Start-up Village Entrepreneurship Programme (SVEP)

Start-up Village Entrepreneurship Programme (SVEP)

Startup Village Enterpreneurship Program

Start-up Village Entrepreneurship Programme (SVEP) – గ్రామీణ అంకుర సంస్థల వ్యవస్ధాపకత కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లోని సంస్థలను ముందుకు నడిపిస్తోంది, గ్రామీణ పారిశ్రామికవేత్తలను తయారుచేస్తోంది.

ఎస్.వి.ఈ.పి. వ్యాపార సహాయ సేవలను మరియు మూలధన సహాయాన్ని 23 రాష్ట్రాలలోని 153 బ్లాక్‌లకు విస్తరించింది. ఈ కార్యక్రమం ద్వారా 2020 ఆగష్టు నాటికి, సుమారు ఒక లక్ష సంస్థలకు మద్దతు ఇస్తుండగా – అందులో 75 శాతం సంస్థలు మహిళల యాజమాన్య నిర్వహణలోలో ఉన్నాయి.

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (DAY-NRLM) ద్వారా గ్రామీణ అంకుర సంస్థల వ్యవస్ధాపకత కార్యక్రమం Start-up Village Entrepreneurship Programme (SVEP) 2016 నుండి ఉప పథకంగా అమలౌతోంది.

Join us on Telegram

గ్రామీణ పేదలు పేదరికం నుండి బయటపడడానికి మద్దతు ఇవ్వాలనే లక్ష్యంతో, సంస్థలను ఏర్పాటు చేయడానికి మరియు సంస్థలను స్థిరీకరించే వరకు సహాయాన్ని అందించడానికి వారికి మద్దతు ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాన్ని అమలుచేయడం జరుగుతోంది.

సంస్థల అభివృద్ధి కోసం స్థానిక కమ్యూనిటీ క్యాడర్లను సృష్టించేటప్పుడు ఆర్థిక సహాయం మరియు వ్యాపార నిర్వహణ, నైపుణ్యాలపై శిక్షణతోపాటు స్వయం ఉపాధి అవకాశాలను అందించడంపై SVEP దృష్టి పెడుతుంది.

Start-up Village Entrepreneurship Programme (SVEP) గ్రామీణ అంకురసంస్థల యొక్క ఆర్ధిక, ఇంక్యుబేషన్ మరియు నైపుణ్యాలకు సంబంధించిన పర్యావరణ వ్యవస్థ వంటి మూడు ప్రధాన సమస్యలను పరిష్కరిస్తుంది.

గ్రామీణ సంస్థలను ప్రోత్సహించడానికిగాను, SVEP క్రింద కార్యకలాపాలను వ్యూహాత్మకంగా రూపొందించబడ్డాయి. Community Resource Persons- Enterprise Promotion (CRP-EP)ను అభివృద్ధి చేయడం, ఈ కార్యక్రమ కీలక అంశాలలో ఒకటి.

Join us on YouTube

స్థానికంగా ఉండే వీరు, గ్రామీణ సంస్థలను ఏర్పాటు చేసే వ్యవస్థాపకులకు మద్దతు ఇస్తారు. SVEP బ్లాకులలో Block Resource Center(BRC)ని ప్రోత్సహించడం, కమ్యూనిటీ రిసోర్స్ వ్యక్తులను పర్యవేక్షించడం మరియు నిర్వహించడం, SVEC ఋణ దరఖాస్తును అంచనా వేయడం మరియు సంబంధిత బ్లాక్‌లోని సంస్థకు చెందిన సమాచారం యొక్క రిపోజిటరీగా పనిచేయడం అనేది మరొక కీలక మైన అంశం.

సమర్థవంతంగా మరియు స్వతంత్రంగా పనిచేయడానికి, స్థిరమైన ఆదాయ నమూనాకు మద్దతు ఇవ్వడానికి BRCలు తమపాత్రను పోషిస్తాయి.

కొత్త సంస్థలను ఏర్పాటు చేయడానికీ, ఉన్న సంస్థలను బలోపేతం చేయడానికీ, గ్రామీణ సమాజాలను సమీకరించడంపై SVEP మొదలు పెట్టిన ప్రారంభ సంవత్సరాల్లో దృష్టి సారించింది.

