International Labour Day 1 May 2020

International Labour Day 1 May 2020

International Labour Day అంతర్జాతీయ శ్రామిక దినోత్సవం:

International Labour Day అనేది మే1న శ్రామిక సోదరులందరు పండుగగా జరుపుకునే పర్వదినం.

శ్రామికులకు నిరంకుశ యజమాన్యాల దాష్టికాల నుండి రక్షణ లభించిన రోజు.

గతం మిగిల్చిన చేదు అనుభవాలు తలపిస్తూ, వాటినుండి విముక్తి పొందేందుకు పోరాడిన మహనీయుల త్యాగాలను గుర్తు చేస్తుందీరోజు.

ప్రపంచవ్యాప్తంగా ఎన్నోదేశాలలో ఈరోజును సెలవుదినంగా పాటిస్తారు.

chennai labour statue

చారిత్రక నేపధ్యం

1886లో చికాగోలో చోటుచేసుకున్న హేమార్కెట్ ఉదంతాన్ని పురస్కరించుకుని మే1ని అంతర్జాతీయ శ్రామిక దినోత్సవం(International Labour Day)గా జరుపుకోవాలని 19వశతాబ్దపు చివర్లో సోషలిస్టులు, కమ్యూనిస్టులు, మరియు ట్రేడ్ యూనియన్లు నిర్ణయించాయి.

శ్రామికులు రోజుకు 16 గంటలకు పైగా రక్షణకొరవైన పరిస్థితులలో పనిచేస్తున్న కాలమది.

ఎన్నో సంవత్సరాలుగా ఈ శ్రామికులు తాము పనిచేసే పరిస్థితులు మెరుగు పడాలని రోజుకు 8 పనిగంటలు మాత్రమే ఉండాలని పోరాడుతున్న రోజులవి.

ఎంత మొరపెట్టుకున్నా ఎన్ని పోరాటాలు జరిపినా పెట్టుబడిదారీ యాజమాన్యాలకు శ్రామికుల కష్టాలు కనిపించేవి కావు, వారి గోడు వినిపించేది కాదు.

చదవండి: May 2020 Important Days and Events

చికాగో హేమార్కెట్ ఉదంతం

heymarket square chicago

సరిగ్గా అలాంటి పరిస్థితుల్లో 1884 అక్టోబరులో The Federation of Organised Trades and Labour Unions of the United States and Canada 1మే1886 నుండి రోజుకు కేవలం 8 పనిగంటలే ఉండాలని తీర్మానం చేసింది.

అది 1మే1886, 3నుండి5 లక్షల మంది శ్రామికులు అమెరికా వీధుల్లో సమ్మెలు మొదలు పెట్టారు.

హేమార్కెట్ ఉదంతానికి కేంద్రమైన చికాగోలో దాదాపు 40వేల మంది శ్రామికులు ఈ సమ్మెలలో పాల్గొన్నట్లు అనేకమంది చరిత్ర కారుల అంచనా.

మే3 వరకు ఈ సమ్మేలు ప్రశాంతంగానే సాగాయి.

ఆ రోజు సాయంత్రం పనివేళలు ముగిసే సమయానికి సమ్మెలో పాల్గొనకుండా మెక్ కోర్మిక్ హార్వెస్టింగ్ మెషీన్ కంపెనీలో కొందరు శ్రామికుల పని చేశారు.

వారితో తలబడే ప్రయత్నం చేసారు నిరశనకారులు. దాన్ని అడ్డుకని పనిచేసిన వారికి రక్షణ కల్పించారు పోలీసులు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పులో ఇద్దరు మరణించారు.

హేమార్కెట్ బాంబు పేలుడు ఘటన

heymarket bombing

మే4 చికాగోలోని హేమార్కెట్ స్క్వేర్ వద్ద నిరశనకారులను చెదరగెడుతున్న పోలీసులపై ఒకరు బాంబును విసరగా అందులో ఏడుగురు అధికారులతోపాడు నలుగురు పౌరులుకూడా మరణించారు.

దానితో పోలీసులు వారిని చుట్టుముట్టి బాంబుదాడికి కారకులుగా భావించిన ఎనిమిది మంది అరాచకవాదులను అరెస్టు చేసారు.

కోర్టు వారిలో 7గురికి మరణ శిక్ష విధించి ఒకరికి 15 సంవత్సరాల కారాగారవాసాన్ని విధించింది. ఇందులో 4గురికి ఉరిశిక్షను అమలుపరిచారు. ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు.

మిగిలిన ఇద్దరి ఉరిశిక్షను కోర్టు యావజ్జీవ కారాగారవాసంగా మార్చింది. ఈ మరణించినవారిని హేమార్కెట్ అమరవీరులుగా అభివర్ణిస్తారు.

heymarket martyrs

చదవండి: World Malaria Day 25 April

రోజుకు 8 పని గంటల చట్టం చేసిన అమెరికా

1889లో అంతర్జాతీయ కార్మికుల సాంఘికవాదుల సంస్థ మే1ని అంతర్జాతీయ శ్రామిక దినోత్సవంగా (International Labour Day) ప్రకటించారు.

ఎన్ని పోరాటాలు, సమ్మెలు, నిరశనలు జరిగినప్పటికి శ్రామికుల న్యాయమైన కోరికైన రోజుకు 8పనిగంటలు 1916లో అమెరికా చట్టం చేసేవరకు నెరవేరలేదు.

1916లో అమెరికా తరువాత ప్రపంచదేశాలన్ని అంచెలంచెలుగా ఇలాంటి చట్టాలే చేసాయి.

తరువాతి కాలంలో మే1 ప్రపంచంలో అనేక దేశాలు శ్రామిక దినోత్సవంగా, ప్రభుత్వ సెలవుదినంగా పాటిస్తూ International Labour Dayను అధికారికంగా నిర్వహిస్తూ వస్తున్నాయి.

the heymarket memorial

చదవండి: National Panchayati Raj Day: e-Gram Swaraj, Swamitva Yojana

భారతదేశంలో మేడే

singaravelar stamp

భారతదేశంలో మే డే విషయానికొస్తే, దేశం 1923 లో మొట్టమొదటి కార్మిక దినోత్సవం వేడుకను అప్పటి మద్రాసులో చూసింది.

లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందూస్తాన్ నాయకుడు సింగరవేలర్ నేతృత్వంలో, రెండు సమావేశాలు జరిగాయి, ఒకటి ట్రిప్లికేన్ బీచ్ వద్ద మరొకటి మద్రాస్ హైకోర్టు సమీపంలో.

ఈ సమావేశాలలోనే మే1ని కార్మిక దినోత్సవంగా, ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానం ఆమోదించబడింది.

భారతదేశంలో ఎర్రజెండాను ఉపయోగించిన మొదటి సందర్భం ఇది.