World Intellectual Property Day: ప్రపంచ మేధోసంపత్తి దినోత్సవం
World Intellectual Property Day ప్రపంచ మేధోసంపత్తి దినోత్సవం: పూర్వము మానవులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరుకోవడానికి కాలినడక పైనే ఆధారపడేవారు. తర్వాతికాలంలో సైకిల్, బస్సు, విమానము, అంటూ ప్రపంచంలో ఏ మూలకైనా, ఎంత దూరమైనా గంటల సమయంలోనే చేరుకోగలుగుతున్నాడు. ఎంతో కష్ట తరమైనప్పటికి, మనిషికి అవసరమైన శస్త్ర చికిత్సలు కూడా చాలా సులువుగా చేయగలుగుతున్నాడు. సమాజంలో తాను విలాసవంతమైన, ఆనందకరమైన జీవితాన్ని గడపటానికి కంప్యూటర్లు, సెల్ఫోన్లు వంటి అనేక వస్తువులను కనుగొన్నాడు మానవుడు.
మానసికంగా ఉల్లాసంగా ఉండటానికి అనేక రచనలు చేస్తూ, శాస్త్ర సాంకేతిక సాహిత్యం వంటి అనేక రంగాలలో ఎంతో మేధాసంపత్తిని సంపాదిస్తున్నాడు మానవుడు. ఈ మేధాసంపత్తిని కాపాడుకోవటానికి copyrights, patents, trademark అంటూ వాటికి రక్షణ వలయాలను కల్పించుకున్నాడు మనిషి.
చదవండి: World Malaria Day 25 April
World Intellectual Property Rights Organisation
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 26వ తేదీన ప్రపంచ మేధోసంపత్తి దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ప్రపంచ మేధో సంపత్తిని సంరక్షించాలి అనే ఉద్దేశంతో, 14 July 1967నాడు ఏర్పడ్డ World Intellectual Property Rights Organisation 1970 ఏప్రిల్ 26నుండి తన కార్యకలాపాలు మొదలు పెట్టింది.
ప్రపంచ మేధోసంపత్తి రక్షణపై అవగాహనను మరింత పెంపొందించడానికి, ప్రపంచవ్యాప్తంగా మేధోసంపత్తి యొక్క ప్రభావాన్ని విస్తరించడానికి 1988లో ప్రపంచ మేధోసంపత్తి యొక్క సభ్యదేశాల అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. తర్వాత ‘అల్జీరియన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ’ డైరెక్టర్ జనరల్ సైతం ఏప్రిల్ 7 1999న దీనిని సమర్ధిస్తూ మరో ప్రకటన చేశారు. ఈ సంస్థ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 26న ప్రపంచ మేధోసంపత్తి దినోత్సవం నిర్వహించాలని 1999వ సంవత్సరంలో తమ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
మొట్టమొదటిసారిగా ప్రపంచ మేధోసంపత్తి దినోత్సవాన్ని(World Intellectual Property Day) 2000 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. ప్రపంచంలోని పేటెంట్లు, కాపీరైట్లు, ట్రేడ్మార్కులు వంటివి రోజు వారి జీవితంలో ఎలా ప్రభావితం చేస్తాయి, మేధోసంపత్తి రక్షణ చట్టాలు నిబంధనలు హక్కులపై ప్రజలకు చట్టపరమైన అవగాహనను కల్పించడానికి ఈ సందర్భంగా నిర్వహిస్తుంటారు.
2020 ప్రపంచ మేధోసంపత్తి దనోత్సవ ధీమ్ Innovate for a green future (హరిత భవిష్యత్తు కోసం ఆవిష్కరించండి)