ఆపరేషన్ సముద్ర సేతు

OPERATION SAMUDRA SETU

ఆపరేషన్ సముద్ర సేతు

విదేశాల్లో చిక్కుకు పోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు భారత వాయుసేన తలపెట్టిన ఆపరేషన్ పేరే ఆపరేషన్ సముద్ర సేతు.

ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసి ప్రపంచాన్నే లాక్డౌన్ లోకి నెట్టేసింది కొవిడ్-19.

అనేక కారణాల వల్ల విదేశాలకు వెళ్ళిన ఎంతో మంది భారతీయులనే కాక మరెందరో ఇతర దేశస్థులను కూడా తమ మాతృభూమికి దూరంగా వివిధ దేశాలలో చిక్కుకు పోయేలా చేసిందీ ఈ మహమ్మారి.

అలా విదేశాలలో చిక్కుకు పోయిన వారు అయా దేశలు వదిలి తమ తమ దేశాలకు వెళ్ళలేని పరిస్థితి. అలా చిక్కుకు పోయిన భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

1990లో కువైట్ దేశం నుండి భారతీయులను రక్షించి తీసుకు వచ్చేందుకు ఎయిర్ లిఫ్ట్ కార్యక్రమాన్ని చేపట్టింది, ఆ తరువాత మళ్ళీ అటువంటి కార్యక్రమం ఇదే.

చదవండి: Is lockdown going to bring back the poverty?

సముద్ర సేతు అంటే సముద్రంపై నిర్మించిన వారధి అనే అర్ధం వస్తుంది.

ఈ ఆపరేషన్లో భాగంగా శుక్రవారం నాడు ప్రారంభం కానున్న మోదటి దశకు అనుగుణంగా భారత నావికా దళానికి చెందిన ఐఎన్ఎస్ జలాశ్వ, మరియు ఐఎన్ఎస్ మగర్ అనే రెండు నావలు మాల్దీవులకు పయనమయ్యాయి.

మొదట దశగా శుక్రవారం నుండి మాల్దీవుల్లోని మాలే నగరం నుండి ఆ దేశంలో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకువచ్చే కార్యక్రమం ప్రారంభమం కానుంది.

మాల్దీవులలో గల భరతీయ మిషన్ (Indian Mission) రూపొందించిన జాబితా ప్రకారం అక్కడి భారతీయులను ఈ నావలలో ఎక్కించుకోనున్నారు.

అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి ప్రయాణానికి ఎటువంటి ఆక్షేపణలు లేని వారిని మాత్రమే ఈ నావలలో ప్రయాణించేందుకు అనుమతిని ఇవ్వనున్నారు.

Subscribe on Youtube

అన్ని విధాలా సిద్ధం

ప్రబలుతున్న కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా పాటించవలసిన సామాజిక దూరాన్ని గమనిస్తూ తగిన జాగ్రత్త చర్యలు ముందుగానే సిద్ధంచేసుకున్నారు.

నావలలో ప్రయాణం చేసేవారికి అందించ గల వైద్య సదుపాయాలు, ఇలాంటి పరిస్థితుల్లో (సామాజిక దూరం పాటిస్తూ) నావలో ప్రయాణించ గల గరిష్ట సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, మొదటి విడతలో సుమారు 1000 మందిని తరలించనున్నట్లు అంచనా.

ఐఎన్ఎస్ జలాశ్వ మరియు ఐఎన్ఎస్ మగర్ నావలు రెండూ ఈ ఆపరేషన్ కోసం అన్ని విధాలా సిద్ధంచేయబడ్డాయని అధికారులు పేర్కొన్నారు.

ఈ నావలలో సముద్రయానం చేసి స్వదేశాలకు చేరబోయే వారికి తగిన నిత్యావసరాలతో పాటు అవసరమైన వైద్య సదుపాయాలు కూడా ప్రయాణకాలంలో కల్పించేందుకు నావలో ఏర్పాట్లు చేశారు.

కోవిడ్-19 చేస్తున్న వికటాట్టహాసానికి ప్రతిగా ఈ ఆపరేషన్ కోసం కఠినమైన నిబంధనలను అమలు పరుచనున్నట్లు, అందులో ఎటువంటి మినహాయింపలు ఉండబోవని తెలుస్తుంది.

join us on Telegram

ఈ ఆపరేషన్ సముద్ర సేతు ద్వారా స్వదేశానికి వచ్చిన వారిని కేరళలోని కొచ్చిన్ లో ప్రభుత్వ అధికారుల పరిరక్షణలో ఉంచుతారు. వీరిని అక్కడే క్వారంటైన్ లో ఉంచనున్నారు.

ఈ ఆపరేషన్ అమలు తీరు స్థితి గతులు మొత్తం రక్షణ మంత్రిత్వ శాఖ, విదేశాంగ శాఖ, గృహ మంత్రాలయం, వైద్య ఆరోగ్య శాఖా మరియు సంబంధిత అన్ని సంస్థల పర్యవేక్షణలో సాగుతుంది.