KVPY Fellowship 2020 ద్వారా డిగ్రీ సైన్స్‌ విద్యార్థులు నెలకు రూ.5 వేలు ఫెలోషిప్‌‌

KVPY Fellowship 2020 ద్వారా డిగ్రీ సైన్స్‌ విద్యార్థులు నెలకు రూ.5 వేలు ఫెలోషిప్‌‌

KVPY Fellowship 2020

KVPY Fellowship 2020 ద్వారా డిగ్రీ సైన్స్‌ విద్యార్థులు నెలకు రూ.5 వేలు ఫెలోషిప్‌‌ కోసం ఇదివరకే విడుదలైన నొటిఫికేషన్ దరఖాస్తు చివరి తేదీని ఇటీవల పొడగించారు.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) బెంగళూరు కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (KVPY) ద్వారా డిగ్రీ సైన్స్‌ విద్యార్థులకు నెలకు రూ.5 వేలు స్కాలర్‌షిప్‌ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తరఫున ఈ ఫెలోషిప్ అందిస్తారు.

ఆసక్తి గల విద్యార్థులు ఈ KVPY Fellowship 2020 కోసం http://kvpy.iisc.ernet.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. గతంలో ప్రకటించిన దరఖాస్తు గడువును తాజాగా పొడిగించారు. తాజా షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 30 దరఖాస్తుకు చివరి తేది.

విద్యార్థులు దరఖాస్తు చేసేముందు http://kvpy.iisc.ernet.in/ వెబ్‌సైట్‌లో ఈ ఫెలోషిప్‌కు సంబంధించిన ప్రకటన పూర్తిగా చదివి తమకు తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకుని ఆ తరువాత దరఖాస్తు చేసుకోవాలి.

విద్యార్ధులు తమ పేరు చిరునామా మొదలైన వివరాలన్నిటితో పాటు ఫోటోను జత చేస్తు తమ దరఖాస్తులు ఆన్‌లైన్‌లో పూర్తి చేయాలి. ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లింపు కూడా చేయాల్సి ఉంటుంది.

Click for Daily Current Affairs Quiz

ముఖ్య సమాచారం:

అర్హత:

ఇంటర్‌ ఉత్తీర్ణులై, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, బ్యాచిలర్ ఆఫ్ మ్యాథ్స్‌తో పాటు ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్ లాంటి కోర్సుల్లో మొదటి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక:

జాతీయ స్థాయిలో జరిగే ఆన్‌లైన్ యాప్టిట్యూట్ టెస్ట్‌లో వచ్చిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ యాప్టిట్యూడ్ టెస్ట్ 2021 జనవరి 31న ఉంటుంది.

పరీక్షా కేంద్రాలు:

కర్నూల్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో ఎగ్జామ్‌ సెంటర్లు ఉంటాయి.

స్కాలర్‌షిప్‌:

డిగ్రీ విద్యార్థులకు నెలకు రూ.5,000. పీజీ విద్యార్థులకు రూ.7,000 చొప్పున ఫెలోషిప్‌తో పాటు ఏడాదికోసారి కంటింజెన్సీ గ్రాంట్‌ లభిస్తుంది. శాస్త్ర సాంకేతిక రంగంలో పరిశోధనలు చేసేవారికి ఈ ఫెలోషిప్స్ లభిస్తాయి.

దరఖాస్తు ఫీజు:

దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1250. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.625.

 

వెబ్‌సైట్‌:

KVPY అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోటిఫికేషన్‌:

పూర్తి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి

 

Click here to Join us on Telegram