World Book And Copyright Day

world-book-day

ప్రపంచ పుస్తక దినోత్సవం

ప్రతి వ్యక్తికి విద్యార్ధి దశ నుండే పుస్తకం తన జీవితాన్ని తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్రను పోషిస్తుంది. పుస్తకం ఎంత విలువైనదో తెలుసుకోబట్టి పెద్దలు పుస్తకం హస్తభుషణం అన్నారు. పుస్తకం అనేది ఒక విజ్ఞాన భాండాగారంగా, జీవిత బోధినిగా, సరస్వతి దేవి ప్రతిరూపంగా భావిస్తారు. ఒక మనిషికి పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని సంస్కారాన్ని అందించే గురువే పుస్తకం. ఇంతటి ప్రాముఖ్యతను కలిగిన పుస్తకాన్ని నేటి ఆధునిక కాలంలో కంప్యూటర్లను మొబైల్ ఫోన్లను వాడుతూ మరిచిపోవడంతో పుస్తక పఠనము, పుస్తు ప్రచురణలు, కాపీ హక్కులు వంటి వాటికి పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం ఎప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది.

చాలా మంది రచయుతలు పుట్టిన మరణించిన ఏప్రిల్ 23వ తేదీనే ప్రపంచ పుస్తక దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించి మొట్టమొదటి సారిగా 1995 ఏప్రిల్ 23వ తేదీన యునేస్కో ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఆ రోజునే కాపీ రైట్స్ డే అని కూడా అంటారు. యునెస్కో ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రపంచంలోని ఒక ముఖ్య నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటిస్తుంది.

గతంతో పోల్చితే రానురాను పుస్తకాలను చదివేవారు, ప్రచురించేవారు, కాపీ రైట్లను పొందేవారు, తగ్గిపోవడం యువతీ యువకులు ఎక్కువగా సామాజిక మాధ్యమాల వైపు మొగ్గు చూపుతుండటం జరుగుతుంది. సామాజిక మాధ్యమాల కలిగే దుష్ప్రభావాలను తెలియజేస్తు పుస్తకాలను చదవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేస్తూ ఎక్కువ మంది పుస్తకాలు చదివే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది యునెస్కో.

రాజేశ్ బుర్ర