DRDO Developed Fire Detection and Suppression System (FDSS) for Passenger Buses
DRDO Developed Fire Detection and Suppression System (FDSS) for Passenger Buses the demonstration of which was witnessed by Defense Minister and Road Transport Ministers
రక్షా మంత్రి శ్రీ రాజ్ నాధ్ సింగ్ మరియు రోడ్డు రవాణా మంత్రి శ్రీ నితిన్ గడ్కరిల సమక్షంలో ప్రయాణీకుల బస్సుల కోసం DRDO అభివృద్ధి చేసిన ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ సిస్టమ్ (FDSS) ప్రదర్శన
ఈ రోజు 09 నవంబర్ 2020 న DRDO భవన్‌లో ప్రయాణీకుల బస్సుల కోసం DRDO అభివృద్ధి చేసిన ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ సిస్టమ్ (FDSS) ప్రదర్శనకు రక్షా మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ మరియు రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ సాక్ష్యమిచ్చారు.
ప్యాసింజర్ కంపార్ట్మెంట్ కోసం నీటి పొగమంచు ఆధారితమరియు ఇంజిన్ ఫైర్ కోసం ఏరోసోల్ బేస్డ్ FDSS ప్రదర్శించబడ్డాయి. వివిధ ఇతర కార్యక్రమాలు మరియు వ్యవస్థల గురించి కూడా వారికి వివరించబడింది.
ఢల్లీలోని DRDO యొక్క సెంటర్ ఫర్ ఫైర్ ఎక్సప్లోజన్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ (CFEES) ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది, ఇది ప్రయాణీకుల కంపార్ట్మెంట్లో 30 సెకన్లలోపు మంటలను గుర్తించగలదు మరియు తరువాత 60 సెకన్లలో దానిని అణిచివేస్తుంది, తద్వారా ప్రాణానికి మరియు ఆస్తికి వచ్చే ప్రమాదాన్ని గణనీయమైన స్థాయిలో తగ్గిస్తుంది.
ప్యాసింజర్ కంపార్ట్మెంట్ కోసం FDSSలో 80 లీటర్ సామర్థ్యం గల వాటర్ ట్యాంక్, 6.8 కిలోల నత్రజని సిలిండర్ బస్సులో 200 బార్‌కు పీడనంతో తగిన ప్రదేశంలో ఏర్పాటు చేయబడింది. ఇది సమర్ధవంతంగా పనిచేసేందుకు ప్యాసింజర్ కంపార్ట్‌మెంట్ లోపల 16 అటామైజర్‌ల పైప్ నెట్‌వర్క్ ఉంటుంది. ఇంజిన్ కోసం FDSS ఏరోసోల్ జెనరేటర్ను కలిగి ఉంటుంది, దీనితో సిస్టమ్ యాక్టివేషన్ జరిగిన 5 సెకన్లలో అగ్నిని అణిచివేస్తుంది.
ఫైర్ రిస్క్ అసెస్‌మెంట్, వేర్వేరు అగ్నిమాపక మాధ్యమాలను ఉపయోగించి అగ్ని అణచివేత, మోడలింగ్ మరియు అనుకరణ రంగాలలో CFEES కి ప్రత్యేకమైన సామర్థ్యం ఉంది. వారు యుద్ధ ట్యాంకులు, ఓడలు మరియు జలాంతర్గాముల కోసం ఇటువంటి వ్యవస్థను అభివృద్ధి చేశారు.
ప్రయాణీకుల బస్సుల్లో జరిగే అగ్ని ప్రమాదాలకు పరిష్కారాన్ని అందించడానికి డిఫెన్స్ స్పిన్-ఆఫ్ టెక్నాలజీగా క్రియాశీల అగ్ని రక్షణ వ్యవస్థను CFEES అభివృద్ధి చేసింది.
అన్ని వాహనాల్లో అగ్ని ప్రమాదం ఉన్నప్పటికీ, ప్రత్యేక వాహనాల నుండి ముఖ్యంగా పాఠశాల బస్సులు మరియు సుదూర ప్రయాణానికి స్లీపర్ కోచ్‌ల నుండి అత్యధిక స్ధాయిలో ప్రమాదలపై ఆందోళన తలెత్తుతుంది. ఇప్పటివరకు, అగ్ని భద్రత కోసం ఇంజిన్ ఫైర్ మాత్రమే నియంత్రించబడుతుంది.
రక్షా మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ శాస్త్రవేత్తల బృందం చేసిన వినూత్న సాధనను ప్రశంసించారు.
రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ బస్సు ప్రయాణీకుల భద్రత వైపు FDSS అభివృద్ధి చాలా ముఖ్యమైన దశ అని అభివర్ణించారు.
అగ్ని భద్రత DRDO దృష్టిని ఆకర్షించిందని, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం చాలా ముఖ్యం అని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
కార్యదర్శి డిడిఆర్ & డి & చైర్మన్ డిఆర్డిఓ డాక్టర్ జి సతీష్ రెడ్డి ఈ ప్రయత్నానికి డిఆర్డిఓ శాస్త్రవేత్తలను అభినందించారు.
Also Read : A K Gupta takes over as MD & CEO of ONGC Videsh