National Mission on Sustainable Habitat సుస్థిర ఆవాసాలకై జాతీయ మిషన్
భవనాలలో ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఘన వ్యర్థాల నిర్వహణ మరియు ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు National Mission on Sustainable Habitat సుస్థిర ఆవాసాలకై జాతీయ మిషన్ ప్రారంభించబడింది.
ఈ మిషన్ మూడు కార్యక్రమాల ద్వారా పట్టణ ప్రణాళిక మరియు పట్టణ పునరుద్ధరణలో అంతర్భాగంగా శక్తి సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
1) మొదటిగా కొత్తగా నిర్మంచే పెద్ద వాణిజ్య భవనాలకు విద్యుత్శక్తి అవసరాలను సమర్ధవంతంగా రూపకల్పనను సూచించే విధంగా ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ రూపొందించడం.
దీని అనువర్తనాలు విస్తరించి ఇప్పటికే ఉన్న భవనాల విద్యుత్ నిర్వహణ పునఃరూపకల్పన చేసేవారికి ప్రోత్సాహకాలు అందించడం.
2) పదార్ధాల పునః వినియోగం మరియు పట్టణ వ్యర్థాల నిర్వహణ పర్యావరణపరంగా స్థిరమైన ఆర్థికాభివృద్ధిలో ప్రధాన భాగం.
అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే భారతదేశంలో ఇప్పటికే వ్యర్థాల రీసైక్లింగ్ రేటు గణనీయంగా ఎక్కువ.
వ్యర్థాల నుండి శక్తిని ఉత్పత్తి చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేయండంపై ఈ మిషన్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది.
సుస్థిర ఆవాసాలకై జాతీయ మిషన్ లో భాగంగా బయో కెమికల్ మార్పిడి, వ్యర్థ నీటి వినియోగం, మురుగునీటి వినియోగం మరియు పునఃవినియోగ సాధ్యాసాధ్యాలపై దృష్టి సారించేందుకు ఒక ప్రధాన పరిశోధన మరియు అభివృద్ధి (R&D) కార్యక్రమం రూపొందించబడింది.
చదవండి: Bois Locker Room Case: సామాజిక మాధ్యమంలో ఓ చీకటి గది
3) మెరుగైన పట్టణ ప్రణాళిక తోపాటు ప్రజా రవాణాను ప్రోత్సహించడం. దీర్ఘకాలిక రవాణా ప్రణాళికలను రూపొందించడం మిరియు సమర్థవంతమైన, సౌకర్యవంతమైన ప్రజా రవాణా మధ్యస్థ మరియు చిన్న నగరాల వృద్ధికి దోహదపడుతుంది.
అదనంగా, భవిష్యత్ వాతావరణ మార్పులకు అనుగుణంగా మౌలిక సదుపాయాల యొక్క స్థితిస్థాపకత, సమాజ ఆధారిత విపత్తు నిర్వహణ మరియు తీవ్రమైన వాతావరణ సంఘటనల కోసం హెచ్చరిక వ్యవస్థను మెరుగుపరిచే చర్యలను ఈ మిషన్ అవలంబిస్తుంది.
ఈ మిషన్‌లో శక్తి సామర్థ్యం పెంపొందించడం ఒక ముఖ్యమైన భాగం.
ఈ విధంగా National Mission on Sustainable Habitat సుస్థిర ఆవాసాలకై జాతీయ మిషన్ మూడు భాగాలను కలిగి ఉంటుంది, అవి
ఎ) నివాస మరియు వాణిజ్య రంగంలో శక్తి సామర్థ్యాన్ని ప్రోత్సహించడం,
బి) మునిసిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ, మరియు
సి) పట్టణ ప్రజా రవాణాను ప్రోత్సహించడం.