5 Million Corona Cases Worldwide

5 Million Corona Cases Worldwide

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ మాట్లాడుతూ ఐదు మిలియన్ల కరోనా కేసులు (5 Million Corona Cases Worldwide) అనేది ఒక “విషాద మైలురాయి” గా మిగిలిపోతుంది అన్నారు.

అత్యంత వేగంగా ఐదు మిలియన్ల “విషాద మైలురాయి” చేరుకున్న ప్రస్తుత తరుణంలో, కొత్తగా నమోదయ్యే COVID-19 కేసులు 20 మే 2020 తేదీన రికార్డు సంఖ్యలో నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం తెలిపింది.

19 మే 2020 నాడు 106,000 కేసులు WHO కి నివేదించబడ్డాయి – డిసెంబరులో కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి ఒక రోజులో నమోదైన కేసులలో ఇదే అత్యధికం.

WHO 30 రోజులు సమయంలో తన కార్యకలాపాలను సరిదిద్దుకోకపోతే సంస్థ అతిపెద్ద సహకారి దాని నిధులను స్థంబింపజేయడమే కాక సంస్థ నుండి తమ సభ్యత్వాన్ని కూడా పూర్తి రద్దు చేసుకునేందుకు సిద్ధం అని యు.ఎస్. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటమ్‌తో జారీ చేశారు.

జెనీవా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే WHO డాష్‌బోర్డ్ ప్రకారం మంగళవారం(19-05-2020), 106,662 కేసులను ప్రపంచవ్యాప్తంగా తమకు నివేదించినట్లు తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ తమ పరీక్షా కార్యక్రమాలను గణనీయంగా పెంచిన తరువాత కొత్త గణాంకాలు వచ్చాయి. దానితో ఈ గణాంకాలు మరింత పెరిగాయి.

చదవండి: 12000 HP made in India locomotive

మహమ్మారితో సహచారం తప్పదు:

“ఈ మహమ్మారితో మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాలి” పేద దేశాలలో ఈ గణాంకాలు మరింత ప్రమాదకరంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఒక వర్చువల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పేర్కొన్నారు.

గత డిసెంబరులో చైనాలో మొదటిసారిగా గుర్తించినప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా 5 మిలియన్లకు పైగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.

WHO ఎమర్జెన్సీ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ మాట్లాడుతూ ఐదు మిలియన్ల కేసులు ఒక “విషాద మైలురాయి” అని అన్నారు.

ప్రస్తుతం అల్ప మరియు మధ్య-ఆదాయ దేశాలలో పెరుగుతున్న కరోనా బాధితుల సంఖ్య ఆందోళనకరంగా ఉంది.

AFP లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 325,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

Join us on Telegram

ట్రంప్ లేఖపై WHO

కరోనా మహమ్మారిని నివారించడంలో WHO తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నట్లు అమెరికా విమర్శిస్తుంది.

ఈ నేపధ్యంలో మంగళవారం జరిగిన WHO వార్షిక సమావేశంలో కరోనావైరస్ పట్ల సంస్థ తీరుపై స్వతంత్ర దర్యాప్తుకు సభ్య దేశాల అంగీకరించాయి.

టెడ్రోస్‌కు పంపిన ఒక లేఖను ట్రంప్ బహిర్గతం చేశారు.

అందులో WHO 30 రోజుల్లోపు సమూలమైన మార్పులకు ఉపకరించకపోతే, సంస్థకు అందించే నిధులను శాశ్వతంగా స్తంభింపజేస్తానన్నారు.

అంతే గాక అటువంటి పరిస్థితుల్లో యు.ఎస్. తమ సభ్యత్వాన్ని సైతం విరమించుకుంటుందని పేర్కొన్నారు.

ఈ నేపధ్యంలో WHO నుండి వైదొలగడానికి COVID-19ను ఒక సాకుగా చూపే ప్రయత్నంగా ట్రంప్ బెదిరిస్తున్నట్లు చైనా వాపోయింది.

చదవండి: Corona Cases in India Cross 1 Lakh Mark

WHOకు అమెరికా అందించే నిధులే అత్యధికం.

ఐతే సంస్థ తన నిధులను తీవ్రంగా దుర్వినియోగం చేయడమే కాక, మహమ్మారి వ్యాప్తిని సైతం కప్పిపుచ్చుకుందని ఆరోపిస్తూ, ఇప్పటికే WHOకు నిధులను నిలిపివేసింది ట్రంప్ ప్రభుత్వం.

తమకు ఆ లేఖ అందినట్లు దానిని పరిశీలిస్తున్నట్లుగా టెడ్రోస్ అన్నారు.

COVID-19 మహమ్మారికి సంబంధించిన కాలక్రమం, ప్రతిగా సంస్థ చర్యలపై నిష్పాక్షికమైన, స్వతంత్ర మరియు సమగ్ర విచారణ సాధ్యమైనంత తొందరలో నిర్వహించడానికి WHO అంగీకరించింది.

Join us on YouTube

హైడ్రాక్సీక్లోరోక్విన్ పై సలహా

కరోనావైరస్తో పోరాడటానికి తగినది కాదని తన సొంత ప్రభుత్వ నిపుణులు చెప్పే మలేరియా నిరోధక మందు అయిన హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకుంటున్నట్లు ట్రంప్ సోమవారం ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు.

COVID-19 చికిత్సలో తేలికపాటి కేసులకు కూడా క్లోరోక్విన్ మరియు హైడ్రాక్సీక్లోరోక్విన్‌లను ఉపయోగించాలని బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం సిఫారసు చేసింది.

బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో వారి ప్రభావానికి నిశ్చయాత్మకమైన ఆధారాలు లేనప్పటికీ ఈ చర్యను సమర్ధించారు.

చదవండి: Bharat Ratna Awards Complete Information

హైడ్రాక్సీక్లోరోక్విన్ పై WHO:

హైడ్రాక్సీక్లోరోక్విన్ గానీ క్లోరోక్విన్ గానీ రెండూ COVID-19 చికిత్సలో ప్రభావవంతంగా ఉన్నట్లు నిర్ధారణ కాలేదు.

రోగనిరోధకతపై కూడా ఎటువంటి ప్రభావం చూపలేదు.

COVID-19 కు సమర్థవంతమైన చికిత్సలను కనుగొనటానికి WHO సమన్వయం చేస్తున్న క్లినికల్ ట్రయల్స్‌లో ఈ రెండు మందులు వాడుతున్నారు.

ప్రస్తుతం 17 దేశాలలోని 320 ఆసుపత్రులలో దాదాపు 3 వేల మంది రోగులు ఈ పరీక్షలలో (క్లినికల్ ట్రయల్స్) పాల్గొంటున్నారు.

COVID-19 నివారణకు ఈ ఔషధాలను అటువంటి పరీక్షలలో ఉపయోగంచడం కోసం మాత్రమే కేటాయించాలని WHO తరఫున రియాన్ సలహా ఇచ్చారు.

Join us on Facebook