ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ
మే 5వరకూ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కార్యక్రమం పురోగతిని తెలియజేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
Click here for English Version
కోవిడ్-19 లాక్డౌన్ ద్వారా నెలకొన్న విపత్కర పరిస్థితుల నుండి పేదలను రక్షించే ఉద్దేశంతో మార్చి నెల 26న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారమన్ ఈ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీను ప్రకటించారు.
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీలో భాగంగా మహిళలకు, పేద వృద్ధలకు మరియు రైతులకు ఆహార ధాన్యాలతో పొటు ఆర్ధిక సహాయం కూడా అందనుంది.
ప్యాకేజీ సత్వర అమలుకై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనునిత్యం శ్రమిస్తున్నవి.
లాక్డౌన్ నేపధ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ ప్యాకేజీ ఫలాలు చేరేలా చూడటంలో ప్రధాని కార్యాలయం సహా అన్ని స్థాయిలలోని ప్రభుత్వ యంత్రాంగం నిర్విరామ కృషి చేస్తుంది.
సామాజిక దూరాన్ని మరువలేదు
లబ్దిదారులకు చేరాల్సిన నగదు సత్వరంగా వారీకి అందేందుకు గాను ఫిన్టెక్ మరియు డిజిటల్ సాంకేతికతను ఉపయోగించారు.
దీని కారణంగా లబ్దిదారుడు స్వయంగా బ్యాంకుకు వెళ్ళవలసిన అవసరం లేకుండా నేరుగా తన ఖాతాలోకి నగదు పొందగలిగాడు. ఇది ప్రస్తుత సమయంలో సామాజిక దూరం పాటించడానికి కూడా ఉపయోగపడింది.
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకిజీలో భాగంగా చేపట్టిన అనేక కర్యాక్రామలలో సాధించిన పురోగతి చూస్తే.
రైతన్నకు ముందస్తుగానే భరోసా
ఇప్పటి వరకు (5 మే 2020) 8.19కోట్ల మంది PM-KISAN లబ్దిదారులకు ఆర్ధిక సహాయంగా 16,394 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది.
మొదటి విడత సహాయం కింద 20.05 కోట్ల మహిళా జన్ ధన్ యోజనా ఖాతాదారుల ఖాతాలలో 10,025 కోట్లు జమ చేయబడ్డాయి. రెండవ విడత కింద 5.57 కోట్ల మహిళా జన్ ధన్ యోజనా ఖాతాదారుల ఖాతాలలో 2,785 కోట్లు రూపాయలు జయ చేసారు.
వృద్ధాప్య, వితంతు, వికలాంగ ఫించను క్రింద 2.812 కోట్ల లబ్దిదారుల ఖాతాలలో 1405 కోట్ల రూపాయలు జమకాబడ్డాయి.
2.20 కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులకు ఆర్ధిక సహాయం క్రింద 3492.57 కోట్ల రూపాయలు అందించడం జరిగింది.
Also Read: Innovations at MNNIT during Covid-19 Pandemic
ఆహార భద్రత మరువలేదు
ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల ద్వారా 67.65 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల సేకరణ జరిగింది.
2020 ఏప్రిల్ నెలలో 60.33 కోట్ల మంది లబ్దిదారులకు 30.16 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు సరఫరా చేయబడ్డాయి.
2020 మే మొదటి (5వ తేదీ వరకు) వారంలో 6.19 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు 12.39 కోట్ల మంది లబ్ది దారులకు అందించడం జరిగింది.
2.42 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాల వివిధ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు తరలించడం జరిగింది.
ఇప్పటి వరకు 19.4 కోట్ల లబ్దిదారుల కుటుంబాలకు గాను 5.21 కోట్ల కుటుంబాలకు పప్పు ధాన్యాల సరఫరా జరిగింది.
ఉజ్వలంగా వెలుగుతున్న వంట గ్యాసు
ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన కింద 5.09కోట్ల వంట గ్యాస్ సిలిండర్లకు బుకింగ్ అందగా వాటిలో 4.82కోట్ల సిలిండర్లు లబ్దిదారులకు అందించడం జరిగింది.
9.6 లక్షల మంది EPFO సభ్యులు తమ ఖాతాల నుండి ఆన్లైన్ ద్వారా 2985 కోట్ల రూపాయలు non-refundable advanceగా పొందారు.
44.97 లక్షల ఉద్యోగులకు 24% EPF చెల్లింపులకు గాను 698కోట్లు ఖర్చు పెట్టారు.
1 ఏప్రిల్ 2020 నుండి MGNREGA కింద అందించే వేతనాలు పెంచబడ్డాయి.
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో MGNREGA కింద 5.97కోట్ల పని దినాలను కల్పించడం జరిగింది.
ఇప్పటి వరకు చెల్లించవలసిన వేతనాలు మరియు ఇతర బకాయిలకు చెల్లించేందుకు 21,032 కోట్ల రూపాయలు రాష్ట్రాలకు విడుదల చేయబడ్డాయి.
న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కెంపెనీ ద్వారా ప్రభుత్వ వైద్యశాలలు మరియు ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే 22.12 లక్షల మంది హెల్త్ వర్కర్లకు భిమా పధకాన్ని ప్రారంభించారు.