Grama Sachivalayam results to be released soon.. త్వరలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల ఫలితాలు విడుదల..!
Grama Sachivalayam results to be released soon.. త్వరలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల ఫలితాలు విడుదల..!
ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 16వేలకు పైగు గల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి.
ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియమానికి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాల్లో ఈసారి ర్యాంకులను కూడా వెల్లడించే అవకాశమున్నట్లు తెలుస్తుంది.
ఈ రాత పరీక్షలకు సంబంధించి వేర్వేరుగా అత్యధిక మార్కులు సాధించిన వారికి తొలి ర్యాంకు మొదలు చిట్టచివరి స్థానంలో మార్కులు తెచ్చుకున్న అభ్యర్థి వరకు ఈ ర్యాంకులను వెల్లడించవచ్చు.
జిల్లాల వారీగా రిజర్వేషన్లతో కూడిన ర్యాంకుల ఆధారంగానే ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫలితాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
Also Read: KVPY Fellowship 2020 ద్వారా డిగ్రీ సైన్స్ విద్యార్థులు నెలకు రూ.5 వేలు ఫెలోషిప్
19 కేటగిరీలలో మొత్తం 16,208 ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 14 రకాల రాత పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 10, 57,355 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో కేవలం 7,69,034 మంది హాజరయ్యారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా 11,162 గ్రామ సచివాలయాలు, 3786 వార్డు సచివాలయాలకుగాను గత ఏడాది 1,26,728 ఉద్యోగాలకు గాను, 1,10,520 పోస్టులు భర్తీ చేశారు. మిగిలిన 16,208 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో రాతపరీక్షలు నిర్వహించారు.
ఏపీ గ్రామ/వార్డు సచియవాలయ అధికారిక వెబ్సైట్ కోసం క్లిక్ చేయండి.