National Mission for Sustaining the Himalayan Ecosystem

National Mission for Sustaining the Himalayan Ecosystem హిమాలయ పర్యావరణ వ్యవస్థను కాపాడేందుకు జాతీయ మిషన్:

National Mission for Sustaining the Himalayan Ecosystem హిమాలయ హిమానీనదం మరియు పర్వత పర్యావరణ వ్యవస్థను కాపాడేందుకు మరియు నిర్వహణ చర్యలను రూపొందించడానికి ప్రారంభించబడింది.

2008 లో ప్రారంభించిన National Action Plan for Climate Change లో భాగంగా ప్రారంభించిన 8 మిషన్లలో ఇది ఒకటి.

హిమాలయాలు, కీలకమైన జీవనదులకు మూలంగా ఉన్నందున, హిమాలయ హిమానీనదాలు తిరోగమనంలో ఉన్నాయో లేదో, ఉంటే సమస్యను ఎలా పరిష్కరించవచ్చో అధ్యయనం చేసేందుకు ఈ మిషన్ ఉపకరిస్తుంది.

దీనికి వాతావరణ శాస్త్రవేత్తలు, హిమానీన శాస్త్రవేత్తలు మరియు ఇతర నిపుణుల ఉమ్మడి ప్రయత్నం అవసరం.

అంతే కాక దక్షిణ ఆసియా దేశాలు మరియు హిమాలయ పర్యావరణ విస్థీర్ణాన్ని పంచుకునే ఇతర దేశాలతో సమాచారాన్ని అనుసంధానం చేసుకోవాలి.

ఈ మిషన్ లో భాగంగా మంచినీటి వనరులు మరియు పర్యావరణ వ్యవస్థ యొక్క స్థితిగతులను అంచనా వేయడానికి హిమాలయ పర్యావరణం కోసం ఒక పరిశీలనాత్మక మరియు పర్యవేక్షణ వ్యవస్త ఏర్పాటు చేయబడుతుంది.

ఈ వ్యవస్థ దాని పరిధిలో సమగ్రంగా చేయడానికి హిమాలయాలను పంచుకునే పొరుగు దేశాల సహకారం కోరబడుతుంది.

చదవండి: National Water Mission – జాతీయ నీటి మిషన్

National Mission for Sustaining Himalayan EcoSystem

హిమాలయ పర్యావరణ వ్యవస్థలో 51 మిలియన్ల మంది ఉన్నారు వారు పర్వతశ్రేణి వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు, వాతావరణ మార్పుల కారణంగా వారి దుర్బలత్వం పెరుగనుంది.

ఈ మిషన్ ద్వారా సమాజ ఆధారిత నిర్వహణతో పర్యావరణ వ్యవస్థలోని అటవీ భూముల రక్షణ మరియు మెరుగుదల కొరకు సామాజిక సంస్థలు మరియు పంచాయతీలు ప్రోత్సహించబడుతాయి.

పర్వత ప్రాంతాలలో, కోత మరియు భూమి క్షీణతను నివారించడానికి మరియు సున్నితమైన పర్యావరణ వ్యవస్థ యొక్క స్థిరత్వానికై పర్వత పరిధిలో మూడింట రెండు వంతుల ప్రాంతాన్ని అటవీ ప్రాంతాలుగా కొనసాగించడం దీని లక్ష్యం.

హిమాలయ పర్యావరణ వ్యవస్థ భారత భూభాగం యొక్క పర్యావరణ భద్రతకు చాలా ముఖ్యమైనది.

అటవీ విస్తీర్ణాన్ని అందించడమే కాక, తాగునీరు, నీటిపారుదల మరియు హైడ్రోపవరుకు మూలంగా ఉండే జీవనదులకు ఆధారం హిమాలయాలు.

జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం, వ్యవసాయానికి ఊతమందించుట మరియు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు ద్వారా స్థిరమైన పర్యాటకం హిమాలయ పర్వశ్రేణులు మన దేశానికి అందించే వరాలు.

అయితే పెరిగుతున్న ఉష్ణోగ్రతలు, అవపాత సరళిలో మార్పులు మరియు కరువు సంఘటనలు వల్ల వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు హిమాలయ పర్యావరణ వ్యవస్థపై ప్రతికూలంగా ప్రభావం చూపుతున్నవి.

