National PanchayatiRaj Day 24April

national panchayati raj day 24 April

జాతీయ పంచాయితీరాజ్ దినోత్సవం

National PanchayatiRaj Day 24April: దేశ అభివృద్ధి అనేది ఆ దేశంలోని గ్రామల అభివృద్ధిపైనే ఆధారపడి ఉంటుంది. దేశ భూభాగంలో అధికశాతం గ్రామీణ ప్రాంతాలతో కూడిఉండటం దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా మనదేశంలో గ్రామాలు అధికంగా ఉండడం, పాలన శౌలభ్యానికి దూరంగా ఉండటం, నిరక్షరాస్యత, మౌళిక సౌకర్యాలు కల్పించడం ప్రభుత్యాలకు కష్టసాధ్యం కావడంతో, స్థానిక స్వపరిపాలనను తీసుకురావాలని అనేక మంది సామాజిక మేధావులు కోరుకునేవారు. మహాత్మా గాంధీ సైతం స్థానిక స్వపరిపాలన వల్లనే దేశం అభివృద్ధిని సాధించగలదని, గ్రామ రాజ్యాలను ఏర్పాటు చేయాలని, గ్రామ అభ్యుదయానికి గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేసి వాటికి విస్తృత అధికారాలు ఇవ్వాలని కోరుకునేవారు.

భారతదేశంలో మొట్టమొదటి సారిగా స్థానిక సంస్థలను ప్రవేశపెట్టింది?

మన దేశంలో మొట్ట మొదటి సారిగా స్థానిక ప్రభుత్వాలను మౌర్యులు ప్రవేశపెట్టారు. ప్రాచీనకాలం నుండి గ్రామపాలనా వ్యవస్థ ఉన్నప్పటికీ, కాలానుగుణంగా మారుతున్న సామాజిక పరిస్థితుల వల్ల, అవి సమర్ధవంతంగా పని చేయలేకపోయాయి. బ్రిటీష్ కాలంలో గవర్నర్ జనరల్, లార్డ్ రిప్పన్ 1882వ సంవత్సరంలో చేసిన తీర్మానంతో, స్థానిక స్వపరిపాలన సంస్థలు పునర్జీవనం పొందాయి. ఈ తీర్మానాన్ని స్థానిక సంస్థల పాలిట, “మాగ్నా కార్టా”గా వ్యవహరిస్తారు. అందుకే ‘లార్డ్ రిప్పన్’ను స్థానిక సంస్థల పితామహునిగా పిలుస్తారు.

చంవండి: పంచాయితీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని చేతులమీదుగా e-Gram Swaraj మరియు స్వామిత్వ యోజన ప్రారంభం.

బ్రిటీషు పాలనలో స్థానిక సంస్థలు

స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 1907లో రాయల్ కమీషన్ను నియమించింది. ఈ కమీషన్ సూచన మేరకు ఓటింగ్ హక్కును ప్రవేశ పెట్టారు. 1909లో తెచ్చిన మింటోమార్లే సంస్కరణలలో భాగంగా, తొలిసారిగా ఎన్నికల ప్రత్యక్ష విధానాన్ని ప్రవేశపెట్టగా, 1919 మాంటేగ్ చెమ్స్ ఫర్డ్ సంస్కరణల ఫలితంగా, స్థానిక ప్రభుత్వాలను మొదటి సారిగా రాష్ట్ర జాబితాలో చేర్చడం జరిగింది.

1935లో భారత ప్రభుత్వ చట్టం స్థానిక ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తి కల్పించింది. స్వతంత్రానంతరం, భారత ప్రభుత్వం 1952 అక్టోబర్ 2న టి.కృష్ణమాచారి సలహా మేరకు, కమ్యూనిటి డవలప్మెంట్ ప్రోగ్రాంను ప్రవేశపెట్టింది. ఇది విజయవంతం కావడంతో, 1953లో సామాజిక వికాసం కోసం జాతీయ విస్తరణ పధకాలను ప్రవేశపెట్టింది.

బల్వంత్ రాయ్ మెహతా కమిటి

1952-53 సంవత్సరంలో ప్రవేశపెట్టిన పధకాలు అమలు తీరును పరిశీలించడానికి 1957లో బలవంతరాయ్ మెహతా కమిటీని ఏర్పాటు చేసారు. ఈ కమిటి యొక్క సిఫార్సులలో భాగంగా 3అంచెల పంచాయితీరాజ్ వ్యవస్థను సూచించింది. మూడంచెల పద్దతిలో మొదటి స్ధాయిలో జిల్లాపరిషత్, మధ్య స్థాయిలో పంచాయితీసమితి, చివరి స్థాయిగా గ్రామపంచాయితీలు ఉన్నాయి.
ఈ విధానాన్ని 1959 అక్టోబర్ 2 న అమలుపరచిన మొట్ట మొదటి రాష్ట్రం రాజస్థాన్. 1959 నవంబరు 1 న అమలుపరచిన రెండవ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.

1986లో కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన ఎల్.ఎం.సింఘ్వి కమిటి సిఫార్సుల మేరకు పార్లమెంటులో ప్రవేశపెట్టగా ఈ బిల్లు లోక్సభలో ఆమోదం పొందినప్పటికి రాజ్యసభలో ఆమోదం పొందలేకపోయింది.

73వ రాజ్యాంగ సవరణ

1991లో వచ్చని పి.వి.నరసింహారావు ప్రభుత్వం దీనిని ఆమోదించగా 1993లో ఏప్రిల్24 నుండి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా అమలులోకి వచ్చింది. భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 2010ఏప్రిల్24న తొలిసారిగా పంచాయితిరాజ్ దినోత్సవాన్ని నిర్వహించారు. నాటి నుండి ప్రతి సంవత్సరం National PanchayatiRaj Day 24April నాడు జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆదర్శవంతంగా నిలిచిన పంచాయితీలకు ప్రధానమంత్రి పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది.

రాజేశ్ బుర్ర

One thought on “National PanchayatiRaj Day 24April”

Comments are closed.