New Electronics Manufacturing Policy announced in UP

New Electronics Manufacturing Policy announced in UP

New Electronics Manufacturing Policy announced in UP కొత్త ఎలక్ట్రానిక్స్ తయారీ విధానం ప్రకటించిన యు.పి. ప్రభుత్వం

ఎలక్ట్రానిక్స్ వస్తువుల జీరో దిగుమతి లక్ష్యాన్ని సాధించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దార్శనికతకు మద్దతుగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ తయారీ విధానం 2020ని ప్రకటించింది.

Join us on Facebook

వచ్చే ఐదేళ్లలో 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడిని ఆహ్వానించడం తద్వారా నాలుగు లక్షల ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ విధానం యొక్క ముఖ్య లక్ష్యం.

2017 లో పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నోయిడా, గ్రేటర్ నోయిడా మరియు యమునా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాంతాలకు ఎలక్ట్రానిక్స్ తయారీ విధానం 2017ను ప్రకటించారు.

ప్రకటించిన 3 వ సంవత్సరంలోనే ఆ విధానం పెట్టుబడి మరియు ఉపాధి కల్పన యొక్క లక్ష్యాన్ని సాధించింది.

Join us on YouTube

అంతే గాక ఈ మూడు ప్రాంతాలు ఇప్పుడు ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న మొబైల్ తయారీ కేంద్రాలలో ఒకటిగా నిలిచాయి.

భారతదేశంలో తయారుచేసే మొత్తం మొబైల్ ఫోన్లలో 60 శాతానికి పైగా యుపికి చెందినవే ఉండటం గమనార్హం.

కొత్త ఎలక్ట్రానిక్స్ తయారీ విధానం 2020 ఇప్పుడు మొత్తం రాష్ట్రానికి విస్తరించింది.

పాలసీలో ప్రతిపాదించిన ప్రోత్సాహకాలు యుపిలో ఎక్కడైనా తమ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసే అన్ని యూనిట్లకు వర్తిస్తాయి.

ప్రాంతీయ అసమతుల్యతను పరిష్కరించడానికి, బుందేల్‌ఖండ్ మరియు పూర్వంచల్ ప్రాంతాల్లో తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి పెట్టుబడిదారులకు భూమి రాయితీ రేటు రెట్టింపు ఇవ్వనున్నట్లు ఈ విధానంలో పేర్కొన్నారు.

ఈ కొత్త ఎలక్ట్రానిక్స్ తయారీ విధానంతో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం కొత్త గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ హబ్ కావాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది.

అంతేగాక కోవిడ్ పరిణామాల తరువాత తమ తయారీ కేంద్రాలను ఇండియాకి మార్చాలని భావిస్తున్నా అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా ఈ విధానం రూపొందించడం జరిగింది.

Also Read: 20% L1 Posts are Reserved for those