Former Chief Justice of Bangladesh in money laundering case ఢాకా కోర్టు గురువారం బంగ్లాదేశ్ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.కె. సిన్హా మరియు మరో పది మందిపై అవినీతి నిరోధక కమిషన్ (ఎసిసి) మనీలాండరింగ్ కేసు దాఖలు చేసినది.
ఈ కేసు విచారణను ఆగస్టు 18న ప్రారంభించడానికి కోర్టు నిర్ణయించింది.
11 మంది నిందితుల్లో ముగ్గురు గురువారం విచారణ సందర్భంగా కోర్టుకు హాజరుకాగా, మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్.కె. సిన్హా మిగిలిన ఎనిమిది మంది పరారీలో ఉన్నారు.
2016 లో ఫార్మర్స్ బ్యాంక్ నుండి 4 కోట్ల టాకాను మోసపూరితమైన ఋణ లావాదేవీలు ద్వారా మనీలాండరింగ్ కో పాల్పడినట్లు జస్టిస్ సిన్హా మరియు ఇతరులపై ఎసిసి 2016 జూలైలో కేసు నమోదు చేసింది.
ఎసిసి గత ఏడాది డిసెంబర్లో ఢాకా కోర్టులో ఈ విషయమై Former Chief Justice of Bangladesh in money laundering case చార్జిషీట్ దాఖలు చేయగా ఈ ఫిబ్రవరిలో ఈ కేసు ప్రత్యేక న్యాయమూర్తి కోర్టుకు బదలాయించారు.
Also Read: Fake Railway Recruitment Notification
జస్టిస్ సిన్హా 2015లో బంగ్లాదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించడానికి పార్లమెంటుకు అధికారం ఇచ్చే చట్టాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వివాదాల మధ్య ఆయన రాజీనామా చేశారు.
పదవీ విరమణకు మూడు నెలల ముందు, అక్టోబర్ 2017లో ఆయన ఆస్ట్రేలియాకు వెళ్ళి తరువాత విదేశాల నుండే తన రాజీనామా పంపారు.
జస్టిస్ ఎస్.కె. సిన్హా తన ఆత్మకథలో బెదిరింపులు కారణంగా తాను చీఫ్ జస్టిస్ పదవి నుంచి తప్పుకున్నానని పేర్కొన్నారు. ఈ ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది.
అతను ప్రస్తుతం యుఎస్ లో ఉన్నాడు. అంతకుముందు కెనడాలో రాజకీయ ఆశ్రయం కోరారు.
జస్టిస్ ఎస్.కె. సిన్హా హిందూ సమాజానికి చెందిన బంగ్లాదేశ్ మొదటి మైనారిటీ ప్రధాన న్యాయమూర్తి.