ఆంధ్రప్రదేశ్ 2021-22 బడ్జెట్ హైలైట్స్

ఆంధ్రప్రదేశ్ 2021-22 బడ్జెట్ హైలైట్స్

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ ఒకరోజు అసెంబ్లీ సమావేశంలో భాగంగా అసెంబ్లీలో గురువారం ఉద‌యం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

మొత్తం రాష్ట్ర బడ్జెట్‌ అంచనా రూ.2,29,779.27 కోట్లుగా తెలిపారు. ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు.

బీసీ ఉప ప్రణాళికకు రూ.28,237 కోట్లు, కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు, ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.17,403 కోట్లు, ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు రూ.6,131 కోట్లు బడ్జెట్‌లో వెచ్చించారు.

వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్ట‌నున్నారు. సభ ప్రారంభం కాగానే పలువురు మాజీ ఎమ్మెల్యేల మృతిపట్ల అసెంబ్లీ సంతాపం తెలిపింది.

బడ్జెట్‌ కేటాయింపులు ఇలా:


అంశముకేటాయించిన మొత్తము
బీసీ ఉప ప్రణాళికరూ.28,237 కోట్లు
ఎస్సీ ఉప ప్రణాళికరూ.17,403 కోట్లు
ఎస్టీ ఉప ప్రణాళికరూ.6,131 కోట్లు
కాపు సంక్షేమంరూ.3,306 కోట్లు
ఈబీసీ సంక్షేమంరూ.5,478 కోట్లు
బ్రాహ్మణ సంక్షేమంరూ.359 కోట్లు
మైనార్టీ యాక్షన్‌ ప్లాన్‌రూ.1,756 కోట్లు
చిన్నారుల కోసంరూ.16,748 కోట్లు
మహిళల అభివృద్ధిరూ.47,283.21 కోట్లు
వ్యవసాయ పథకాలురూ.11,210 కోట్లు
విద్యా పథకాలురూ.24,624 కోట్లు
వైద్యం, ఆరోగ్యంరూ.13,830 కోట్లు
వైఎస్సార్‌ పింఛన్‌ కానుకరూ.17 వేల కోట్లు
వైఎస్సార్‌ రైతు భరోసారూ.3,845 కోట్లు
జగనన్న విద్యా దీవెనరూ.2,500 కోట్లు
జగనన్న వసతి దీవెనరూ.2,223.15 కోట్లు
వైఎస్సార్‌-పీఎం ఫసల్‌ బీమారూ.1802 కోట్లు
డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ చెల్లింపులురూ.865 కోట్లు
పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలురూ.247 కోట్లు
రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులురూ.500 కోట్లు
వైఎస్సార్‌ కాపు నేస్తం కోసంరూ.500 కోట్లు
వైఎస్‌ఆర్‌ జగనన్న చేదోడు పథకానికిరూ.300 కోట్లు
వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర కోసంరూ.285 కోట్లు
వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం కోసంరూ.190 కోట్లు
వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కోసంరూ.120 కోట్లు
మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీ కోసంరూ.50 కోట్లు
అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపుల కోసంరూ.200 కోట్లు
రైతులకు ఎక్స్‌గ్రేషియా కోసంరూ.20 కోట్లు
లా నేస్తం కోసంరూ.16.64 కోట్లు
ఈబీసీ నేస్తం కోసంరూ.500 కోట్లు
వైఎస్‌ఆర్‌ ఆసరా కోసంరూ.6,337 కోట్లు
అమ్మఒడి పథకం కోసంరూ.6,107 కోట్లు
వైఎస్‌ఆర్‌ చేయూత కోసంరూ.4,455 కోట్లు
రైతు పథకాల కోసంరూ.11,210.80 కోట్లు

#APAssembly #APBudget2021