ప్రపంచ రడ్ క్రాస్ దినోత్సవం
మొట్టమొదటి నోబెల్ శాంతి పురస్కార గ్రహీతలలో ఒకరైన హెన్రీ డునాంట్ (ఈ పురస్కారాన్ని హెన్రి డునాంట్ ఫ్రెడ్రిక్ పాసీతో పంచుకున్నారు) జ్ఞాపకార్ధం ప్రతీ ఏడు మే8న ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని (World Red Cross Day) నిర్వహిస్తారు.
జెనీవాలో 1828 మే8 న అంర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ వ్యవస్థాపకుడైన హెన్రీ డునాంట్ జన్మించారు ఈయన జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతిఏడు మే8న ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
మొదటి ప్రపంచ యుద్ధం తరువాత 1919 లో హెన్రీ డునాంట్ పారిస్‌లో అంతర్జాతీయ సమాఖ్య స్థాపించారు.
చదవండి: LG Polymers Vizag Gas Leakage: A tragedy
చారిత్రక నేపధ్యం
అప్పటికే వివిధ దేశాలకు విస్తరించిన రెడ్‌క్రాస్ శాఖల మధ్య సన్నిహిత సహకారం అవసరం అని యుద్ధం నిరూపించింది.
ఇది యుద్ధ ఖైదీలు మరియు పోరాట యోధులకు అందిస్తున్న మానవతా కార్యకలాపాల ద్వారా లక్షల మందిని వాలంటీర్లుగా ఆకర్షించింది. అలా రెడ్ క్రాస్ ఒక వటవృక్షంలా విస్తరించింది.
ఈ ఫెడరేషన్ యొక్క మొదటి లక్ష్యం నాలుగు సంవత్సరాల యుద్ధంలో బాగా నష్టపోయిన దేశాలలో ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం.
బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఇలా ఐదు వ్యవస్థాపక సభ్య ప్రారంభమైంది ఈ సమాఖ్య. ఈ సంఖ్య ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలో రెడ్ క్రాస్ విస్తరించింది.
మొట్టమొదటిగా పోలాండ్లో టైఫస్ మరియు కరువు బాధితులకు సహాయం చేయడం లక్ష్యంగా ప్రారంభమైన సేవలు, నేడు సంవత్సరానికి 80 కి పైగా సహాయక చర్యలను నిర్వహిస్తుంది.
మొదటి ప్రపంచ యుద్ధం తరువాత నెలకొన్న అశాంతి నుండి బయటకి రావడానికి ప్రపంచ శాంతి స్థాపన కోసం ప్రతీ సంవత్సరం ఒక కార్యక్రమం జరపాలని భావించారు.
ఈ కార్యక్రమం గురించి 14వ అంతర్జాతీయ రెడ్ క్రాస్ సదస్సులో స్థాపించిన అంతర్జాతీయ కమాషన్ “రెడ్ క్రాస్ ట్రూస్” అనే పేరుతో అధ్యయనం జరిపింది.
1934లో టోక్యోలో జరిగిన 15వ అంతర్జాతీయ రెడ్ క్రాస్ సదస్సులో ఈ అధ్యయన నివేదికను సమర్పించగా అది ఆమోదించబడింది.
ఐతే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 1946లో గానీ దీనిని The league of Red Cross Societies (LRCS) పరిశీలించలేదు.
ఈ లీగ్ ఆఫ్ రెడ్ క్రాస్ 1983లో The League of Red Cross Societies Red Crescent Societies గానూ తరువాత 1991లో International Federation of Red Cross and Red Crescent Societies(IFRC) రూపాంతరం చెందింది.
1948లో “The Red Cross Truce” అధ్యయనంలోని సిద్ధాంతాలను ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో అన్వయింపదగ్గ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు.
అన్ని అంశాలను పరిశీలించి 1948 మే 8న మొట్టమొదటి రెడ్ క్రాస్ డే నిర్వహించబడింది. 1984లో ఈ కార్యక్రమానికి World Red Cross and Red Crescent Day గా నామకరణం చేశారు.