో మీథనోజెనిక్ ఆర్కియా జాతి నిర్మాణాన్ని విశదీకరించడం’ పేరుతో డిఎస్టి-సెర్బ్ యువ శాస్త్రవేత్త ప్రాజెక్టులో భాగంగా ఈ అధ్యయనం జరిగింది.
మహాసముద్రాలలో అధిక పీడనాలు, తక్కువ ఉష్ణోగ్రతల వద్ద హైడ్రోజన్-బంధంతో నీరు, మీథేన్ వాయువు సంపర్కంలోకి వచ్చినప్పుడు మీథేన్ హైడ్రేట్ ఏర్పడుతుంది.
‘మెరైన్ జెనోమిక్స్’ పత్రికలో ప్రచురణకు అంగీకరించిన ప్రస్తుత అధ్యయనం ప్రకారం, ఏఆర్ఐ బృందం మీథేన్ హైడ్రేట్‌గా బయటపడిన బయోజెనిక్ మీథేన్‌ను ఉత్పత్తి చేసే మీథనోజెన్‌లను మరింతగా గుర్తించింది, ఇది గణనీయమైన శక్తి వనరుగా ఉంటుంది.
“కృష్ణ-గోదావరి (కెజి) బేసిన్లోనూ, అండమాన్, మహానది తీరానికి సమీపంలో బయోజెనిక్ మూలం భారీ మీథేన్ హైడ్రేట్ నిక్షేపాలు అనుబంధ మెథనోజెనిక్ కమ్యూనిటీని అధ్యయనం చేయడం అవసరం” అని ఈ అధ్యయనం ప్రధాన పరిశోధకుడైన డాక్టర్ విక్రమ్ బి లంజెకర్ అన్నారు.
ఏఆర్ఐ బృందం ప్రకారం, ఇటీవల వరకు, మీథేన్ హైడ్రేట్-బేరింగ్ అవక్షేపాలతో సంబంధం ఉన్న మీథనోజెనిక్ కమ్యూనిటీలపై కొన్ని పరిశోధనలు మాత్రమే జరిగాయి.
ఈ అధ్యయనం ఈ ఎత్తైన పీడనం, ఉష్ణోగ్రత పరిస్థితులలో ఉన్న మీథనోజెన్లు ఈ పరిస్థితులకు బాగా అనుకూలంగా ఉన్నాయని మరియు మీథేన్ ఉత్పత్తి చేసే కార్యకలాపాలలో భిన్నంగా ఉంటాయని తేలింది.
అటువంటి విపరీతమైన మరియు సహజమైన వాతావరణంలో మీథేన్ ఉత్పత్తి చేసే మీథనోజెనిక్ కమ్యూనిటీల అవగాహన చాలా ముఖ్యమైనది.
Also Read: Three key Petroleum sector projects in Bihar
మాలిక్యూలర్, కల్చరింగ్ పద్ధతులను ఉపయోగించి ఈ అధ్యయనంకేజీ బేసిన్లో గరిష్ట మెథనోజెనిక్ వైవిధ్యాన్ని వెల్లడించింది, ఇది అండమాన్, మహానది బేసిన్లతో పోల్చితే బయోజెనిక్ మీథేన్ విస్తారమైన మూలం అని నిర్ధారించడానికి ఇది ఒక ప్రధాన కారణం.
వారి నమూనా ఆధారంగా గతిశాస్త్ర అధ్యయనం కెజి బేసిన్ హైడ్రేట్లలో బయోజెనిక్ మీథేన్ ఉత్పత్తి రేటు రోజుకి 0.031 మిల్లీమోల్స్ మీథేన్ / జిటిఒసి అని అంచనా వేసింది, దీని ఫలితంగా మీథేన్ మొత్తం 0.56 నుండి 7.68 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల (టిసిఎఫ్) నిక్షేపంగా ఉంటుంది.
ఈ అధ్యయనం కోసం కృష్ణ గోదావరి, అండమాన్, మహానది బేసిన్ నుండి వచ్చిన మీథేన్ హైడ్రేట్ నిక్షేపాలకు సంబంధించిన అవక్షేప నమూనాలను నేషనల్ గ్యాస్ హైడ్రేట్ కోర్ రిపోజిటరీ, జిహెచ్ఆర్టిసి, ఒఎన్జిసి, పన్వెల్, మహారాష్ట్ర అందించింది.
ఏఆర్ఐ బృందం కేజీ బేసిన్లో మెథనోసార్సినా జాతి ప్రాబల్యాన్ని నమోదు చేసింది, తరువాత మరికొన్ని జాతులు మెథనోక్యులియస్, మెథనోబాక్టీరియం. మెథనోసార్సినా జాతి నాలుగు వేర్వేరు జాతుల ఎం.సిసిలియా, ఎం.బార్కేరి, ఎం.ఫ్లేవ్‌సెన్స్, ఎం.మేజియాస్‌తో కనుగొన్న వాటిలో మరింత వైవిధ్యంగా ఉన్నట్లు గుర్తించారు.