Bois Locker Room Case: సామాజిక మాధ్యమంలో ఓ చీకటి గది
Bois Locker Room ఇది ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారిన ఒక ఉదంతం. పతనమౌతున్న సామాజిక విలువలకు ఈ ఉదంతం ఒక నిలువెత్తు నిదర్శనం.
దేశరాజధానిలో వెలుగుచూసిన ఈ ఉదంతంతో యువత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
యువత పెడదోవ పడడంలో సామాజిక మాధ్యమాల పాత్ర ఎంత తారాస్థాయికి చేరిందో నిరూపిస్తుంది ఈ Bois Locker Room ఉదంతం.
ఈ నేపధ్యంలో ఇద్దరు యువకుల మధ్య జరిగిన రహస్య సంభాషణల స్క్రీన్ షాట్స్ కొన్ని వైరల్ కావడంతో అసలు ఈ కధ వెలుగులోకి వచ్చింది.
ఆ సంభాషణలో ఏముంది?
మొదటి వ్యక్తి: మనం తలుచుకుంటే ఏమైనా చేయగలం. కావాలంటే మనం ఆ అమ్మాయిని మానభంగమైనా చేయవచ్చు.
రెండవ వ్యక్తి: అలా చేయడం తప్పు, మనం అలా చేయ కూడదు.
మొదటి వ్యక్తి: నేను నిజమే చెబుతున్నాను, మనం తలుచుకుంటే ఏమైనా చేయగలం.
రెండవ వ్యక్తి: చెప్పాను కదా అది తప్పు అని.
మొదటి వ్యక్తి: నువ్వే చెప్పు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, నాతోపాటు ఇంకా కొంత మంది అబ్బాయిలను కూడా తీసుకు వస్తా. అందరం కలిసి ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేద్దాం.
ఇది 16-18 ఏళ్ళ వయసు గల ఆ ఇద్దరు కుర్రాళ్ల మధ్య జరిగిన ఆ సంభాషణ సారాంసం.
ఈ సంభాషణ చూసినవారెవరైన అవాక్కవ్వక మానరు.
మొదటి వ్యక్తి చెప్పిన దానికి ససేమిరా అన్న రెండవ వ్యక్తి, వ్యక్తిగతంగా జరిగిన ఈ సంభాషణ మొత్తాన్ని తన ఫోన్లో స్క్రీన్ షాట్ రూపంలో భద్ర పరిచాడు.
దానిని మొదటి వ్యక్తి చెప్పిన ఆ అమ్మాయికి (ఆమెఇతడికి ముందునుండే స్నేహితురాలు) పంపి ఇలా తన మీద ఒక వ్యక్తి ఉన్మాదపు ఆలోచనలతో ఉన్నాడని జాగ్రత్త పడమని హెచ్చరించాడు.
ఇక్కడి దాకా కధ సాఫీగానే ఉంది, ఐతే ఇలాంటి సంభాషణతో భయపడిన ఆ రెండవ వ్యక్తి ఆ సంభాషణను ఆ ఆమ్మాయితో పాటు తన స్నేహితుడికి కూడా పంపాడు.
ఇక్కడే అసలు కధ మొదలైంది, ఆ స్నేహితుడు ఈ సంభషణను మరికొంత మంది స్నేహితులకు కూడా పంపాడు.
వారిలో ఒకరు దాన్ని సోషల్ మీడియాలో కూడా పెట్టడంతో అది కాస్తా వైరల్ అయింది.
దీంతో రంగంలోకి ఢిల్లీ పోలీసులతో దిగడంతో పాటు పాటు ఢిల్లి మహీళా కమీషన్ కూడా ఈ విషయంపై స్పందించి సుమోటోగా ఈ ఉదంతంపై విచారణ ప్రారంభించింది.
ఐతే పొలీసులు జరిపిన విచారణలో తేలిన నిజం తెలిస్తే అందరం ముక్కున వేలు వేసుకోవలసిందే. అసలు ఈ సంభాషణలో ఉన్న మొదటి వ్యక్తి మగ మనిషే కాదు.
ఆమే ఆడ మనిషి ఇంకా ఆశ్చర్యమేంటంటే, ఈ సంభషణలో ఏ అమ్మాయినైతే సామూహిక మానభంగం చేయాలని మొదటి వ్యక్తి పేర్కొన్నాడో ఆ యువతే సిద్ధార్ధ్ అనే మారు పేరుతో ఇలా చేసిందని తేలింది.
తన స్నేహితుడ్ని (సంభాషణలో రెండవ వ్యక్తి) పరీక్షంచేందుకే తాను ఇలా చేసానని చెప్పింది.
కానీ దాని పర్యవశానం ఇంత తీవ్రంగా ఉంటుందని తను ఊహించలేదని సదరు యువతి వాపోవడం కొస మెరుపు.
చదవండి: భారత జీ.డీ.పీ. పయనం ఎటువైపు?
ఇంతకీ ఇందులో Bois Locker Room కి ఏంటి సంబంధం? అసలు ఏంటీ ఈ Bois Locker Room?
Bois Locker Room ఇన్స్టాగ్రాంలో ఒక గ్రూప్. ఈ గ్రూప్ సభ్యులందరూ దేశ రాజధాని ఢిల్లీ లోని సంపన్న కుటుంబాలకు చెందిన 15-18 ఏళ్ళ వయసు గల యువకులే.
వీళ్ళందరూ కూడా దేశంలో పేరొందిన పాఠశాలలో చదువుకుంటున్న రేపటి పౌరులే.
అశ్లీలతే పరమావధిగా ఉంటాయి ఈ గ్రూప్ లో జరిగే కార్యకలాపాలు. తమ తోటి విద్యార్ధునులవే కాక అనేక మంది మహిళల అశ్లీల చిత్రాలు, వారి అందాల అశ్లీల వర్ణణ ఈ గ్రూప్లో నిత్యమూ జరిగే అంశాలు.
వెలుగు లోకి వచ్చిన ఆ వ్యక్తిగత సంభాషణ మూలాలు ఈ గ్రూప్ సభ్యులలో ఒకరి దగ్గర ప్రారంభమయ్యాయి.
ఆ స్రీన్ షాట్లు అందరికీ షేర్ చేసిన వ్యక్తి ఆ గ్రూప్లో సభ్యుడు కావడంతో అప్పటి వరకూ గుట్టు చప్పుడు కాకుండా ఉన్న bois locker room ఒక్క సారిగా వెలుగులోకి వచ్చింది.
ఐతే పొలీసుల విచారణలో ఆ గ్రూప్లో మానభంగం కానీ, సామూహిక అత్యాచారలకు సంబంధించి గానీ ఎటువంటి సంభాషణలు జరగనప్పటికీ, అశ్లీలత మాత్రం తారాస్థాయిలో ఉన్నట్లు తెలిసింది.
ఇప్పటికే ఈ గ్రూప్ అడ్మిన్ను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు మరో 22 మందిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. పెడదారి పడుతున్న యువత పోకడ ఇందులో స్పష్టమౌతుంది.
Join us on TELEGRAM