PM addresses the Convocation Ceremony of Visva-Bharati University

PM addresses the Convocation Ceremony of Visva-Bharati University. విశ్వ భారతి విశ్వవిద్యాలయం యొక్క కాన్వొకేషన్ వేడుకలో ప్రధాని ప్రసంగించారు

సృజనాత్మకత మరియు జ్ఞానానికి పరిమితి లేదు: ప్రధాని

ఠాగూర్ బెంగాల్ ను చూసి ఎంతగా గర్వపడ్డారో, భారతదేశం యొక్క వైవిధ్యాన్ని చూసి కూడా అంతే సమానంగా గర్వపడ్డారు: ప్రధాని

నేషన్-ఫస్ట్ అప్రోచ్ పరిష్కారాలకు దారితీస్తుంది: ప్రధాని

ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్ కు బెంగాల్ ప్రేరణ: ప్రధాని

ఆత్మనీర్భర్ భారత్ సాధనలో జాతీయ విద్యా విధానం ఒక ప్రధాన మైలురాయి: PM

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఈ రోజు విశ్వ-భారతి విశ్వవిద్యాలయం యొక్క కాన్వొకేషన్ వేడుకలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్, మరియు విశ్వ భారతి విశ్వవిద్యాలయ రెక్టర్ శ్రీ జగదీప్ ధంఖర్, కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, యూనియన్ మినిష్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎడ్యుకేషన్ శ్రీ సంజయ్ ధోత్రే పాల్గొన్నారు.

ప్రధాని ఈ సందర్భంగా ప్రసంగిస్తూ భారత ఐక్యతకై ఆయనకు స్ఫూర్తినిచ్చి వీర శివాజీపై గురుదైవ్ రవీంద్ర నాథ్ ఠాగూర్ పద్యం ఉటంకించారు. విద్యార్థులు మరియు అధ్యాపకులు విశ్వవిద్యాలయంలో ఒక భాగం మాత్రమే కాదు, శక్తివంతమైన సంప్రదాయాన్ని కలిగి ఉన్నారని కూడా పిఎం నొక్కి చెప్పారు. విశ్వ భారతిలో నేర్చుకోవటానికి వచ్చిన వారెవరైనా భారతదేశం మరియు భారతీయత కోణంలో ప్రపంచం మొత్తాన్ని చూస్తారని ఆశించిన గురుదేవ్ ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రపంచం అంతటివి విద్యాలయం అనే భావన వచ్చే విధంగా విశ్వ భారతి అని పేరు పెట్టారు. అందువల్ల విశ్వ భారతిని ఆయన గొప్ప ఆభ్యాస కేంద్రంగా మార్చాడు, ఇది భారతదేశ గొప్ప వారసత్వ సంపదలో చూడవచ్చు. భారతీయ వారసత్వం గురించి సంగ్రహించడం మరియు పరిశోధన చేయడం మరియు నిరుపేద ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయడం కోసం ఆయన పిలుపునిచ్చారు. గురుదేవ్ ఠాగూర్ దృష్టిలో విశ్వ భారతి కేవలం జ్ఞానాన్ని అందించే సంస్థ మాత్రమే కాదు, భారతీయ సంస్కృతి యొక్క అత్యున్నత లక్ష్యమైన ఆత్మ సాధనను చేరుకోవటానికి చేసిన ప్రయత్నం.

వైవిధ్యమైన భావజాలం మరియు భిన్నత్వాల మధ్య మనల్ని మనం కనుగొనవలసి ఉందని గురుదేవ్ నమ్ముతున్నారని ప్రధాని అన్నారు. ఠాగూర్ బెంగాల్ ను చూసి గర్వించేవారు, అదే సమయంలో, భారతదేశం యొక్క వైవిధ్యం చూసి కూడా అతను గర్వపడేవారు. గురుదేవుని దార్శనికత వల్లనే శాంతినికేతన వినీల ఆకాశంలో మానవత్వం వర్ధిల్లుతుంది. విశ్వ భారతిని తనలో అంతులేని జ్ఞాన సముద్రం అని ఆయన ప్రశంసించారు, అనుభవ-ఆధారిత విద్యకు పునాది వేసింది. సృజనాత్మకతకు, జ్ఞానానికి పరిమితి లేదని అన్నారు. ఈ ఆలోచనతోనే గురుదేవ్ ఈ గొప్ప విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. జ్ఞానం, ఆలోచన మరియు నైపుణ్యం స్థిరంగా ఉండవని, డైనమిక్ మరియు నిరంతర ప్రక్రియ అని విద్యార్థులను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని ప్రధాని కోరారు. జ్ఞానం, శక్తితో బాధ్యత వస్తుంది అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒకరితో సంయమనంతో, సున్నితంగా ఉండాల్సినట్లే, ప్రతి పండితుడు కూడా జ్ఞానం లేనివారి పట్ల బాధ్యత వహించాలి.

