World Malaria Day 25 April

WORLD MALARIA DAY 25 APRIL

World Malaria Day ప్రపంచ మలేరియా దినోత్సవం:

World Malaria Day 25 April: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రమాదకర వ్యాధులలో మలేరియా ఒకటి. 

ఈవ్యాధి బారినపడి ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రజలు మరణిస్తున్నారు. 

ఈ వ్యాధిని నియంత్రంచడానికి ప్రజల్లో అవగాహనను కల్పించాలనే ప్రధాన ఉద్దేశ్యంతో ప్రతీ సంవత్సరం మలేరియాడేను నిర్వహిస్తారు

మలేరియా అనేది దోమలనుండి మనుషులకు సంక్రమిస్తుంది. పరాన్నజీవులు మనిషి రక్తంలోకి ప్రవేశించడంవలన ఈవ్యాధివస్తుంది. 

ఈ వ్యాధి వలన ప్రతీఏటా ప్రపంచవ్యాప్తంగా 2మిలియన్లమంది ప్రజలు మరణిస్తుండటం, వ్యాధి విసృంఖలంగా వ్యాప్తి చెందుతూ ఉండేది. 

అందువలన మలేరియాను నివారించే ఉద్దేశంతో ప్రపంచఆరోగ్యసంస్థ(WHO) మొట్టమొదటిసారిగా 2007లో తమ సభ్యదేశాలతో కలిసి ప్రపంచవ్యాప్తంగా మలేరియాడేను నిర్వహించింది.

చదవండి: World Book and Copyrights Day

ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన మలేరియా

ప్రపంచవ్యాప్తంగా 100కుపైగా దేశాలు ఈవ్యాధితో ప్రభావితమయ్యాయి. 

ముఖ్యంగా మొజాంబక, నైజీరీయా, బురిఒనాఫాసో, సియార్రా లయోన్ మొదలైన పేదదేశాల్లో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉండేది. 

మలేరియా వలన ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన మరణాలలో ఎక్కువశాతం ఈదేశాల నుండే ఉండేవి. 

ఇక్కడి ప్రజలలో అధికశాతం మంది నిరక్షరాస్యులవడం మలేరియా వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడం, వీటికి తోడు సరైన వైద్య సౌకర్యాలు వీరికి అందుబాటులో ఉండేవి కావు.

వీటన్నింటిని గమనించిన WHO, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవం (World Malaria Day)లో భాగంగా, పేదదేశాలకు ఆరోగ్య పరిరక్షణకు ఆర్ధిక సహకారాన్ని అందిస్తుంది. అంతేగాక, ప్రపంచ వ్యాప్తంగా మలేరియా వ్యాధి పట్ల అవగాహనా సదస్సులను నిర్వహిస్తూ, పేద ప్రజలకు స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఉచిత వైద్య పరీక్షల నిర్వహించి, ఉచితంగా ఒషధాలు కూడా అందిస్తుంది.

ప్రపంచ మలేరియా దినోత్సవం 2020 న, మలేరియాను అంతమొందించేందుకు WHO RBM తో కలిసి “జీరో మలేరియా నాతో మొదలవుతుంది(Zero Malaria Starts with Me)”, రాజకీయ అజెండాలో మలేరియా నివారణా చర్యలు అధికంగా ఉంచడం, అదనపు వనరులను సమీకరించడం మరియు మలేరియా నివారణలో కమ్యూనిటీలను శక్తివంతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్న బృహత్తర కార్యానికి శ్రీకారంగా నిలిచింది.

COVID-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్నందున, కరోనావైరస్ దూకుడుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది, మలేరియా వంటి ఇతర ప్రాణాంతక వ్యాధులు నిర్లక్ష్యం చేయబడకుండా చూసుకోవాలి. WHO గ్లోబల్ మలేరియా ప్రోగ్రామ్ మలేరియా-ప్రభావిత దేశాలలో కరోనావైరస్ యొక్క ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి ఒక క్రాస్-పార్టనర్ ప్రయత్నానికి నాయకత్వం వహిస్తుంది మరియు సాధ్యమైన చోట, విజయవంతమైన COVID-19 ప్రతిస్పందనకు దోహదం చేస్తుంది.

రాజేశ్ బుర్ర