Kerala, Maharashtra, Punjab, Chhattisgarh & MP witnesses an upsurge in Daily New Cases

Kerala, Maharashtra, Punjab, Chhattisgarh & MP witnesses an upsurge in Daily New Cases

 

కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పెరిగిన కరోనా కేసులు
ఇప్పటిదాకా 1.07 కోట్ల కోవిడ్ టీకా డోసులు

 

గత 24 గంటల్లో 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్ మరణాలు సున్నా

భారతదేశంలో ఇప్పటిదాకా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసులలో 1.30% మంది ప్రస్తుతం చికిత్సలో ఉన్నారు.  ప్రస్తుతం ఇంకా చికిత్సపొందుతూ ఉన్నవారి సంఖ్య 1,43,127 కు చేరింది. కొన్ని రాష్టాలలో కొత్తగా పాజిటివ్ కేసులు రావటం పెరుగుతోంది. కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, చత్తీస్ గఢ్ , మధ్యప్రదేశ్ రాష్టాలలో ఈ పెరుగుదల నమోదైంది. అన్నిటికంటే ఎక్కువగా కేరళలో నమోదవుతున్నాయి.  

గత వారం రోజుల్లో చత్తీస్ గఢ్ లో చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత 24 గంటల్లో 259 కొత్త కరోనా కేసులు వచ్చాయి. 

గతవారంలో మహారాష్ట్రలో కొత్త కేసుల పెరుగుదల స్పష్టంగా కనబడింది. ఈ రోజు దేశంలోనే అత్యధికంగా కొత్త కేసులు వచ్చిన రాష్ట్రంగా నిలిచింది.  . గత 24 గంటలలో  6,112 కొత్త కెసులు నమోదయ్యాయి.

మహారాష్ట్ర తరహాలోనే పంజాబ్ కూడా గత వారం రోజుల్లో అకస్మాత్తుగా కొత్త కేసుల నమోదులో పెరుగుదల చూపింది.  గడిచిన 24 గంటల్లో  383 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

2021 ఫిబ్రవరి 13 నుంచి మధ్యప్రదేశ్ లో కూడా కొత్త కేసులు పెరుగుతూ వస్తున్నాయి. గత 24 గంటలలో 297 కొత్త కేసులు నమోదయ్యాయి.

అనేక రాష్టాలలో మళ్లీ కరోనా విజృంభిస్తుండటంతో కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని, వ్యాధి వ్యాప్తిని సమర్థంగా నియంత్రించాలని ప్రభుత్వం పునరుద్ఘాటించింది.  

అయితే, మెరుగైన ఆరోగ్య మౌలిక సదుపాయాలు, పరీక్షించటం, ఆనవాలు పట్టుకొవటం, చికిత్స అందించటం అనే వ్యూహాన్నే కొనసాగిస్తూ ఇప్పటివరకు 21 కోట్లకు పైగా (21,02,61,480) పరీక్షలు దేసవ్యాప్తంగా చేపట్టారు. జాతీయ స్థాయిలొ పాజిటివ్ శాతం గత 13 రోజులుగా  క్రమంగా తగ్గుతూనే వచ్చింది.  ప్రస్తుతం అది 5.22%గా నమోదైంది..            

ఇప్పటివరకు మొత్తం 2,22,313 శిబిరాల ద్వారా 1,07,15,204 మందికి తీకా డోసులు ఇచ్చినట్టు ఈ ఉదయం 8 గంటలవరకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. వీరిలో 63,28,479 మంది మొదటి డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది ఉండగా  8,47,161 మంది రెండో డీఓస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది, మంది మొదటి డోస్ అందుకున్న కోవిడ్ యోధులు ఉన్నారు. 

Join us on Telegram

కోవిడ్ రెండో డోస్ టీకాల  కార్యక్రమం ఫిబ్రవరి 13న మొదలైంది. మొదటి డోస్  తీసుకొని 28 రోజులు పూర్తయినవారికి రెండో డోస్ ఇస్తున్నారు. కోవిడ్ యోధులకు టీకాలివ్వటం ఫిబ్రవరి 2న మొదలైంది.

