World Press Freedom Day 3 May

WORLD PRESS FREEDOM DAY 3 MAY 2020

World Press Freedom Day ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం:

World Press Freedom Day ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని యునెస్కో సర్వసభ్య సమావేశం సిఫారసు చేసిన తరువాత 1993 డిసెంబర్‌లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రకటించింది. 

అప్పటి నుండి, మే 3, విండ్‌హోక్ ప్రకటన వార్షికోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా జరుపుకుంటారు..

1991 లో విండ్‌హోక్‌లో ఆఫ్రికన్ వార్తాపత్రిక జర్నలిస్టులు కలిసి చేసిన స్వేచ్ఛా పత్రికా సూత్రాల ప్రకటన విండ్‌హోక్ డిక్లరేషన్ వార్షికోత్సవాన్ని సూచిస్తూ ఈ కార్యక్రమాన్ని మే3న నిర్వహిస్తారు.

పత్రికా స్వేచ్ఛ పట్ల ప్రభుత్వాల నిబద్ధతను మరియు వాటిని గౌరవించాల్సిన అవసరాన్ని మే 3 గుర్తు చేస్తుంది. మీడియా నిపుణుల పత్రికా స్వేచ్ఛ మరియు వృత్తిపరమైన నైతికతల ఆవశ్యకత ప్రతిబింబించే రోజు.

2020 మే 3 న, ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా యునెస్కో ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా జాతీయ మరియు స్థానిక వేడుకలు జరుగుతాయి, వీటికి తోడు మరికొన్ని కార్యక్రమాలు ఆన్‌లైన్ చర్చలు మరియు వర్క్‌షాప్‌ల రూపంలో జరుగుతాయి.

ప్రింట్ మిడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అంటూ విస్తృతంగా మారుతున్న పాత్రికేయ మఖచిత్రంలో “భయం లేదా పక్షపాతం లేని జర్నలిజం”పై దృష్టి సారించి యునెస్కో మీడియా మరియు సోషల్ మీడియా ఛానెళ్లపై ప్రపంచవ్యాప్త ప్రచారానిక సన్నాహాలు చేసింది.

చదవండి: World Intellectual Property Day

World Press Freedom Day OLD DATE

World Press Freedom Day 2020 Theme:

2020 Theme “Journalism without Fear or Favour”.

దీనికి తోడు మూడి ఉప ఇతివృత్తాలను(Sub Themes) సైతం పేర్కొన్నారు.

  • స్త్రీ, పురుష పాత్రికేయుల మరియు పాత్రికేరంగంలో పని చేసే వారి భద్రత. (Safety of Women and Men Journalists and Media Workers)
  • రాజకీయ ఆర్ధిక ప్రభావాలు లేని నైపుణ్యమైన స్వతంత్ర పాత్రికేయత. (Independent and Professional Journalism free from Political and Commercial Influence)
  • మీడీయాలోని అన్ని అంశాల్లో లింగ సమానత్వం. (Gender Equality in All Aspect of the Media)

1993 నుండి ఏటా ఈ గ్లోబల్ సదస్సు నిర్వహించబడుతున్నది.

 పాత్రికేయులు, పౌర సమాజ ప్రతినిధులు, జాతీయ అధికారులు, విద్యావేత్తలు మరియు విస్తృతంగా ప్రజలకు పత్రికా స్వేచ్ఛ ఆవశ్యకత గురించి తెలియజేస్తుంది.

మరియు పాత్రికేయుల భద్రతకు ఎదురవుతున్న సవాళ్లను చర్చించడానికి మరియు పరిష్కారాలను గుర్తించడంలో కలిసి పనిచేయడానికి అవకాశాన్ని అందిస్తుంది.

world-press-freedom-conference_new-date

ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం పై కోవిడ్-19 ప్రభావం (Impact of Covid-19 on World Press Freedom Day):

2020లో ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవ వేడుకలకు నెదర్లాండ్స్ ఆతిథ్యమిస్తుంది. యునెస్కో మరియు నెదర్లాండ్స్ ఈ సమావేశాన్ని ఏప్రిల్ 22 నుండి 24 వరకు హేగ్‌లోని వరల్డ్ ఫోరంలో నిర్వహించాలని భావించాయి.

ఐది ఇప్పుడు అదే వేదిక వద్ద అక్టోబర్ 18 నుండి 20 వరకు ఈ కార్యక్రమాన్ని జరపాలని ప్రణాళిక రూపొందించారు.

ఈ కార్యక్రమాన్ని ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం (మే 3 World Press Freedom Day) మరియు జర్నలిస్టులపై నేరాలకు అంతర్జాతీయ శిక్ష దినోత్సవం (నవంబర్ 2 International Day to End Impunity for Crimes against Journalists) రెండింటి సంయుక్త వేడుకలు కానున్నాయి. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ COVID-19 ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన నేపథ్యంలో, దాని వల్ల జరిగే నష్టాలను తగ్గించడానికి సమావేశాన్ని వాయిదా వేసే నిర్ణయం తీసుకోబడింది.

చదవండి: National PanchayatiRaj Day