SBI inks MoU with Japan Bank for International Cooperation
భారతదేశంలోని జపాన్ కంపెనీల అవసరాలకు 1 బిలియన్ అమెరికన్ డాలర్ల మేర రుణం అందించేందుకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోపరేషన్'(JBIC) తో ఒక ఒప్పందంపై సంతకం చేసింది.
భారతదేశంలో శాఖలు లేని జపనీస్ ప్రాంతీయ బ్యాంకుల (JRB) ఖాతాదారులైన జపనీస్ చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు మరియు మధ్య స్థాయి సంస్థల వ్యాపార కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి ఒక ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి మరియు ఆ సంస్థలను బలోపేతం చేయడానికి జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఎస్‌బిఐతో ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ అవగాహన ఒప్పందం ద్వారా ఎస్.బి.ఐ. దేశీయ శాఖల వ్యాపారం పెరగడంతో పాటు టోక్యో మరియు ఒసాకా శాఖలకు ఎక్కువ నిధులను అందించనుంది.
జపాన్ ప్రభుత్వ పూర్తి యాజమాన్యంలోని JBIC, జపాన్ ఎగుమతులు మరియు దిగుమతులను ప్రోత్సహిస్తుంది మరియు అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా విదేశీ పెట్టుబడులకు వనరులను అందిస్తుంది. జపాన్ మరియు ఇతర దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం.
Also Read: Jal Jeevan Mission promotes research and development