Arunachal Pradesh School Children to Wear Khadi Face Masks

Arunachal Pradesh School Children to Wear Khadi Face Masks

Arunachal Pradesh School Children to Wear Khadi Face Masks

ఖాదీ మాస్కులతో పాఠశాలలకు అరుణాచల్ ప్రదేశ్ విద్యార్థులు

కొవిడ్ -19 తరువాత తొలిసారిగా అరుణాచల్ ప్రదేశ్ లో ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న పాఠశాలలకు వేలాది మంది విద్యార్థులు ఖాదితో చేసిన త్రివర్ణ ముఖ కవచాల (పేస్ మాస్క్)తో హాజరుకానున్నారు.

ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ ( KVIC ) వీటిని రూపొందించింది. మూడు రంగులతో నాణ్యమైన ఖాదితో వీటిని తయారు చేసి సరఫరా చేసింది KVIC.

అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఖాదీ ప్రాధాన్యతను మరోసారి రుజువు చేసింది. ఈశాన్య భారత దేశంలో ఉన్న ఒక రాష్ట్రం తన విద్యార్థుల కోసం ఇంత పెద్ద పరిమాణంలో ఫేస్ మాస్కులను కొనుగోలు చేయడం ఇదే తొలిసారి.

Join us on YouTube

ఈ నెల మూడవ తేదీన ప్రభుత్వం నుంచి KVICకి మాస్కుల సరఫరా కోసం ఆర్డర్ అందింది. దీని ప్రాధాన్యతను గుర్తించిన KVIC కేవలం ఆరు రోజులలో మాస్కులను సిద్ధం చేసింది. రవాణాలో ఎలాంటి జాప్యం లేకుండా చూడడానికి వీటిని విమానంలో పంపించడం జరిగింది.

త్రివర్ణంలో రెండు పొరలతో సిద్ధం చేసిన ఈ మాస్కులపై అరుణాచర్ ప్రదేశ్ ప్రభుత్వ అధికార ముద్రను కూడా పొందుపరిచారు.

ఈ మాస్కులు విధ్యార్థులకు రక్షణ ఇవ్వడంతోపాటు వారిలో జాతీయ భావాలను పెంపొందించే విధంగా రూపొందాయి. ఊపిరి పీల్చుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసి, 70 శాతం తేమని కలిగి ఉండే విధంగా రెండు పొరల ఖాదీ వస్త్రంతో KVIC ఈ మాస్కులను సిద్ధం చేసింది.

ఎక్కువ కాలం మన్నేఈ మాస్కులను ధరించడం వల్ల ఎలాంటి చర్మ సమస్యలు రావని, వీటిని సులువుగా ఉతుక్కోవచ్చునని KVIC తెలిపింది. ఇంతేకాకుండా ఇవి విసర్జించిన తరువాత భూమి పొరలలో సులువుగా కలసి పోతాయి.

ఈ నెల 16వ తేదీ నుంచి అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం 10 మరియు 12వ తరగతి క్లాసులను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ తరగతుల్లో చదువుతున్న విద్యార్థులకు రక్షణ కల్పించడానికి KVIC నుంచి మాస్కులను కొనుగోలు చేయాలని నిర్ణయించడం జరిగింది అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

Also Read : Nepal confers honorary rank on Army Chief Gen Naravane

అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందిన ఆర్డర్ కు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి మాస్కులను సిద్ధం చేశామని KVIC చైర్మన్ శ్రీ వినయ్ సక్సేనా తెలిపారు.

16 వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కావలసి ఉన్నందున యుద్ధప్రాతిపదికన వీటిని తయారుచేశామని తెలిపారు. ‘ కెవిఐసికి ఇది ఒక పెద్ద ఆర్డర్.

ఇలాంటి ఆర్డర్ల వల్ల ఖాదీ చేతివృత్తుల వారికి అదనపు ఉపాధి లభిస్తుంది. నాణ్యతలో రాజీ పడకుండా కేవలం ఆరు రోజులలో మాస్కులను సిద్ధం చేసి పంపించడంలో విజయం సాధించాము’ అని సక్సేనా వివరించారు.

ఈ ఏడాది ఏప్రిల్ లో కెవిఐసి మాస్కుల తయారీని ప్రారంభించింది. ఆరు నెలల కాలంలో కెవిఐసి 23 లక్షలకు పైగా మాస్కులను సరఫరా చేసింది.

నాణ్యతతోపాటు సులువుగా ధరించాడనికి కెవిఐసి మాస్కులు అనువుగా ఉండడంతో సంస్థకు భారీ ఆర్డర్లు వస్తున్నాయి.

ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ ఒకేసారి 12.30 లక్షల మాస్కులను కెవిఐసి నుంచి కొనుగోలు చేసింది.

రాష్ట్రపతి భవనం, ప్రధానమంత్రి కార్యాలయంలతో పాటు అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థల నుంచి కెవిఐసికి ఆర్డర్లు అందుతున్నాయి.

Join us on Telegram