US produces the most plastic waste in total: అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్న దేశంగా యుఎస్
US produces the most plastic waste in total అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్న దేశంగా యుఎస్
తాజా పరిశోధనల ప్రకారం, యుఎస్ మరియు యుకె ఇతర ప్రధాన దేశాల కంటే ఎక్కువ తలసరి ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నాయి.
అమెరికా అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుందని మరియు మహాసముద్రాలలో ప్లాస్టిక్ కాలుష్యానికి దోహదం చేయడంలో ఆ దేశ పౌరులు ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్నారని విశ్లేషణ సూచిస్తుంది.
గత నివేదికలలో ఆసియా దేశాలు సముద్ర ప్లాస్టిక్ కాలుష్యంలో ఆధిపత్యం చెలాయించి, అమెరికాను 20 వ స్థానంలో ఉంచాయి, అయితే ఇది అమెరికా వ్యర్థ ఎగుమతులకు లేదా దేశంలో అక్రమంగా డంపింగ్‌కు గురౌతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలను పరిగణలోకి తీసుకోలేదు.
అమెరికాలో రీసైక్లింగ్ కోసం సేకరించిన ప్లాస్టిక్‌లో సగానికి పైగా విదేశాలకు ఎగుమతి చేయబడిందని, ఎక్కువగా ప్లాస్టిక్ వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇప్పటికే కష్టపడుతున్న దేశాలకు చేరుతున్నట్లు 2016 నుండి ఉన్న సమాచారం ద్వారా తెలుస్తుంది.
Join us on Telegram
ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రస్తుతం సాధ్యమయ్యే అన్ని చర్యలను చేపట్టినప్పటికి, అది కేవలం 40% మాత్రమే తగ్గించగలదని, 2040 నాటికి 700 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలు పర్యావరణంలోకి చేరతాయని తెలుపుతుంది.
పర్యావరణంలో ప్లాస్టిక్ భారీగా ఏర్పడకుండా ఉండటానికి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి, పునర్వినియోగం పెంచడానికి, వ్యర్థాల సేకరణ మరియు రీసైక్లింగ్ కోసం ప్రపంచ సమన్వయ చర్య అత్యవసరం.
2018 లో ప్లాస్టిక్ వ్యర్థాలను దిగుమతి చేసుకోవడాన్ని చైనా నిషేధించింది, అలాగే మలేషియా, వియత్నాం, థాయ్‌లాండ్, ఇండియా మరియు ఇండోనేషియా దేశాలు తమ సొంత ఆంక్షలను అనుసరించాయి.
ఈ దేశాలలో రీసైకిలింగ్ కోసం చేరుతున్న ప్లాస్టిక్ వివరాలు ఇంకా పూర్తిగా తెలియదు, కాని యుఎస్ ప్లాస్టిక్ బంగ్లాదేశ్, లావోస్, ఇథియోపియా మరియు సెనెగల్ సహా, ప్రపంచంలోని కొన్ని పేద దేశాలకు పంపబడుతోంది, ఇక్కడ శ్రామిక శక్తి చౌకగా దొరకడం మరియు పర్యావరణ నియంత్రణ పరిమితంగా ఉండటమే ఇందుకు కారణం.
కోవిడ్ -19 మహమ్మారి కూడా ప్లాస్టిక్ వ్యర్థాలను పెంచుతోంది, ముఖ్యంగా విసర్జిత పిపిఇలు దీనికి ఒక కారణం, అయితే ఈ విషయమై పూర్తి స్థాయిలో సమాచారం ఇంకా అందుబాటులో లేదని చెప్పవచ్చు.
ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం 2016 లో 34 మిలియన్ టన్నుల చొప్పున అమెరికా అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేసిందని పరిశోధకులు కనుగొన్నారు, అయితే అదనపు డేటాను పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఇది మొత్తం 42 మిలియన్ టన్నులకు పెరిగింది.
భారతదేశం మరియు చైనా రెండవ మరియు మూడవ స్థానంలో ఉన్నాయి, కాని వారి అధిక జనాభా కారణంగా తలసరి ప్లాస్టిక్ వ్యర్థాల సంఖ్య US తో పోల్చితే 20% కన్నా తక్కువ.
అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి కలిగిన 20 దేశాలలో, UK, US తరువాత రెండవ స్థానంలో ఉంది, తరువాత దక్షిణ కొరియా మరియు జర్మనీ ఉన్నాయి.
దేశాల వారీగా మహాసముద్రాలలో కలిసే ప్లాస్టిక్ వ్యర్ధాల గురించి పరిశోధకులు అంచనా వేసినప్పుడు, ఇండోనేషియా మరియు భారతదేశం అత్యధిక స్థానంలో ఉన్నాయి.
పర్యావరణంలోకి వ్యర్థాల లీకేజీ గురించి చేసిన అధ్యయనాలను బట్టి యుఎస్ మూడవ మరియు పదకొండవ స్థానాల మధ్య ఉంది.
1 మిలియన్ టన్నుల వరకు ఎగుమతి చేసిన US ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్ర కాలుష్యంగా మారుతున్నట్లు విశ్లేషణలో తేలింది.
ఈ సమస్యకు పరిష్కారం ఇంటినుండే ప్రారంభించాలి, అనవసరమైన సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌లను పరిమితం చేయడం ద్వారా మనం ప్లాస్టిక్ వ్యర్ధాలను తగ్గించాలి మరియు వస్తువులను ప్యాకేజీ చేయడానికి మరియు పంపిణీ చేయడానికి కొత్త మార్గాలను అభివృద్ధి చేయాలి.
ప్లాస్టిక్స్ అనివార్యమైన చోట, మన రీసైక్లింగ్ రేట్లను తీవ్రంగా మెరుగుపరచాలి. 2016 లో యుఎస్ ప్లాస్టిక్ వ్యర్థాలలో 9% మాత్రమే రీసైకిల్ చేయబడింది, ఇది చాలా తక్కువ.
Also Read: Quality Norms for Imported Toys