India Surpasses 1 Crore mark in Covid19 Vaccination

India Surpasses 1 Crore mark in Covid19 Vaccination

కోటి కోవిడ్ టీకాల మైలురాయి దాటిన భారత్
గత 24 గంటలలో ఒక్క కోవిడ్ మరణమూ

నమోదు కాని 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు

కోవిడ్ మీద పోరులో భారత్ మరో కీలకమైన మైలురాయి దాటింది. 2021 ఫిబ్రవరి 19వతేదీ ఉదయం 8 గంటలకల్లా దేశవ్యాప్తంగా అందించిన కోవిడ్ డోసులు కోటి దాటాయి. టీకాలు అందుకున్నవారిలో ఆరోగ్య సిబ్బందితోబాటు కోవిడ్ యోధులున్నారు. కోటి టీకాల మైలురాయి దాటటానికి భారత్ కు 34 రోజులు పట్టింది. ఈ వేగంలో భారత్ కు ప్రపంచంలో రెండో స్థానం దక్కినట్టయింది.  

మొత్తం2,11,462 శిబిరాల ద్వారా 1,01,88,007 టీకాల డోసుల పంపిణీ జరిగినట్టు ఉదయం 8 గంటలవరకు అందిన సమాచారం నిర్థారించింది.   వీరిలో  62,60,242 మంది మొదటి డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది,  6,10,899 మంది రెండో డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది ఉండగా 33,16,866 మంది మొదటి డోస్ అందుకున్న కోవిడ్ యోధులు. రెండవ డోస్ ఈ నెల 13 న ప్రారంభం కాగా మొదటి డోస్ వేయిమ్చుకొని 28 రోజులు పూర్తయిన వారందరూ దీనికి అర్హులు. కోవిడ్ యోధులకోసం మొదటి డోస్ ఫిబ్రవరి 2న మొదలైంది.

క్రమసంఖ్యరాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంటీకాల లబ్ధిదారులు
మొదటి డోస్రెండవ డోస్మొత్తం డోసులు
1అండమాన్, నికోబార్ దీవులు4,3474954,842
2ఆంధ్రప్రదేశ్3,86,77051,9964,38,766
3అరుణాచల్ ప్రదేశ్18,3592,94121,300
4ఆస్సాం1,38,7957,9531,46,748
5బీహార్5,06,68833,4195,40,107
6చండీగఢ్11,38142311,804
7చత్తీస్ గఢ్3,21,70614,4253,36,131
8దాద్రా, నాగర్ హవేలి4,4931144,607
9డామన్, డయ్యూ1,640941,734
10ఢిల్లీ2,49,79111,1882,60,979
11గోవా13,86235614,218
12గుజరాత్8,11,15228,0478,39,199
13హర్యానా2,03,76616,5002,20,266
14హిమాచల్ ప్రదేశ్90,90868,0311,58,939
15జమ్మూ, కశ్మీర్1,77,7953,7561,81,551
16జార్ఖండ్2,38,8528,5952,47,447
17కర్నాటక5,19,15863,5335,82,691
18కేరళ3,86,90123,9484,10,849
19లద్దాఖ్4,4362904,726
20లక్షదీవులు1,8091151,924
21మధ్యప్రదేశ్6,11,64006,11,640
22మహారాష్ట్ర8,14,68224,8848,39,566
23మణిపూర్35,83490136,735
24మేఘాలయ21,67460722,281
25మిజోరం13,7311,38415,115
26నాగాలాండ్18,3982,66121,059
27ఒడిశా4,29,21253,4014,82,613
28పుదుచ్చేరి7,6614548,115
29పంజాబ్1,16,1995,5751,21,774
30రాజస్థాన్7,47,42015,4937,62,913
31సిక్కిం10,14335710,500
32తమిళనాడు3,09,69220,1253,29,817
33తెలంగాణ2,79,83273,2813,53,113
34త్రిపుర79,0306,76685,796
35ఉత్తరప్రదేశ్10,52,43118,46410,70,895
36ఉత్తరాఖండ్1,26,4544,2461,30,700
37పశ్చిమ బెంగాల్5,83,61323,9226,07,535
38ఇతరములు2,26,85322,1592,49,012
 మొత్తం95,77,1086,10,8991,01,88,007

టీకాల కార్యక్రమం మొదలైన 34వ రోజైన ఫిబ్రవరి 18న మొత్తం  6,58,674  టీకా డోసులు ఇచ్చారు. అందులో 4,16,942 మంది లబ్ధిదారులకు 10,812 శిబిరాల ద్వారా మొదటి డోస్ ఇవ్వగా వారిలో ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు కూడా ఉన్నారు. 2,41,732మంది ఆరోహ్య సిబ్బంది రెండవ డోస్ టీకా అందుకున్నారు.  

రోజురోజుకూ దేశంలో కోవిడ్ టీకాలు తీసుకుంటున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. మొత్తం టీకాలు తీసుకున్న వారిలో 57.47% వాటా ఎనిమిది రాష్ట్రాలదే. ఉత్తరప్రదేశ్ లో అత్యధికంగా  10.5% వాటాతో  10,70,895 టీకా డోసులు పంపిణీ అయ్యాయి .

Join us on YouTube

రెండవ డోస్ టీకాలలో 60.85%  7 రాష్ట్రాలలో ఇవ్వగా 12% వాటాతో ( 73,281 మంది లబ్ధిదారులతో) అన్ని రాష్ట్రాలకంటే తెలంగాణ ముందంజలో ఉంది

PM addresses the Convocation Ceremony of Visva-Bharati University

గత 24 గంటలలో 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో  ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు.అవి: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, గోవా, జార్ఖండ్, మేఘాలయ, పుదుచ్చేరి, చండీగఢ్, మణిపూర్, మిజోరం, లక్షదీవులు, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్, త్రిపుర, అండమాన్, నికోబార్ దీవులు, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి.   15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 1-5 మధ్య మరణాలు నమోదు కాగా, మూడు రాష్ట్రాలలో 6-10 మధ్య మరణాలు సంభవించాయి.

భారతదేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య మరింతగా తగ్గుతూ ప్రస్తుతం 1,39,542 కి చేరింది.  ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 1.27% మాత్రమే.  ఇప్పటివరకు దేశమంతటా కోలుకున్న కోవిడ్ బాధితులు 1,06,67,741 మంది కాగా కోలుకున్నవారి శాతం 97.30%. గత 24 గంటలలో 10,896 మంది కోలుకున్నారు.   

కొత్తగా కోలుకున్నవారిలో 83.15% మంది ఆరు రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు.  కేరళలో అత్యధికంగా ఒక్క రోజులోనే 5,193 మంది కోలుకోగా మహారాష్ట్రలో 2,543 మంది, తమిళనాడులో 470 మంది కోలుకున్నారు.

గత 24 గంటలలో కొత్తగా 13,193 కోవిడ్ పాజిటివ్ కే సులు నమొదయ్యాయి. వాటిలో 86.6%  కేవలం ఆరు రాష్టాలవే కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 5,427 కేసులు, కేరళలో 4,584, తమిళనాడులో 457 నమోదయ్యాయి.

గత 24 గంటలలో 97 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. అందు లో 76.29% మరణాలు ఐదు రాష్ట్రాల్లోనే సంభవించాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 38 మంది, ఆ తరువాత కేరళలో 14 మంది, పంజాబ్ లో 10 మంది చనిపోయారు.