Quality Norms for Imported Toys

Quality Norms for Imported Toys

Quality Norms for Imported Toys

Quality norms for imported toys: విదేశీ ఆట వస్తువులకు నాణ్యత నిబంధనలు

కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ‘పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం’ (డీపీఐఐటీ), ఆట వస్తువుల నాణ్యత నియంత్రణ ఆదేశాన్ని (QCO) 25.02.2020న జారీ చేసింది. అమలు తేదీని 01.09.2020గా ప్రకటించింది. పారిశ్రామిక సంఘాల విజ్ఞప్తి మేరకు, దీనిని 01.01.2021 వరకు పొడిగించింది.

    ఈ ఆదేశం ప్రకారం, విదేశీ బొమ్మల నాణ్యత ‘ఇండియన్‌ స్టాండర్డ్స్‌ ఫర్‌ సేఫ్టీ ఆఫ్‌ టాయ్స్’ ప్రకారం ఉండటం తప్పనిసరి. బీఐఎస్‌ (అనుగుణ్యత మదింపు‌) నిబంధనలు‌-2018లోని షెడ్యూల్‌-IIలోని స్కీమ్‌-I ప్రకారం తీసుకున్న లైసెన్స్‌ కింద, బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) ప్రామాణిక ముద్రను అవి కలిగివుండాలి.

Click here to Join us on Telegram

    డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ), 02.12.2019న, 33/2015-2020 నంబరు ప్రకటన విడుదల చేసింది. దీనిప్రకారం, బొమ్మలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే, కన్‌సైన్‌మెంట్లలో ర్యాండమ్‌గా నమూనా పరీక్ష, అనుమతి తప్పనిసరి. విదేశీ లైసెన్సుదారుల బొమ్మల దిగుమతుల నుంచి నమూనాలను తీసుకుని పరీక్షించడానికి అధికారుల నియామకం జరిగింది. దీనికి సంబంధించిన ‘ప్రామాణిక కార్యాచరణ‌’ కస్టమ్స్‌ విభాగానికీ అందింది.

    వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి శ్రీ దన్వే రావ్‌సాహెబ్‌ దాదారావ్‌, ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా రాజ్యసభకు సమర్పించారు.

Also Read: Important 50 Who is Who Bits