National Solar Mission జాతీయ సౌర మిషన్
అణుశక్తి, పవన శక్తి మరియు బయోమాస్ వంటి ఇతర పునరుత్పాదక మరియు శిలాజ రహిత విద్యుదత్పత్తి మార్గాలకు తగిన ప్రాధాన్యతనిస్తూ, మొత్తం శక్తి వనరులలో సౌర శక్తి వాటాను గణనీయంగా పెంచడానికి National Solar Mission జాతీయ సౌర మిషన్ ప్రారంభించబడింది.
భారతదేశం ఒక ఉష్ణమండల దేశం, ఇక్కడ సూర్యరశ్మి రోజుకు ఎక్కువ గంటలు అధిక తీవ్రతతో లభిస్తుంది. కావున సౌర శక్తి భవిష్యత్ శక్తి వనరుగా గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది.
సౌరశక్తి ద్వారా విద్యుత్ శక్తి యొక్క వికేంద్రీకృత పంపిణీని అనుసరించి అట్టడుగు స్థాయిలోని ప్రజలకు సైతం విద్యుత్ సదుపాయం అందించడం సులభం.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతతో ఫొటోవోల్టాయిక్ సెల్స్ లభ్యత పెరిగింది.
రిఫ్లెక్టర్ ఆధారిత సాంకేతికత ద్వారా దేశవ్యాప్తంగా మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు సులభంగా మారింది.
చదవండి: National Mission for Sustainable Agriculture(NMSA)
సౌర మిషన్ యొక్క మరొక ముఖ్యమైన అంశం, అంతర్జాతీయ సహకారాన్ని కూడా పొందగలిగే ఒక ప్రధాన పరిశోధనా మరియు అభివృద్ధి (R&D) కార్యక్రమాన్ని ప్రారంభించడం.
తద్వారా అందుబాటు ధరలలో, సౌకర్యవంతమైన సౌర విద్యుత్ వ్యవస్థలను రూపొందించడంతో పాటు నిరంతర, దీర్ఘకాలిక ఉపయోగానికై సౌర విద్యుత్ నిల్వకు అణుగుణంగా ఆవిష్కరణలను ప్రోత్సహించడం.
National Solar Mission విద్యుత్ ఉత్పత్తి మరియు ఇతర అనువర్తనాల కోసం సౌర శక్తిని ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తుంది.
అవసరమైన చోట, ఇది బయోమాస్ మరియు పవనశక్తి వంటి, ఇతర పునరుత్పాదక ఇంధన సాంకేతిక పరిజ్ఞానాలతో ఏకీకరణను ప్రోత్సహిస్తుంది.
భారతదేశం ఎక్కువగా భూమి యొక్క భూమధ్యరేఖ సమీపంలో ఉంది, తద్వారా సూర్యుడి నుండి సమృద్ధిగా ప్రకాశించే శక్తిని పొందుతుంది.
భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో, సంవత్సరానికి దాదాపు 250 నుండి 300 రోజులు స్పష్టమైన ఎండ వాతావరణం కనబడుతుంది.
అలా లభ్యమయ్యే సౌర వికిరణం ద్వారా మన దేశం సంవత్సరానికి 5,000 ట్రిలియన్ కిలోవాట్ల సమాన శక్తిని పొందుతుంది.
ప్రపంచవ్యాప్తంగా ఏటా ప్రతీ చదరపు మీటరుకు సగటున 1600 నుండి 2200 kWh వరకు సౌర వికిరణం ఉంటుంది. భారతదేశంలో సగటున ప్రతి చదరపు మీటరుకు సౌర వికిరణం రోజుకు 5.5 kWh.
ఈ లెక్కన భారతదేశం భూభాగంలో కేవలం 1% 2030 వరకు భారతదేశం యొక్క మొత్తం విద్యుత్ అవసరాలను తీర్చగలదు.
ఉత్పత్తి సమయంలో ఎటువంటి ఉద్గారాలు లేవు కావున సౌర ఆధారిత విద్యుత్ సాంకేతికతలు విద్యుతుత్పత్తిలో అత్యంత శ్రేష్టమైన రూపం.
బొగ్గు మరియు పెట్రోలియం వినియోగం లేనందున శక్తి భద్రతకు National Solar Mission ఉపకరిస్తుంది.
సౌరశక్తి వికేంద్రీకృత వ్యవస్థలలో ఉత్పత్తి చేయవచ్చు కావున ప్రసార మరియు పంపిణీ నష్టాలు చాలా తక్కువ.
సౌరశక్తిని జాతీయ గ్రిడ్ తో సంబంధం లేకుండా ఉపయోగించడమే కాక, అవసరమైనప్పుడు జాతీయ గ్రిడ్‌తో అనుసంధానించవచ్చు కూడా.
One thought on “National Solar Mission (NSM)”
Comments are closed.