National Mission for Sustainable Agriculture(NMSA)

National Mission for Sustainable Agriculture(NMSA) సుస్థిర వ్యవసాయానికై జాతీయ మిషన్

వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పేర్కొన్న ఎనిమిది మిషన్లలో ఒకటిగా National Mission for Sustainable Agriculture (NMSA) చేపట్టడం జరిగింది.

వాతావరణ మార్పులకు అనుగుణంగా చర్యలు చేపట్టడం ద్వారా సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే NMSA ముఖ్య లక్ష్యం.

సమీకృత వ్యవసాయం, నేల సాగు యోగ్యత నిర్వహణ మరియు వనరుల పరిరక్షణపై దృష్టి సారిస్తూ వర్షాధార ప్రాంతాలలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం.

సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (Sustainable Development Goals) మరియు INDCలో పేర్కొన్న వర్షాధార వ్యవసాయం, సాయిల్ హెల్త్ మేనేజ్‌మెంట్, సేంద్రీయ సేద్యం మొదలైన అంశాలన్ని సాధించడంలో NMSA ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

నేల మరియు తేమ పరిరక్షణ చర్యలు, సమగ్ర సాయిల్ హెల్త్ మానేజ్మెంట్ మరియు వర్షాధార వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని మరింత ఉత్పాదక, స్థిరమైన, లాభదాయక మరియు వాతావరణ స్థితిస్థాపకంగా మార్చడం National Mission for Sustainable Agriculture కార్యాచరణలో భాగం.

చదవండి: Bharat Ratna Awards Complete Information

NATIONAL MISSION FOR SUSTAINABLE AGRICULTURE

ఈ కింది పథకాలు NMSAలో భాగాలు

  • రెయిన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ (RAD): రెయిన్ఫెడ్ ఏరియా డెవలెప్మెంట్ (RAD) కార్యక్రమాన్ని NMSA యెక్క Rainfed Farming System (RFS) డివిజన్ అమలు చేస్తోంది.
  • సబ్ మిషన్ ఆన్ అగ్రో ఫారెస్ట్రీ (SMAF): సబ్ మిషన్ ఆన్ అగ్రో ఫారెస్ట్రీ SMAF ను Natural Resource Management (NRM) డివిజన్ అమలు చేస్తోంది
  • పరంపరాగత్ కృషి వికాస్ యోజన (PKYV): PKYV పధకాన్ని Ingegrated Nutrient Management (INM) డివిజన్ అమలు చేస్తోంది
  • భారతీయ నేల మరియు భూ వినియోగ సర్వే (Soil and Land Usage Survey of India – SLUSI): ఈ పధకాన్ని INM డివిజన్ అమలు చేస్తోంది
  • నేషనల్ రెయిన్‌ఫెడ్ ఏరియా అథారిటీ (NRAA): నేషనల్ రెయిన్‌ఫెడ్ ఏరియా అథారిటీ RFS డివిజన్ అమలు చేస్తోంది
  • Mission Organic Value Chain Development in North Eastern Region (MOVCDNER): ఈ పధకాన్ని INM డివిజన్ అమలు చేస్తోంది
  • నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ (NCOF): దీనిని INM డివిజన్ అమలు చేస్తోంది
  • సెంట్రల్ ఫెర్టిలైజర్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (CFQC&TI): ఈ కార్యక్రమాన్ని INM డివిజన్ అమలు చేస్తోంది

Join us on Telegram