May 2020 Important Days and Events

మే నెలలో ముఖ్యమైన రోజులు

భారతదేశం అనేక జాతుల, మతాల మేళవింపుతో పరిమళించే అందమైన దేశం. 

ఈ మేళవింపుతో మనదేశం అనేక పండుగలకు, ఉత్సవాలకు నెలవయింది. ఇది మనకు మాత్రమే సొంతమైన భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. పండుగలు పబ్బాలేకాదు అంతర్జాతీయంగా జరుపుకునే ఉత్సవాలుసైతం మనం అనేకం జరుపుకుంటుంటాం.
ప్రతి నెలలో ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకోవడం పోటీ పరీక్షలకు సంసిద్ధమయ్యే వారందరికీ ఎంతో అవసరం. మే 2020లో రాబోయే ఇలాంటి ముఖ్యమైన రోజుల గురించి ఈ May 2020 Important Days and Events ఆర్టికల్లో క్లుప్తంగా తెలుసుకుందాం.

మే1

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం(International Labour Day):

మేడేగా పిలువబడే అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని మన దేశంలో అంతర్రాష్ట్రీయ శ్రామిక దినోత్సవంగా జరుపుకుంటాం. 

ఇది శ్రామిక సోదరులందరిలోను ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.
మహరాష్ట్ర డే: ఉమ్మడిగా ఉన్న మహరాష్ట్ర గురజరాత్ రాష్ట్రాలు రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డ రోజును మహరాష్ట్ర ప్రజలు మహరాష్ట్రా దివస్ గా జరుపుకుంటారు.

మే3

పత్రికా స్వేచ్ఛా దినోత్సవం (Press Freedom Day):

ప్రతి ఏటా పత్రికా స్వేచ్ఛను ప్రపంచవ్యాప్తం చేసే ఉద్దేశంతో మే3 న ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ రోజు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయుల స్మారకార్ధం ఇది ప్రారంభించారు.

ప్రపంచ నవ్వుల దినోత్సవం (World Laughter Day):

ప్రతీఏటా మే నెలలో వచ్చే మొదటి ఆదివారాన్ని ప్రపంచ నవ్వుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా 1998లో ముంబాయి నగరంలో నిర్వహించారు. 

Worldwide Laughter Yoga ఉద్యమ ఆద్యుడు డా. మదన్ కటారియా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

మే4

అంతర్జాతీయ అగ్నిమాపకసిబ్బంది దినోత్సవం (International Firefighters Day):

తమ ప్రాణాలు సైతం పణంగాపెట్టి పనిచేసే అగ్నిమాపక సిబ్బంది గౌరవార్ధం ఏటా మే4వ తేదిన అంతర్జాతీయ అగ్నిమాపకసిబ్బంది దినోత్సవాన్ని జరుపుకుంటాం. 

ఆస్ట్రేలియాలో 1998లో సంభవించిన కార్చిచ్చులో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది స్మారకార్ధం దీనిని 1999లో ప్రారంభించారు.

మే5

ప్రపంచ ఉబ్బసం వ్యాధి దినోత్సవం (World Asthma Day):

ప్రతీ సంవత్సరం మేనెలలో వచ్చె మొదటి మంగళవారాన ప్రపంచ ఉబ్బసం వ్యాధి దినోత్సవాన్ని Global Initiative for Asthma అనే సంస్థ నిర్వహిస్తుంది.

మే7

 

 

రవీంద్రనాధ్ ఠాగూర్ జయంతి (Rabindranath Tagore Jayanti): 

1861 మే7న జన్మించిన విశ్వకవి రవింద్రనాధ్ ఠాగూర్ భారతదేశం గర్వించదగ్గ భరతమాత ముద్దుబిడ్డ.

రచయితగా, చిత్రకారునిగా, మానవతావాదిగా, కవిగా, ఆధ్యాత్మికవేత్తగా ఆయన తన బహుముఖ ప్రజ్ఞను విశ్వవ్యాప్తిగా  చాటిన మహనీయుడు. సాహిత్యంలో ఆయన కనబరచిన ప్రజ్ఞకు 1913లో ఆయనను నోబెల్ సాహిత్య పురస్కారం వరించింది.

చదవండి: National Panchayati Raj Day: e-Gram Swaraj, Swamitva Yojana

మే8

ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం (World Red Cross Day):

మొట్టమొదటి నోబెల్ శాంతి పురస్కార గ్రహీతలలో ఒకరైన హెన్రీ డునాంట్ (ఈ పురస్కారాన్ని హెన్రి డునాంట్ ఫ్రెడ్రిక్ పాసీతో పంచుకున్నారు) జ్ఞాపకార్ధం ప్రతీ ఏడు మే8న ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడైన హెన్రీ డునాంట్  1828 మే8న జెనీవాలో జన్మించారు ఈయన జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతీఏడు మే8న ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

ప్రపంచ తలసేమియా దినోత్సవం (World Thalassaemia Day):

ప్రపంచవ్యాప్తంగా తలసేమియా వ్యాధితో బాధ పడుతున్నవారిలో మనోధైర్యాన్ని నింపే ఉద్దేశంతో ప్రతి ఏడు మే8న ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని జరుపకుంటారు.

మే10

మాతృదినోత్సవం (Mother’s Day):

అపరమిత ప్రేమకు అంతులేని లాలనకు ప్రతిరూపమైన మాతృత్వంలోని గొప్పదనానికి ప్రతీకగా ప్రతీఏడు మేనెలలో వచ్చే 2వ ఆదివారాన్ని మాతృదినోత్సవంగా జరుపుకుంటాం.

మే11

జాతీయ సాంకేతికత దినోత్సవం (National Technology Day):

ఆపరేషన్ శక్తి- 1998 మే11 భాతర మిలటరి టెస్ట్ రేంజ్ పోఖ్రాన్లో జరిగిన 5 అణు పరీక్షలలో మొదటిది విజయవంతంగా పూర్తి చేసిన రోజది. 

ఆ విజయాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా మే11 మన దేశంలో జాతీయ సాంకేతికత దినోత్సవాన్ని జరుపుకుంటాము.

మే12

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం (International Nurses Day):

సమాజానికి నర్సులు అందిస్తున్న సేవలకు గుర్తుగా, ఆధునిక నర్సింగ్ కు ఆధ్యురాలైన ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్నదినమైన మే12 ను అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా నిర్వహిస్తారు.

చదవండి: World Malaria Day 25 April

మే15

అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం (International Family Day):

ప్రతి సంవత్సరం మే 15 న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం జరుపుకుంటారు.

అంతర్జాతీయ సమాజం కుటుంబాలకు ఇచ్చే ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తూ 1993లో UN జనరల్ అసెంబ్లీ తీర్మానంతో ఈ రోజును అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా ప్రకటించింది.

జాతీయ అంతరించిపోతున్న జీవుల దినోత్సవం (National Endangered Species Day):

ప్రతి సంవత్సరం మే నెలలో మూడవ శుక్రవారం, అంతరించిపోతున్న జీవుల రక్షణ యొక్క ప్రాముఖ్యత, వాటి ఆవాసాలు పరిరక్షణకు అవసరమైన చర్యల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి జాతీయ అంతరించిపోతున్న జీవాల దినోత్సవాన్ని జరుపుకుంటాం.

May 2020 Important Days and Events మరి కొన్ని.


One thought on “May 2020 Important Days and Events”

Comments are closed.