Violinist T N Krishnan passes away at 92
Violinist T N Krishnan passes away at 92
ప్రఖ్యాత వయోలినిస్ట్ టి.ఎన్. కృష్ణన్ సోమవారం 92 సంవత్సరాల వయస్సులో తుది శ్వాస విడిచారు. ఈయన ప్రహసనం ఎంతోమంది ఔత్సాహిక కళాకారుళకు ప్రేరణగా నిలిచింది.
బాల మేధావిగా గుర్తింపు పొందిన టి.ఎన్. కృష్ణన్ వృత్తి పరంగా ఏంతో మంది గౌరవనీయ కళాకారులతో ప్రదర్శన ఇచ్చారు.
టి.ఎన్. కృష్ణన్ జీవితం తొలి నాళ్ళలో
త్రిపునితుర నారాయణయ్యర్ కృష్ణన్ 1928 అక్టోబర్ 6 న కొచ్చిన్ లోని త్రిపునితురాలో జన్మించారు.
అయన తండ్రి పేరు ఎ. నారాయణ అయ్యర్ అతని తల్లి పేరు –అమ్మినీ అమ్మాల్.
కృష్ణన్ తన తండ్రి నుండి చాలా చిన్న వయస్సులోనే సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారు తరువాతి కాలంలో అలెప్పీ కె. పార్థసారథి ఆధ్వర్యంలో విద్యార్థిగా జీవితం ప్రారంభించారు.
8 సంవత్సరాల వయస్సులోనే అరంగేట్రం చేశిన కృష్ణన్ తన సంగీత సామర్ధ్యాలతో అందరినీ ఆశ్చర్యపరిచాడు.
–అనేక వార్తా సంస్థలు టి.ఎన్. కృష్ణన్ చాలా చిన్న వయస్సు నుండే సంగీతంలో గొప్ప నేర్పు కలిగి ఉన్నాట్లు పేర్కొన్నాయి.
Join us on YouTube
టి.ఎన్. కృష్ణన్ ప్రస్థానం
ఇంతకు ముందు చెప్పినట్లుగా, టి.ఎన్. కృష్ణన్ తన 8 సంవత్సరాల వయస్సులోనే తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.
అరియాకుడి రామానుజ అయ్యంగార్, చెంబై వైద్యనాథ భగవతార్, ముసిరి సుబ్రమణియా అయ్యర్ వంటి ఎందరో –గొప్ప కళాకారులతో కలిసి అనేక సంగీత కచేరీలో ప్రదర్శనలు ఇచ్చారు.
తరువాత 1942 లో, మద్రాసు చేరుకున్న కృష్ణన్ ను శ్రీ సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ శ్రీ ఆర్. అయదురైకి పరిచయం చేశారు.
శ్రీ ఆర్. అయదురై ఒక పెద్ద పారిశ్రామికవేత్త అంతేగాక అతడు సంగీతానికి, సంగీత కళాకారులకు ఎంతగానో –మద్దతు ఇచ్చి పోషకునిగా నిలిచిన వ్యక్తి.
శ్రీ ఆర్. అయదురై మరియు అతని భార్య యువ టి.ఎన్. కృష్ణన్ కు అతని జీవితంలోని అన్ని రంగాలలో కూడా తోడుగా నిలిచారు.
టి.ఎన్. కృష్ణన్ కూడా వారి కుటుంబంతో కలిసి జీవించడం ప్రారంభించారు.
టి.ఎన్. కృష్ణన్ జీవితం చివరి వరకూ కూడా, –వీరివురి కుటుంబాలు ఒకదానితో ఒకటి చాలా మంచి సంబంధాలు కలిగి ఉన్నాయి.
కృష్ణన్ తన సామర్ధ్యంతో ప్రాచుర్యం పొందినప్పుడు, టి.ఎన్. కృష్ణన్ లాల్గుడి జయరామన్, ఎం.ఎస్. గోపాలకృష్ణన్ లతో కలిసి కర్ణాటక సంగీతం త్రిమూర్తులుగా పిలువబడ్డారు.
చాలా మంది ప్రజలు వారి కచేరీలకు వెళ్లి –వారి నుండి కొత్త సంగీతాన్ని వినడానికి ఎదురు చూసేవారు.
తన తండ్రిలాగే టి.ఎన్. కృష్ణన్ చాలా మంది పిల్లలకు సంగీతం నేర్పించారు.
ఆయనకు 1973 లో పద్మశ్రీ, 1974 లో సంగీత నాటక్ అకాడమీ అవార్డు, 1980 లో సంగీత కళానిధి, 1992 లో పద్మ భూషణ్ అవార్డులు లభించాయి.
టి.ఎన్. కృష్ణన్ కుటుంబం
టి.ఎన్. కృష్ణన్ 33 సంవత్సరాల వయసులో కమల కృష్ణన్ ను వివాహమాడారు.
ఒక వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టి.ఎన్. కృష్ణన్ భార్య మాట్లాడుతూ – ‘నేను ఒక సంగీతకారుడిని వివాహం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది.’ అని పేర్కొన్నారు
–వీరికి ఇద్దరు పిల్లలు – విజీ కృష్ణన్ నటరాజన్ మరియు శ్రీరామ్ కృష్ణన్. వీరు ఇద్దరూ యోలినిస్టులు మరియు ప్రసిద్ధ కళాకారులు.
టి.ఎన్. కృష్ణన్ మరణం
టి.ఎన్. కృష్ణన్ నవంబర్ 2, 2020 సాయంత్రం కన్నుమూశారు.
Also Read: DPIIT releases consolidated FDI policy:
One thought on “Violinist T N Krishnan passes away at 92”
Comments are closed.