Join us on Telegram

ప్రధానమంత్రి, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మీ జ్ఞానం మీదే కాదు సమాజం మరియు దేశ వారసత్వం. మీ జ్ఞానం మరియు నైపుణ్యం ఒక దేశం గర్వించే విధంగా చేయగలవు లేదా సమాజాన్ని అపవాదు మరియు నాశనపు అంధకారంలోకి నెట్టగలవు. ప్రపంచవ్యాప్తంగా భీభత్సం మరియు హింసను వ్యాప్తి చేస్తున్న చాలా మంది ఉన్నత విద్యావంతులు, అత్యంత నైపుణ్యం గలవారు అని ఆయన అన్నారు. మరోవైపు, COVID వంటి మహమ్మారి నుండి ప్రజలను రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టి ఆసుపత్రులు మరియు ప్రయోగశాలలలో నిలబడిన వ్యక్తులు ఉన్నారు. ఇది సానుకూలంగా లేదా ప్రతికూలంగా ఉన్నా భావజాలం గురించి కాదు, మనస్తత్వం గురించి అన్నారు. రెండింటికీ స్కోప్ ఉంది మరియు రెండింటికీ మార్గాలు తెరిచి ఉన్నాయి. విద్యార్థులు సమస్యలో భాగం కావాలా లేదా పరిష్కారం కావాలో నిర్ణయించుకోవాలని ఆయన కోరారు. వారు దేశానికి మొదటి ప్రాధాన్యత ఇస్తే వారి ప్రతి నిర్ణయం కొంత పరిష్కారం వైపు పయనిస్తుందని ఆయన అన్నారు. నిర్ణయం తీసుకుంటే భయపడవద్దని విద్యార్థులకు సూచించారు. దేశ యువతకు నూతన ఆవిష్కరణలు, రిస్క్‌లు తీసుకొని ముందుకు సాగాలని అభిరుచి ఉన్నంతవరకు దేశ భవిష్యత్తు గురించి ఆందోళన చెందవద్దని అన్నారు. ఈ ప్రయత్నంలో యువతకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

సాంప్రదాయ భారతీయ విద్యావ్యవస్థ యొక్క చారిత్రక బలాన్ని గుర్తుచేస్తూ, గాంధేయవాది శ్రీ ధరంపాల్ యొక్క పుస్తకం ‘ది బ్యూటిఫుల్ ట్రీ- ఇండీజినస్ ఇండియన్ ఎడ్యుకేషన్ ఇన్ ఎయిటీన్త్ సెంచరి’ గురించి ప్రస్తావించారు. 1820 సర్వేలో ప్రతి గ్రామంలో ఒకటి కంటే ఎక్కువ గురుకులాలు ఉన్నాయని, ఇవి స్థానిక దేవాలయాలతో ముడిపడి ఉన్నాయని, అక్షరాస్యత రేటు చాలా ఎక్కువగా ఉందని అంచనా వేశారు. దీనిని బ్రిటిష్ పండితులు కూడా గుర్తించారు. శ్రీ మోడీ మాట్లాడుతూ, గురుదేవ్ రవీంద్రనాథ్ విశ్వ భారతిలో వ్యవస్థలను అభివృద్ధి చేశారు, ఇవి భారతీయ విద్యను ఆధునీకరించడానికి మరియు బానిసత్వ సంకెళ్ళ నుండి విముక్తి కలిగించే మాధ్యమం.

PM addresses India-Australia Circular Economy Hackathon (I-ACE)

 

అదేవిధంగా, కొత్త జాతీయ విద్యా విధానం కాలంచెల్లిన ఆంక్షలను విచ్ఛిన్నం చేస్తుంది మరియు విద్యార్థులు వారి పూర్తి సామర్థ్యాన్ని గ్రహించటానికి అనుమతిస్తుంది. ఇది విషయాల ఎంపిక మరియు మాధ్యమ బోధనలో వశ్యతను అనుమతిస్తుంది. ఈ విధానం వ్యవస్థాపకత మరియు స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తుంది; పరిశోధన మరియు ఆవిష్కరణ. ‘ఈ విద్యా విధానం ఆత్మనీర్భర్ భారత్ సాధనలో ఒక ప్రధాన మైలురాయి’ అని ప్రధాని అన్నారు. ఇటీవల పండితులకు లక్షలాది పత్రికలకు ప్రభుత్వం ఉచిత ప్రవేశం కల్పించినట్లు ప్రధాని తెలియజేశారు. ఈ సంవత్సరం బడ్జెట్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా పరిశోధన కోసం 5 సంవత్సరాలలో 50 వేల కోట్లు ప్రతిపాదించింది. ఈ విద్యా విధానం బాలికలకు కొత్త విశ్వాసాన్ని ఇచ్చే లింగ చేరిక నిధి(Gender Inclusion Fund) కోసం నిబంధనలు చేసింది. బాలికల అధిక డ్రాప్ రేటును లోతుగా అధ్యయనం చేశారు మరియు డిగ్రీ-కోర్సులలో ప్రవేశ-నిష్క్రమణ ఎంపికలు మరియు వార్షిక క్రెడిట్ కోసం ఏర్పాట్లు చేశారు.

ఏక్ భారత్-శ్రేష్త్ భారత్ కు బెంగాల్ ను స్ఫూర్తిగా పిలిచిన ప్రధాని, 21 వ శతాబ్దపు జ్ఞాన ఆర్థిక వ్యవస్థలో విశ్వ భారతి పెద్ద పాత్ర పోషిస్తుందని, భారత పరిజ్ఞానం మరియు గుర్తింపును ప్రపంచంలోని ప్రతి మూలకు తీసుకెళ్తుందని అన్నారు. 2047 నాటికి సాధించేవిగా విశ్వ భారతి యొక్క 25 అతిపెద్ద లక్ష్యాల గుర్తించి వచ్చే 25 సంవత్సరాలకు ఒక దార్శనిక పత్రాన్ని సిద్ధం చేయాలని శ్రీ మోడీ ఈ ప్రతిష్టాత్మక సంస్థ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం గురించి అవగాహన కల్పించాలని ప్రధాని విద్యార్థులను కోరారు. విశ్వ భారతి అన్ని విద్యా సంస్థలకు భారతదేశ సందేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క ప్రతిష్ఠను పెంచడానికి నాయకత్వం వహించాలని కోరారు. సమీప గ్రామాలను ఆత్మనిర్భరంగా మార్చడానికి మార్గాలను కనుగొనాలని, వారి ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలని ప్రధాని పిలుపునిచ్చారు.