Indian Civil Services Day
ఏ దేశంలో ఐనా ప్రజా సంక్షేమాన్ని, ఆర్ధికాభివృద్ధిని సాధించాలంటే ఆ దేశ రాజ్యాంగంలో నిర్వచించిన విధంగా పాలన సాగాలి. అందుకోసం అధికార విభజన చేయడం సంక్షేమ పధకాలు ప్రజలకు అందేలా చేయడం ప్రభుత్వ భాద్యత. అందులో భాగంగా ఏర్పాటు చేయబడిందే Indian Civil Services. ఇందులో పని చేస్తున్న పౌరసేవకుల కృషిని, సేవను గుర్తిస్తు వీరిని ప్రోత్సహించడానికి ఈ పౌరసేవా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
స్వతంత్ర భారతదేశ తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటెల్ 1947 ఏప్రిల్ 21 నాడు ఢిల్లీ లోని మెట్ కాఫ్ హౌస్ లో ప్రోబేషన్ లో ఉన్న ఎడ్మిని స్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్లనుద్దేశించి మొట్టమొదటిగా ప్రసంగించిన సందర్భాన్ని పురస్కరించుకుని 2006 ఎప్రల్ 21న మొట్టమొదటగా భారత సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21 న భారత సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా జిల్లాలు, విభాగాల వారిగా పరిపాలనో సమర్ధత కనబరచిన వారికి సంక్షేమ పధకాల అమలులో చొరవ చూపిన వారికి పురస్కారలు అందించడం జరుగుతుంది.
ఈ సందర్భంగా వ్యక్తిగతంగా అందించే నగదు పురస్కారం 1 లక్ష కాగా సంస్థ పరంగా అందించేది 5లక్షలు ఉంటుంది. వ్యక్తిగతంగా ఐనా సంస్థాగతంగా ఐనా గరిష్టంగా 15లక్షల వరకు నగదు పురస్కారాలు ఉంటాయి.
పౌరసేవలు, హక్కుల గురించి అవగాహన ఏర్పరిచేందుకు దేశమంతటా అవగాహనా సదస్సులు నిర్వహిస్తుంటారు.