Rabindranath Tagore రవీంద్రనాథ్ ఠాగూర్
Rabindranath Tagore రవీంద్రనాథ్ ఠాగూర్, (బెంగాలీలో రబీంద్రనాథ్ ఠాకుర్), మే 7, 1861, కలకత్తాలో జన్మించారు. కవితలు, చిన్న కథలు, పాటలు, నాటకాలు, వ్యాసాలు, చిత్రలేఖనాలు ఇలా ఆయన కలంనుండి ఝాలువారిన అందాలెన్నో.
అప్పటి వరకు శాస్త్రీయ సంస్కృతం ఆధారంగా సాగిన సాంప్రదాయ రచనాశైలి నుండి కొత్త గద్య, పద్య రూపాలు మరియు బెంగాలీ సాహిత్యంలో రోజువారీ సంభాషణా భాషను ఉపయోగించడం ద్వారా సాహిత్యంలో కొత్త పంధాకు శ్రీకారం చుట్టారు.
భారతీయ సంస్కృతిని పాశ్చాత్య దేశాల సంస్కృతుల మధ్య ఆయన ఒక వారధిగా ఆయన ఎంతగానో ప్రభావితం చేసిన వ్యక్తి.
ఈయన 20 వ శతాబ్దం తోలి నాళ్ళలోని భారతదేశపు అత్యుత్తమ సృజనాత్మక కళాకారుడిగా పరిగణించబడ్డాడు.
1913 లో సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి ఐరోపాయేతర వ్యక్తి అయ్యాడు.
మత సంస్కర్త దేబేంద్రనాథ్ ఠాగూర్ కుమారుడైన అతను పద్యాలు రాయడంతో ఆయన రచనలు ప్రారంభించారు.
1870ల చివరలో ఇంగ్లాండ్‌లో చదువును మధ్యలో ఆపేసి భారతదేశానికి తిరిగి వచ్చారు.
1880లలో అనేక కవితా పుస్తకాలను ప్రచురించాడు, ఆయన రచనలలో పేరొందిన మనసి(1890)ను పూర్తి చేశాడు, ఇది అతని రచనా పరిపక్వతను ప్రపంచానికి తెలియజేసింది.
ఇందులో బెంగాలీకి కొత్త పద్య రూపాలతో పాటు అతని సమకాలీన బెంగాలీలను విమర్శించే కొన్ని సామాజిక మరియు రాజకీయ వ్యంగ్యాలతో సహా అతని ప్రసిద్ధ కవితలు కొన్ని ఉన్నాయి.
చంవండి: National Panchayati Raj Day: e-Gram Swaraj, Swamitva Yojana
పద్మా నది ఒడిలో…
1891 లో ఠాగూర్ తూర్పు బెంగాల్‌కు (ప్రస్తుత బంగ్లాదేశ్)లోని షిలైదా మరియు షాజాద్‌పూర్‌లో గల తన కుటుంబ ఎస్టేట్లను నిర్వహించడానికి వెళ్ళాడు.
అక్కడ అతను తరచుగా పద్మ నది (గంగా నది యొక్క ప్రధాన పాయ)లోని ఒక పడవలో కాలం వెళ్ళబుచ్చేవారు.
గ్రామ ప్రజలతో సన్నిహితంగా ఉండేవాడు. వారి పట్ల అయనకు గల సానుభూతి తరువాతి కాలంలో ఆయన రచనలలో చాలావరకు ప్రభావం చూపాయి.
అతని అత్యుత్తమ చిన్న కథలు 1890 ల నాటివే. జీవితంలోని చిన్ని చన్ని కష్టాలను పరిశీలించేవిగా ఉండే ఈ రచనలు సున్నితమైన వ్యంగ్యంతో కప్పబడిన ఒక విషాదాన్ని కలిగి ఉంటాయి, ఇది అతనికే శైలిలో ప్రత్యేకత.
టెలిగ్రాంలో మా అప్డేట్స్ పొందేెందుకు https://t.me/onlineappsc
Rabindranath Tagore బెంగాలీ గ్రామీణ ప్రాంతాలను అమతంగా ఇష్టపడేవాడు, అన్నింటికంటే ఎక్కువగా పద్మ నది హొయలు, తన పద్యంలో తరచుగా పునరావృతమయ్యే చిత్రం.
