ప్రపంచ హిమోఫీలియా దినం

world hemophilia day

ప్రపంచ హిమోఫీలియా దినం

ప్రమాదాలు అనేవి నిత్యజీవితంలో సర్వసాధారణమైపోయిన రోజులివి, తెలిసో తెలియకో మనము ఎన్ని జాగ్రత్తలు పాటించినా కూడా కొన్ని సందర్భాలలో ప్రమాదాలు తప్పడం లేదు. ఐతే అలా ప్రమాదాల వల్ల గాయాల పాలైన వ్యక్తులకు రక్తస్రావం జరుగక మానదు. సాధారణంగా అలా గయాలవల్ల జరిగే రక్త స్రావం కొద్ది సేపటికి గడ్డకట్టడం ద్వారా ఆగిపోతుంది, కాని కొందరిలో మాత్రం అలా గడ్డ కట్టక పోవడం వల్ల ఆ రక్త ప్రవాహం అనేది ఆగదు ఈ అధిక రక్తస్రావాన్నే హిమోఫీలియా అంటారు.

ఈ వ్యాధి లక్షణాన్ని 10వ శతాబ్దంలోనే కనుగొన్నారు. నాటి నుండి నేటి వరకు ఈ వ్యాధిపై అనేక మంది శాస్త్రవేత్తలు, వైద్యులు ఎన్ని పరిశోధనలు జిరిపినప్పటికి ఫలితం లభించక పోయింది. ఇప్పటికీ దీని నివారణకు గాని నియంత్రణకు గాని ఎటువంటి మార్గాన్ని కనుగొనలేక పోయారు.

ఈ వ్యాధి వంశ పారంపర్యంగా సంక్రమించే వ్యాధి, గర్భవతిగా ఉన్నపుడు తల్లి నుండి బిడ్డకు కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఐతే గర్భవతిగా ఉన్న మహిళకు ఈ వ్యాధి ఉన్నట్లు ముందుగానే గమనించిలట్లైతే అది బిడ్డకు సంక్రమించకుండా నివారించవచ్చు. ఈ వ్యాధి ఎక్కువగ పురుషులలో కనబడుతుంటుంది. ఈ వ్యాధి ఉన్న వారికి రక్తస్రావం బయట దెబ్బలకే కాక అంతర్గతంగా కూడా జరగవచ్చు. దానికి తోడు కీళ్ల నొప్పులు, వాపులే కాక మల మూత్రాలలో సైతం రక్తం పడవచ్చు.

ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు తెలుసుకున్న ఫ్రాంక్ ష్నాబెల్ దాని నివారణకై కృషి చేసేందుకు గాను 1989లో ప్రపంచ హిమోఫీలియా సమాఖ్య (World Federation of Hemophilia-WFH) ను స్థాపించారు. హీమోఫీలియాపై ఈ సంస్థ చేస్తున్న కృషికి గాను ప్రపంచ ఆరోగ్య సంస్థ తన గుర్తింపుతో సత్కరించింది.

WFHను స్థాపించి దానిపై ఎంతో కృషిచేసిన ఫ్రాంక్ ష్నాబెల్ జన్నదినమైన 17 ఎప్రిల్ ను ప్రపంచ ఆరోగ్స సంస్థ ప్రపంచ హిమోఫీలియా దినంగా ప్రకటించింది. దీనికి అనుగుణంగా ప్రతి సంవత్సరం ఎప్రిల్ 17ను ప్రపంచ హిమొఫిలియా దినోత్సవం నిర్వహిస్తారు. ఈ రోజున ఈ వ్యాధి పట్ల అవగాహన పెంచే కార్యక్రమాలతో పాటు ఈ వ్యాధి బారిన పడిన వారకి మానిసిక ధైర్యాన్ని పెంపొందించే కార్యకారమాలు కూడా చేపడుతుంటారు.

రాజేశ్ బుర్ర

2 thoughts on “ప్రపంచ హిమోఫీలియా దినం”

Comments are closed.