కరోనా కోరలు విప్పిన వేళ
డిసెంబర్ 31 2019 అది ప్రపంచం మొత్తం నూతన సంవత్సర వేడుకల ఏర్పాట్లలో మునిగిపోయిన వేళ, చైనా తమ దేశంలోని ఉహాన్ నగరం కేంద్రంగా ఏదో అంతు చిక్కని కారణం వల్ల కోకొల్లుగా నిమోనియా కేసులు నమోదౌతున్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలిపిన రోజది. జనవరి 9 2020 అది ఒక కొత్త రకం కరోనా వైరస్ గా చైనాకు చెందిన పరిశోధకలు ఒక ప్రాధమిక నిర్ధారణకు వచ్చినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన రోజది. నాటి మొదలు ప్రపంచ దేశాలన్నింటినీ తన కబంద హస్తాలతో కుదిపేసి భయ ప్రకంపనలు సృష్టించిన ఈ వైరస్ రూపాంతరం చెందుతూ చివరకు మహమ్మారిగా మారి ప్రపంచ వ్యాప్తంగా 23 లక్షల మందిపైగ వ్యకులపై తన విషాన్ని చిమ్మింది, వారిలో లక్షా అరవై వేల మందికి పైగా ఈ వైరస్ విషానికి తాళలేక ప్రాణాలు విడిచారు (ఏప్రల్ 19 నాటికి). ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిలో లాక్డౌన్లు, క్వారంటైన్లు, కర్ఫ్యూలు, సామాజిక దూరాలు, సర్వ సాధారణమైపోయాయి.
అసలు ప్రంచాన్నంతటిని ఇంతలా భయపెట్టిన, భయపెడుతున్న ఆ కరోనా వైరస్ సంగతేంటో తెలుకుందామా?
కరోనా వైరస్లు ఒకే జాతీకి చెందిన అనేక వైరస్ల సమూహం, వాటిలో కొన్ని సాధారణ జలుబుకు కారణాలైతే మరికొన్ని ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమౌతున్నాయి. ఉదాహరణకి 2002లో చైనాలో బయటపడ్డ సార్స్(Severe Acute Respiratory Syndrome-SARS), అలాగే 2012లో సౌదీ అరేబియాలో బయటపడ్డ మెర్స్(Middle East Respiratory Syndrome-MARS) ఈ కోవకి చెందినవే. ఐతే సార్స్ అనేది గబ్బిలాల నుండి సంక్రమించగా, మెర్స్ ఒంటెల నుండి సంక్రమించినట్లుగా భావిస్తున్నారు. దాదాపుగా అన్ని కరోనా వైరస్లు జంతువుల నుండే మానవులకు సంక్రమిస్తుంటాయి, అందుకే వాటిని జూనోటిక్(zoonotic) అంటారు.
సార్స్-కోవ్2(SARS-CoV-2) (సార్స్) ను ఒక అంటువ్యాధిగా(Epedemic) ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుతం విజృంభిస్తున్న కొవిడ్-19 ను మాత్రం మహమ్మారిగా(Pandemic) ప్రకటించింది.
మిగిలిన కరోనా వైరస్ల మాదిరిగానే సార్స్-కోవ్2 సైతం గొళాకారంలో ఉండి పైన మొత్తం పుట్టగోడుగులను పోలిన ప్రోటీన్ల పొడుచుకువచ్చినట్లు ఉంటుంది. ఈ ప్రోటీన్ల సహాయంతో ఈ వైరస్ కణాలు మానవ కణాలతో పెనవేసుకుపోతాయి. ప్రస్తుతం విజృంభిస్తున్న కొవిడ్ ప్రోటీన్లు దాదపుగా గబ్బిళాల ప్రోటీన్లతో సరిపోలుతున్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. సార్స్ మరియు కోవిడ్19 రెండింటిలోను ఈ పుట్టగొడుగుల్లా చొచ్చుకు వచ్చిన ప్రోటీన్లు మానవ గ్రాహక కణాలతో పెనవేసుకోవడం ద్వారా ఈ వైరస్ మనుషులకు సంక్రమిస్తుంది. ఐతే 2002లో బయటపడ్డ సార్స్-కోవ్-2 కంటే ప్రస్తుతం విజృంభిస్తున్న కోవిడ్19 దాదాపు 20 రెట్లు ఎక్కువగా మానవ గ్రాహక కణాలతో పెనవేసుకోగలదు. ఈ కారణంగానే కోవిడ్19 తన కోరలను అత్యంత వేగంగా విస్తరించగలుగుతుంది.
మానవ మణుగడకే సవాలు విసురుతున్న ఈ మహమ్మారిని కట్టడి చేయగల వాక్సిన్ ను శాస్త్రవేత్తలు కనుగనేంతవరకు దాన్ని అంతమొందించే మహాయుద్ధంలో పాల్గొనడం ప్రతీఒక్కరి బాధ్యత. ఈ యుద్ధంలో భాగంగా మనం చేయవలసిందల్లా సామాజిక దూరాన్ని, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడమే ఎందుకంటే ప్రీవెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ కదా…
One thought on “SARS-CoV-2 To COVID-19”
Comments are closed.