క్రమసంఖ్య  రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతంటీకాల లబ్ధిదారులు
మొదటి డోస్రెండో డోస్మొత్తం డోస్ లు
1అండమాన్, నికోబార్ దీవులు4,4538955,348
2ఆంధ్రప్రదేశ్3,98,10871,7074,69,815
3అరుణాచల్ ప్రదేశ్19,6083,95123,559
4ఆస్సాం1,47,36810,1641,57,532
5బీహార్5,15,36335,0705,50,433
6చండీగఢ్12,10054712,647
7చత్తీస్ గఢ్3,30,44616,1043,46,550
8దాద్రా-నాగర్ హవేలి4,8011694,970
9డామన్-డయ్యూ1,6721531,825
10ఢిల్లీ2,72,32212,9782,85,300
11గోవా14,38663415,020
12గుజరాత్8,19,06037,5978,56,657
13హర్యానా2,05,61621,0932,26,709
14హిమాచల్ ప్రదేశ్92,70271,3221,64,024
15జమ్మూ-కశ్మీర్1,89,8405,2821,95,122
16జార్ఖండ్2,46,21310,5222,56,735
17కర్నాటక5,29,96899,4526,29,420
18కేరళ3,92,99332,0604,25,053
19లద్దాఖ్5,0053585,363
20లక్షదీవులు1,8091151,924
21మధ్యప్రదేశ్6,26,39106,26,391
22మహారాష్ట్ర8,31,92128,4658,60,386
23మణిపూర్38,5851,43440,019
24మేఘాలయ22,28561622,901
25మిజోరం14,4282,20616,634
26నాగాలాండ్20,6033,41924,022
27ఒడిశా4,33,58468,1295,01,713
28పుదుచ్చేరి8,4816459,126
29పంజాబ్1,20,0159,4551,29,470
30రాజస్థాన్7,80,66519,0547,99,719
31సిక్కిం11,10269811,800
32తమిళనాడు3,24,53725,7463,50,283
33తెలంగాణ2,80,27786,0513,66,328
34త్రిపుర81,04211,13492,176
35ఉత్తరప్రదేశ్10,66,29085,75211,52,042
36ఉత్తరాఖండ్1,29,2216,2311,35,452
37పశ్చిమ బెంగాల్6,09,98740,9896,50,976
38ఇతరములు2,64,79626,9642,91,760
                                         మొత్తం98,68,0438,47,1611,07,15,204

టీకాల కార్యక్రమం మొదలైన 35వ రోజైన ఫిబ్రవరి20న ఉదయానికి 5,27,197 టీకా డోసులు ఇచ్చారు. అందులో . 2,90,935 మంది లబ్ధిదారులు 10,851 శిబిరాల ద్వారా మొదటి డోస్ టీకాలు అందుకున్నారు.   2,36,262 మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ అందుకున్నారు.  

9 రాష్ట్రాలలో 5 లక్షలకు పైగా డోసులు ఇచ్చారు. అవి ఉత్తరప్రదేశ్ (11,52,042), మహారాష్ట్ర (8,60,386), గుజరాత్ (8,56,657), రాజస్థాన్ (7,99,719), పశ్చిమబెంగాల్ (6,50,976), కర్నాటక (6,29,420), మధ్యప్రదేశ్ (6,26,391), బీహార్ (5,50,433) ఒడిశా (5,01,713).

ఇప్పటిదాకా 1,06,67,741 మంది కోవిడ్ బారినుంచి బైటపడ్దారు. గత 24 గంటలలో  10,307 మంది కోలుకున్నారు. దేసవ్యాప్తంగా కోలుకున్నవారి శాతం  97.27% కాగా ప్రపంచంలో అత్యధిక శాతాల్లో ఇది ఒకటి. కొత్తగా కోలుకున్నవారిలో  80.51% మంది కేవలం ఆరు రాష్టాల్లోనే ఉన్నారు. కేరళలో అత్యధికంగా ఒక్క రోజులో  4,854 మంది కోలుకోగా, మహారాష్ట్రలో 2,159 మంది, తమిళనాడులో  467 మంది కోలుకున్నారు.

కొత్తగా కోవిడ్ పాజిటివ్ నమోదైన వారిలో 86.69% మంది ఆరు రాష్టాలకు చెందినవారే. అత్యధిక కొత్త కేసులలో మహారాష్ట్ర తన మొదటి స్థానాన్ని కొనసాగిస్తోంది. అక్కడ 6,112 కేసులు నమోదు కాగా కేరళలో 4,505, తమిళనాడులో 448 కేసులు వచ్చాయి. కేవలం కేరళ, మహారాష్ట్రకు కలిసి 75.87%  చికిత్సలో ఉన్న కేసుల్లో వాటా ఉంది.

గత 24 గంటలలో 18 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలొ ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి: తెలంగాణ, హర్యానా, జమ్మ-కశ్మీర్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, అస్సాం, చండీగఢ్, లక్షదీవులు, మణిపూర్, మేఘాలయ, లద్దాఖ్, మిజోరం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్-నికోబార్ దీవులు, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి.  

గత 24 గంటలలో 101 మరణాలు నమోదయ్యాయి. అందులో 78.22% కేవలం 5 రాష్ట్రాల్లో సంభవించాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 44 మంది చనిపోగా కేరళలో 15, పంజాబ్ లో 8 మరణాలు నమోదయ్యాయి.

GST compensation shortfall released to States reaches Rs. 1 lakh crore

One thought on “Kerala, Maharashtra, Punjab, Chhattisgarh & MP witnesses an upsurge in Daily New Cases”

Comments are closed.