LG Polymers Vizag Gas Leakage: A tragedy

vizag-gas-leak

LG Polymers Vizag Gas Leakage

మే 7 2020 వేకువజామున సుమారు 3.30 గంటల ప్రాంతాలో దేశమంతా గాఢ నిద్రలో ఉన్న వేళ విశాఖజిల్లాలోని గోపాలపట్నం వద్ద గల LG Polymers Vizag Gas Leakage నుండి వెలువడిన స్టైరీన్ అనే విషవాయువు చుట్టు పక్కల 3 కిలోమీటర్ల విస్థీర్ణంలో గల 5 ఊళ్ళలో ఉన్న ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేసింది.

ప్రమాదం వేకువజామున జరగడంతో అందరూ గాఢ నిద్రలో ఉండటంతో ప్రమాదం తీవ్రత మరింత దారుణంగా మారింది.

ఎటు చూసినా హృదయవీదారక ఘటనలు. స్పృహలేకుండా రోడ్లపైన నస్చేష్టులుగా పడిఉన్న వారే అన్ని వైపులా కనిపిస్తున్నారు. ఎన్నో మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి.

గత 45 రోజులుగా లాక్డౌన్ కారణంగా మూతబడ్డ ఫాక్టరీని ప్రభుత్వం సడలింపులు ప్రకటించిన నేపధ్యంలో పునః ప్రారంభించే క్రమంలో ఈ విపత్తు సంభవించింది.

ఈ ఘటనలో కొందరు ప్రాణాలు కోల్పోగా కనీసం 1000 మంది అస్వస్థతకు గురైనారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు

ఇది ప్రస్తుతం విస్తరించిన  కోవిడ్-19 మహమ్మారిని మించిన విపత్తుగా కొందరు అభివర్ణిస్తున్నారు

ఈ ఉదంతం విన్న ప్రతి ఒక్కరికి భోపాల్ సంఘటన గుర్తురాక మానదు.

1984లో భోపాల్లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ అనే ఒక క్రిమిసంహార రసాయనాల తయారీ కేంద్రంలో 1984 డిసెంబరు 2వ తేదీ రాత్రి 10.00 గంటల ప్రాంతంలో చిన్నగా లోపం తలెత్తింది.

ఫాక్టరీ సిబ్బంది సరైన సమయంలో స్పందించక పోవడంతో అదే రాత్రి 1గంట (తేదీ డిసెంబరు 3కి మారింది) సమయానికి ఆ లోపం భోపాల్ ప్రజలను మిధైల్ ఐసోసైనేట్ (MIC) అనే భయంకర విషవాయువు రూపంలో కబళించి వేసింది.

అది భొపాల్ చరిత్రలో మరచిపోలేని ఒక కాలరాత్రిగా మిగిలి పోయింది.

సరిగ్గా అలాంటి సంఘటనే ఇప్పుడు విశాఖలో కూడా జరిగింది. విశాఖ జిల్లాలోని గోపాలపట్నం దగ్గర ఉన్ LG Polymers అనే సంస్ధలో లాక్డౌన్ కారణంగా గత 45రోజులుగా ఎటువంటి ఉత్పత్తి పనులు జరుగడంలేదు.

ఐతే ఇటీవల ప్రభువత్వ సడలింపులు ప్రకటించడంతో ఉత్పత్తి కార్యకలాపాలు తిరిగి ప్రారంభించే క్రమంలో అనూహ్యంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

ఈ LG Polymers Vizag Gas Leakage ఉదంతం యావత్ భారత దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

చదవండి: ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ

అసలు స్టైరీన్ అంటే ఏంటి దీని వల్ల జరిగే నష్టం ఏంటి

విశాఖ నగరంలోని గోపాలపట్నం పరిధిలో గల ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలో 1997లో ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీని నెలకొల్పారు. దాదాపు 213 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కంపెనీలో రోజూ 417 టన్నుల పాలిస్టిరిన్‌ ఉత్పత్తి జరుగుతుంది.

LG Polymers Vizag Gas Leakage లో విడుదలైన స్టైరీన్ గురించి తెలుసుకుందాం.

అయితే స్టైరీన్‌ అనే గ్యాస్‌ను ముడిసరకుగా పాలిస్టిరిన్‌ను తయారు చేస్తారు. ఈ గ్యాస్‌ను పీల్చడం వల్ల తలనొప్పి, వినికిడి సమస్య, నీరసం, కళ్లు మంటలు వంటివి ప్రథమంగా కనిపిస్తాయి.

ఒకవేళ ఎవరైనా ఈ గ్యాస్‌ అధిక మోతాదులో పీలిస్తే క్యాన్సర్‌, కిడ్నీ సమస్యలతోపాటు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది.

అయితే ఈ ప్రమాదానికి గురైన వ్యక్తిని వెంటనే ప్రమాదస్థలి నుంచి వేరే ప్రాంతానికి తీసుకువెళ్లాలి. శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు తలెత్తితే సదరు వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సను అందించాలి.

గతంలో కూడా ఎల్‌జీ పాలిమర్స్‌లో ఇలాంటి ప్రమాదమే చోటుచేసుకున్నప్పటికీ సదరు కంపెనీ అప్రమత్తం కావడంతో అప్పటికప్పుడు ఆ ప్రమాదాన్ని అరికట్టింది.

లాక్‌డౌన్‌ కారణంగా 45 రోజుల నుంచి పరిశ్రమలో ఎలాంటి పనులు జరగకపోవడంతో స్టైరిన్‌ను నిల్వ ఉంచే చోట ఒత్తిడి పెరిగి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

గాలితో పోల్చినపుడు ఈ వాయువు భారమైనది కావడం వల్ల దీని ప్రభావం తక్కువ ఎత్తు గల వారిపై ముఖ్యంగా పిల్లలపై తీవ్రంగా ఉంటుంది.

సాధారణంగా ఈ వాయువు తీపి వాసన వచ్చినప్పటికి, అధిక మొతాదులో ఉన్నపుడు మాత్రం ఘాటుగా ఉంటుంది దీని వాసన.

దీని ప్రభావం అరకిలోమీటరు మేర తీవ్రంగా ఉంటుంది. 3 కిలోమిటర్ల పరిధిలో ఉన్నవారిని అస్వస్థతకు గురిచేస్తుంది.

ఈ వాయువును పీల్చడం వల్ల ముక్కు, గొంతు దురదపెట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవడం జరుగుతుంది.

అధిక మొతాదు ఈ వాయవు పీల్చడం ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది.

టెలిగ్రాం ద్వారా మా అప్డేట్స్ పొందండి