ఈ కాలంలో అతను అనేక కవితా సంకలనాలను ప్రచురించాడు, ముఖ్యంగా సోనార్ తారి (1894; ది గోల్డెన్ బోట్), వాటితో పాటు అనేక నాటకాలు, అందులో చెప్పుకోదగ్గది చిత్రాంగద (1892; చిత్ర).
ఠాగూర్ కవితలు వాస్తవంగా అనువదించలేనివి, అటువంటివే అయన సంకలనం చేసిన 2 వేలకు పైగా పాటలు, బెంగాలీ సమాజంలోని అన్ని వర్గాలలో ఇవన్నీ గణనీయమైన ప్రజాదరణ పొందాయి.
చంవండి: World Malaria Day
శాంతినికేతనంలో జీవితం
1901 లో ఠాగూర్ గ్రామీణ పశ్చిమ బెంగాల్లో శాంతినికేతన్ వద్ద ఒక ప్రయోగాత్మక పాఠశాలను ఆయన స్థాపించారు, అక్కడ భారతీయ మరియు పాశ్చాత్య సంప్రదాయాలలో ఉత్తమమైన వాటి మేళవింపుక ఆయన ప్రయత్నించాడు.
తరువాతి కాలంలో అతను అక్కడే శాశ్వతంగా స్థిరపడ్డాడు, ఇది 1921 లో విశ్వ-భారతి విశ్వవిద్యాలయంగా మారింది.
1902 మరియు 1907 మధ్యకాలంలో అతని భార్య మరియు ఇద్దరు పిల్లలు మరణించినప్పటి నుండి చాలా సంవత్సరాల పాటు ఆ విచారం అతని తరువాత కవిత్వంలో ప్రతిబింబిస్తుంది.
ఇది పాశ్చాత్య దేశాలకు ఆంగ్లంలో గీతాంజలి(1912)లో పరిచయం చేయబడింది. ఇది Rabindranath Tagore అనేక బెంగాలీ పద్య సంకలనాలు నుండి ఆధ్యాత్మక కవితలు నుండి మరియు బెంగాలీ గీతాంజలి(1910) తో సహా ఠాగూర్ యొక్క అనేక పద్య గద్యాల అనువాదాలను కలిగి ఉన్నది.
ఈ పుస్తకాన్ని W.B. యేట్స్ మరియు ఆండ్రే గైడ్ మన్ననలు గెలుచుకుంది. ఈ పుస్తకమే 1913 లో అతనికి నోబెల్ బహుమతిని గెలుచిపెట్టింది.
Rabindranath Tagoreకు 1915 లో నైట్‌హుడ్ లభించింది, కాని 1919 లో జల్లియన్‌వాల్లా బాగ్ ఊచకోతకు నిరసనగా అతను దానిని తిరస్కరించాడు.
చంవండి: May 2020 Important Days and Events
స్వతంత్ర పోరులో ఠాగూర్ ముద్ర
1912 నుండి ఠాగూర్ ఐరోపా, అమెరికా, మరియు తూర్పు ఆసియాలో తన రచనల పఠనం, ఉపన్యాసాల ద్వారా భారత స్వాతంత్ర్యం కోసం అనర్గళమైన ప్రతినిధి అయ్యారు.
బెంగాలీలోని Rabindranath Tagore యొక్క నవలలు అతని కవితలు మరియు చిన్న కథల కంటే బాగా ప్రసిద్ది చెందాయి; వాటిలో గోరా (1910) మరియు ఘరే-బైర్ (1916) చెప్పుకోదగ్గవి. వీటిని ఆంగ్లంలోకి వరుసగా గోరా మరియు ది హోమ్ అండ్ ది వరల్డ్ అని అనువదించారు.
1920 ల చివరలో, అతను తన 60 వ దశకంలో ఉన్నప్పుడు, ఠాగూర్ చిత్రలేఖనం మొదులపెట్టారు. ఆయన కుంచె నుండి ఝాలువారిన అందాలెన్నో Rabindranath Tagoreకు భారతదేశపు ప్రముఖ సమకాలీన కళాకారులలో స్థానం సంపాదించాయి.