BRC సభ్యుల కోసం వ్యాపార నిర్వహణ అంశాలపై శిక్షణ మరియు సామర్థ్యం పెంపుపై పెట్టుబడి పెట్టింది. CRP-EPలతో ఒక బృందాన్ని తయారుచేసి, వారికి కఠోర శిక్షణ ఇచ్చింది.

Also Read: Jal Jeevan Mission promotes research and development

వ్యవస్థాపకులకు వారి ప్రస్తుత సంస్థలను పెపొందించుకోడానికీ, కొత్త సంస్థలను స్థాపించడానికీ అవసరమైన సహాయ, సహకారాలను అందించింది.

గత కొన్ని సంవత్సరాలుగా, SVEP అద్భుతమైన పురోగతి సాధించింది. 2020 ఆగష్టు నాటికి 23 రాష్ట్రాలలో 153 బ్లాకులకు వ్యాపార సహాయ సేవలతో పాటు, మూలధన తోడ్పాటునందించింది.

Community Resource Person-Enterprise Promotion (CRP-EP)శిక్షణ పొందిన 2 వేల మంది కార్యకర్తలు గ్రామీణ పారిశ్రామికవేత్తలకు అవసరమైన సేవలందిస్తున్నారు.

2020 ఆగష్టు నాటికి, సుమారు లక్ష సంస్థలకు వీరు సహాయ, సహకారాలు అందించారు. SVEPకి, అహ్మదాబాద్‌లోని entrepreneurship development institute of india (EDIP), సాంకేతిక సహాయ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

Join us on Facebook

క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2019 సెప్టెంబరు నెలలో నిర్వహించిన SVEP యొక్క మధ్యకాలిక సమీక్ష నివేదించిన బ్లాకులలో సర్వే చేసిన వ్యవస్థాపకులలో 82 శాతం మంది, ఎస్.సి., ఎస్.టి. మరియు ఓ.బి.సి. వర్గాల వారు ఉన్నట్లు పేర్కొంది.

ఇది, ఎన్.ఆర్.ఎల్.ఎం. ముఖ్య ఆశయాలలో ఒకటైన సామాజిక చేరికను సూచిస్తుంది. వీటిలో 75 శాతం సంస్థలను మహిళలు స్వంతంగా నిర్వహిస్తున్నారు. ఈ సంస్థల సగటు నెలసరి ఆదాయం తయారీ రంగంలో 39,000 – 47,800 రూపాయలుగా; సేవల విషయంలో 41,700 రూపాయలుగా, ట్రేడింగ్ రంగంలో 36,000 రూపాయల వరకు ఉంది. వ్యవస్థాపకుల మొత్తం గృహ ఆదాయంలో 57 శాతం SVEP సంస్థల ద్వారా అందుతున్నట్లు అధ్యయనం ద్వారా వెల్లడయ్యింది.

SVEP వ్యక్తిగత మరియు సమూహ సంస్థలను ప్రోత్సహిస్తుంది, ప్రధానంగా తయారీ, వాణిజ్య మరియు సేవా రంగాలపై సంస్థలను ఏర్పాటు చేస్తుంది, ప్రోత్సహిస్తుంది.

స్థానిక డిమాండ్ మరియు పర్యావరణ వ్యవస్థ ఆధారంగా వ్యాపారాలను లాభదాయకంగా నడిపించే వ్యవస్థాపకుల సామర్థ్యాలను పెంపొందించడానికి ఈ కార్యక్రమం ఎక్కువగా శ్రద్ధ పెట్టింది.

ధృవీకరించబడ్డ వ్యవస్థాపకులకు CRP-EPలు వ్యాపార సహాయ సేవలను అందిస్థాయి. వ్యాపార ప్రణాళిక మరియు లాభ, నష్టాల ఖాతా తయారీ వంటి సాంకేతిక అంశాలలో ప్రసార నష్టాన్ని తగ్గించడానికి ప్రామాణిక ఇ-లెర్నింగ్ మాడ్యూళ్ళను రూపొందించడానికి ఐ.సి.టి.ని ఉపయోగించడంపై SVEP కింద పెట్టుబడులు పెట్టడం కూడా జరుగుతాయి.

Also Read: Rakesh Asthana appointed DG of Border Security Force