Join us on Telegram

ప్రపంచంలోని ఇతర హిమనీనదాలు వలే హిమాలయ హిమానీనదాలు సైతం గణనీయంగా మంచును కోల్పోనున్నవి.

ఎక్కువగా హిమాలయాల నుండి కరిగే మంచు ద్వారా ప్రవహించే ఉత్తర భారత నదీ ప్రవాహాలు, వర్షాభావం తక్కువగా ఉండే కాలంలో ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

హిమానీనద ద్రవ్యరాశిలో మార్పుపై భారతదేశంలోని పలు శాస్త్రీయ సంస్థలు జరిపిన అధ్యయనాలు ఆ మార్పు ఎంతవరకు వచ్చాయనే దానిపై అస్పష్టంగానే ఉన్నాయి.

వాతవరణ మార్పుల ప్రభావం హమాలయ హిమనీనదంపై ఎంతమేరకు ఉండనున్నది అనే విషయం కూడా ఈ అధ్యనాలు తేల్చలేక పోయాయి.

అందువలన, హిమాలయ పర్యావరణ వ్యవస్థ యొక్క పర్యవేక్షణను కొనసాగించడం మరియు మెరుగుపరచడం అవసరం.

హిమానీనదాల స్థితి మరియు నదీ ప్రవాహాలపై హిమనదీయ ద్రవ్యరాశిలో మార్పు యొక్క ప్రభావాలు అధ్యయనం కూడా అవసరం.

దక్షిణాసియా ప్రాంతంలోని అనేక ఇతర దేశాలు హిమాలయ పర్యావరణ వ్యవస్థను పంచుకున్నందున, పర్యావరణ వ్యవస్థ మార్పులు మరియు వాటి ప్రభావాలపై అవగాహన పెంచడానికి తగిన శాస్త్రీయ సహకారం మరియు సమాచార మార్పిడి అవసరం.

హిమాలయ పర్యావరణ వ్యవస్థల పరిరక్షణను పెంచే ఉద్దేశ్యంతో, స్థానిక సమాజాలకు, ముఖ్యంగా పంచాయతీల ద్వారా, పర్యావరణ వనరుల నిర్వహణకు ఎక్కువ బాధ్యత వహించేలా ప్రోత్సహించాలి.

చదవండి: Pradhan Mantri Matsya Sampada Yojana

నేషనల్ ఎన్విరాన్మెంట్ పాలసీ, 2006, పర్వత పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ కోసం ఈ క్రింది సంబంధిత చర్యలను సూచిస్తుంది:

1) పర్వత పర్యావరణ వ్యవస్థల స్థిరమైన అభివృద్ధికి తగిన భూ వినియోగ ప్రణాళిక మరియు వాటర్‌షెడ్ నిర్వహణ పద్ధతులను అనుసరించడం.

2) సున్నితమైన పర్యావరణ వ్యవస్థలకు మరియు ప్రకృతి రమణీయతకు నష్టం జరగకుండా పర్వత ప్రాంతాలలో మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఉత్తమ పద్ధతులను అవలంబించుట.

3) సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా సాంప్రదాయ రకాలైన పంటలు మరియు ఉద్యానవన సాగును ప్రోత్సహించి, రైతులు లాభదాయక ధరలు పొందే వీలు కల్పించుట.

4) పర్యాటక సౌకర్యాలు మరియు పర్యావరణ వనరుల కొరకు ఉత్తమ పద్ధతులను అవలంబించడం ద్వారా స్థిరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించుట.

5) అందుకు స్థానిక సమాజాలకు మెరుగైన జీవనోపాధి అందిస్తూ పెట్టుబడిదారుల ఆర్థిక, సాంకేతిక మరియు నిర్వాహక సామర్థ్యాలను పెంపొందించేందుకు మెరగైన పద్ధతులను అవలంబించుట.

6) పర్వత ప్రాంతాలలో పర్యావరణ సామర్థ్యాన్ని బట్టి పర్యాటకుల ప్రవాహాన్ని నియంత్రించడానికి చర్యలు తీసుకొనుట.

7) పర్వత శ్రేణుల పరిరక్షణ కోసం ప్రత్యేకమైన ప్రకృతి రమణీయతను “సాటిలేని విలువలు”గా పరిగణిస్తూ, వ్యూహాలను అభివృద్ధి చేయడం.

Join us on Facebook